ADDICTIVE!!!!! in Telugu Motivational Stories by Madhu books and stories PDF | వ్యసనం!!!!!

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

వ్యసనం!!!!!

వ్యసనం.......!!!!!!

చెట్టు ఆకుని శీతాకలం పరీక్షిస్తుంది..... చెరువులో నీటికి గ్రీష్మము పరీక్ష పెడుతుంది.... అలాగే మనిషిని సవాలు చేస్తుంది.....
జానపద కథలలో రాజకుమార్తిని ఎత్తుకోవటానికి రాక్షసుడు తగిన సమయం కోసం వేచి ఉన్నట్టు, మనిషి బలహీనత పక్కనే వ్యసనం వేసి ఉంటుంది ....జీవితంలో నిరాశక్తతని పోగొట్టుకోవడానికి చాలా మంది వ్యసనానికి బానిసలు అవుతున్నారు... టెన్షన్ తగ్గించుకోవడానికి సిగరెట్ నీ దిగులు పోగొట్టుకోవటానికి డ్రింక్ నీ ఆశ్రయిస్తారు.....



జీవితం అనే కురుక్షేత్రంలో, అశాంతి "దుర్యోధనుడైతే "వ్యసనం "శకుని "లాంటిద....
ఇది మన మిత్రుడిలాగే మనని వెన్నంటి ఉండి మనం చచ్చిపోయే వరకు శల్య సారథ్యం చేస్తుంది.....


ఈ వ్యసనాలనేవి సాధారణంగా యుక్త వయసులో అలవాటు అవుతాయి..... నలుగురు స్నేహితుల ముందు తన యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని పోగొట్టుకోవటం కోసం ,ఒక కుర్రవాడు మొట్టమొదటి సిగరెట్ కాల్చి అతిపెద్ద విజంగా పొంగిపోతాడు..... అలాగే నలుగురు స్నేహితులు నలుగురు స్నేహితులు," నువ్వు ఇంతవరకు భీరు కూడా తాగలేదా అని ఎద్దేవా చేస్తే, మొట్టమొదటిసారి దాన్ని ప్రారంభిస్తాడు..... చాలా కాలం వరకు ఈ వ్యసనం అలవాటుగానే ఉంటుంది....

అలవాటుకి, వ్యసనానికి చాలా తేడా ఉంది....ఎప్పుడైతే అది లేకుండా కూడా మనం బ్రతకగలమో, అప్పుడు అది అలవాటు .....అది మనని డామినేట్ చేయడం మొదలుపెడితే వ్యసనం....



దురదృష్టవశాత్తు చాలామంది తమ వ్యసనాలని అలవాటుగా భావిస్తారు.... ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలం కదా అనుకుంటూ ఉంటారు.... మానేస్తారు కూడా!!! కానీ కొంత కాలానికి తిరిగి మొదలుపెడతారు.....


బాత్రూంలో గట్టిగా పాటలు పాడటం, ఇల్లంతా విజిల్ వేసుకుంటూ తిరగటం ,గాలిలో బౌలింగ్ చేస్తున్నట్లు చేయి తిప్పటం, మొదలైన అన్ని కూడా వ్యసన రూపంలో ఉన్న అలవాట్లే.... అయితే వీటి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు.... (వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇబ్బంది తప్ప )

వ్యసనాలు రెండు రకాలు.....
1. మంచి వ్యసనాలు ,
2.చెడ్డ వ్యసనాలు
చెడ్డ వ్యసనాలు మళ్లీ రెండు రకాలు.... 1.హానీ చేసే వ్యసనాలు....
2.హాని చేయని వ్యసనాలు....
హాని చేసే వ్యసనాలంటే తాగుడు, పేకాట లాంటివి ..... హా ని చేయని వ్యసనాలు అంటే, గట్టిగా పాటలు పాడటం, విజిల్ వేయడం లాంటివి..... వ్యసనాలలో మంచివి కూడా ఉంటాయా అని అనుమానం రావచ్చు !!!ఉంటాయి కూడా.....!!!

ఒక మీటింగులో అక్కినేని నాగేశ్వరరావు గారి ఉపన్యాసం వినటం తటస్తించింది….. ఆ వయసులో కూడా అంత హుషారుగా ఉండటానికి కారణం తనకి చెట్ల మీద, గార్డెనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అని ఆయన అన్నారు .... ఆ విషయం ఆయన స్టూడియో చూసినా,ఇల్లు చూసినా కూడా తెలుస్తూ ఉంటుంది..... అలక్నందా నదుల్ని, ఆల్ప్స్ పర్వతాన్ని, చూడటానికి మనం ఎక్కడెక్కడికో వెళతాం.... కిటికీ తెరిస్తే కనపడే సూర్యోదయాన్ని, చూడటానికి మాత్రం అంత ఆసక్తి కనపరచం.....

ఈ నాలుగు సంవత్సరాల కాలానికి ఒక విశిష్టత ఉంది... మేము కాలనీలో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, గౌరవనీయులైన మున్సిపాలిటీ వారు మా ఇండ్ల మధ్య ఒక పార్కు కోసం కొంత స్థలాన్ని కేటాయించి, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి లోపల ఒక 10 మొక్కలని పాతి , బాధ్యత తీరినట్లు వెళ్లిపోయారు.... మహామేధావి అయిన ఒక ఆర్కిటెక్ట్ ఆ పార్క్ గోడని మెట్ల లాగా అందంగా కట్టాడు ...ఆ మెట్ల మీద నుంచి మేకలు మహారాజు లాగా నడుచుకుంటూ విరివిగా లోపలికి వెళ్లి మొట్టమొదటి రోజే ముక్కలని తినేసాయి.....

అప్పుడే నేను నాగేశ్వరరావు గారి ఉపన్యాసం వినటం తపస్తించి ఒక ఆలోచన వచ్చింది కాలనీ వాళ్లతో చర్చించాను.....


దాదాపు 90 శాతం నన్నో పిచ్చివాడిగా చూశారు ....మిగతా పది శాతం మాత్రం పార్కు చుట్టూ ఇనుప తీగలతో ఫెన్సింగ్ వేయడానికి అయ్యే ఖర్చును భరించటానికి ఒప్పుకున్నారు.... అందులో ఒక ఐదు శాతం డబ్బు ఇవ్వవలసి వచ్చేసరికి మర్యాదగా తప్పుకున్నారు ....సరే పెన్షన్ కట్టాము చెట్లు వేయించాం ...ప్రతిరోజు వాటికి నీళ్లు ఎవరు పోస్తారు... అన్న సమస్య వచ్చింది దానికి కూడా చివరలో ఇద్దరు ముగ్గురే మిగిలారు.....కొంతకాలానికి వాళ్లు జారుకున్నారు.... ప్రతిరోజు పొద్దున్న రెండు మూడు కిలోమీటర్లు నడవడం శరీరానికి చాలా మంచిది ....అని డాక్టర్లు అంటూ ఉంటారు....i అటువంటప్పుడు చెట్లకు నీళ్లు పోస్తే ఆ ఎక్ససైజ్ తో పాటు పుణ్యం ,పురుషార్థము కూడా కలుగుతుంది కదా అన్న ఆలోచనతో ఆ పని ప్రారంభించాను ...రోడ్డు మీద చెట్లకి పార్కులో ఉన్న మొక్కలకి ఇంట్లోంచి నీళ్లు తెచ్చి పోస్తున్న, నన్ను ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసి నవ్వుకున్నారు ...కానీ నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ చెట్లని చుట్టూ విస్తరించుకొని మా వీధికే ఒక అందం వచ్చింది ఆ తర్వాత నేను ఊటీ వెళ్ళినప్పుడు ఒక బోర్డు చూసాను దానిపై ఇలా ఉంది.....


" మీరు ఇంత అందమైన ప్రకృతిని కొండల మీద పచ్చగా పరుచుకున్న చెట్లని చూడగలుగుతున్నారంటే దానికి కారణం జోస్ థామస్....."

ఈ జోస్ థామస్ అనే వ్యక్తి ఒకప్పుడు నీలగిరి కొండల నిండా దాదాపు పదివేల ఫైన్ మొక్కలని ఒక్కడే నాటాడట.... ఇరవై సంవత్సరాల తర్వాత అవన్నీ వృక్షాలు అయి ప్రస్తుతం మనం చూస్తున్న ఊటీగా మారిందట ఆ రోజుల్లో అందరూ అతడిని మ్యాడ్ థామస్ అనే వారట....

ఇప్పుడు నేను కిటికీ తెలిస్తే ముందుగా పార్కు కనబడుతుంది... అందులో ప్రతి చెట్టు నేను నీరు పోసి పెంచి పెద్ద చేసిందే... అప్పుడే రాశాను అలకనంద ని చూడటానికి మనం వందల ముళ్ళు ప్రయాణం చేస్తాం ...కిటికీ తెలిస్తే కనపడే సూర్యోదయాన్ని చూడటానికి అంత ఆసక్తి కనపరచం... నాలుగు సంవత్సరాల కథ ఇది... అదే వ్యసనం అంటే.... ప్రస్తుతం నేను చదువుతున్న ఒక పుస్తకంలో రచయిత అంటాడు... ఒకప్పుడు నేను సిగరెట్లు వ్యసనంగా తాగేవాడిని... అది మానేసి ప్రొద్దున్నే ఐదు కిలోమీటర్లు పరిగెత్తడం ప్రారంభించాను... అప్పుడు పరిగెత్తకుండా ఉండలేను తెల్లవారేసరికి పరిగెత్తడం అనేది నాకు ఒక వ్యసనంగా మారింది ....

మంచి వ్యసనం అంటే... అది చెట్లని పోగొట్టుకొని మనం ఏం కోల్పోతున్నాము.... మనకి తెలియటం లేదు... గత ఐదేళ్ల నుంచి ఏడాదికి మూడు నెలలు కరెంటు పోతావుంటోంది... వీలైతే రోజు విడిచి రోజు కొన్ని గంటలపాటు వస్తాయి... వర్షాలు సరిగ్గా పడటం లేదు ...ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఏడాదికి ఆరు నెలలు కరెంటు ఉండదు ...వారానికి ఒకరోజే నీళ్లు వస్తాయి ....దానికి మన కర్మ అనుకొని భరిస్తాం.... లేదా ఏ రాజకీయ పార్టీ అయినా వారం రోజులపాటు నీళ్లు అని వాగ్దానం చేస్తే ,వారికి ఓటు వేస్తాం... అంతే తప్ప మనం పని చేయాలి... మనలోనే ఒక జోష్ థామస్ ని మేల్కొల్పాల నీ ప్రకృతిని ప్రేమించలేని మనం జీవితాన్ని ఏం ప్రేమించగలుగుతాం .?సమయం ఎవరికీ ఉంటుందని మీరు అడగొచ్చు... జీవితపు నిరాసక్తత కి కారణం ...నిరర్థకరమైన సమయం మిగిలి ఉండటమే కరెంటు తీగలకి అడ్డొస్తున్నాయని ,చెట్లు కొమ్మలు నరికేస్తుంటే ,దుక్కించిన వ్యక్తి గురించి " ప్రేమ" నవలలు రాశాను ...మనకి ప్రకృతి పట్ల అంత బాంధవ్యం లేకపోవచ్చు... కానీ ముంచుకుని వస్తున్న ప్రమాదాన్ని గుర్తించటం... మన బాధ్యత అంతేకాదు... అది ఆనందకరమైన వ్యసనం కూడా.... జీవితం నిరాశక్తంగా అనిపించినప్పుడు ఒంటరితనంతో సుతమైతమైపోయే బదులు ఒక పుస్తకాన్ని వ్యసనంగా చేసుకోండి... భరించలేని దిగులు ఆవరించినప్పుడు తాగుడికి అలవాటు పడొచ్చు, దాని బదులు ఒక గుడికి వెళ్ళటాన్ని వ్యసనంగా చేసుకోండి ...మరీ బోర్ గా ఉన్నప్పుడు సిగరెట్ తాగాలనిపించడం ఒక వ్యసనమైతే, మంచి పాట వినడం విసనంగా మార్చుకోండి....


చెడ్డ వ్యసనం మనని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకుంటుందో ,మంచి వ్యసనం ఒక స్నేహితుడిగా మన పక్కన చేరి మనతోపాటు ఉండి స్ఫూర్తినిస్తుంది .....అందుకే ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఇలా అన్నాడు ....
ఒకటి :-ఒక మంచి ఆలోచనని అంకురంగా వేయండి ....ఒక స్ఫూర్తి ములక పైకొస్తుంది...
2:-రెండు ఒక స్ఫూర్తి మొలకని అంటు కట్టండి... ఒక చర్య పుష్పిస్తుంది ...
3:- చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి... అలవాటు అనే ఫలం పక్వానికి వస్తుంది...
4:- అలవాటు అనే ఫలాన్ని ఆస్వాదించండి... అది మీకు లక్ష్యం చేరుకునే శక్తినిస్తుంది.......


🌹 దన్యవాదములు 🌹