1. సమానత్వ భావన.......
***********************
ప్రకృతి సమానత్వ భావనను
కలిగి ఉంటుంది ప్రాణులన్నీ
భేదం లేకుండా,
కుల మత వర్గ విచక్షణ కలిగిన
మనుషులు అనే భేదం లేకుండా, అందరికీతనలోని భౌతిక
అంశాలను అందజేస్తుంది.......
2.అడగకుండా అందించే గొప్ప మనసు.....
*************************************
అడగకుండా సహజంగా అందించే
మనసు ప్రకృతికి ఉంటుంది....
ప్రకృతి కులమత బేధాలు పాటించదు... చిన్నవాడివా, పెద్దవాడివా,ధనికుడివా, పేదవాడివా అనే భేదం లేదు....
అందరికీ అన్ని సమకూర్చడం
అనేదిగొప్ప సమతా భవన
ప్రకృతిలో ఉంది..........
3.సమతుల్యత పాటించడం.......
*****************************
ప్రాణులు ప్రకృతి పదికాలాల పాటు
ఆరోగ్యంగా సహజంగా జీవించాలని,
ఉనికిలో వ్యర్థమైన జీర్ణమైపోయిన,
పదార్థాలను శోషించుకుని,
ఎల్లప్పుడూ సమతుల్యతలను,
ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటుంది.....
4. క్రమశిక్షణను పాటించడం.....
***************************
నియమిత సంఘటనల ద్వారా,
సూర్యచంద్రుల గమనం ద్వారా,
ప్రాణులు ఆహారం కోసం ప్రయత్నిస్తున్న,
సందర్భంగా క్రమశిక్షణను తెలుపుతుంది...
ఇట్టి క్రమశిక్షణ మానవులకు శిరోధార్యం...
5. నియమాల ఉల్లంఘన లేకపోవడం.....
***********************************
నిరంతరాయంగా జరిగే సంఘటనలను, ఎప్పుడూ ఉల్లంఘించదు.....
ప్రకృతి తన నియమాలను,
నిరంతరాయంగా ఆగకుండా,
తన నియమాలను ఎప్పుడూ, ఉల్లంఘించదు.........
6. అపారమైన జ్ఞాన సంపద కలిగి ఉండటం.....
****************************************
నేడు సైన్స్ జరుగుతున్న ప్రయోగాలు,
ఆవిష్కరణలు ,ప్రాచీన కాలం
కనుగొన్న అనేక రహస్యాలు,
ప్రకృతిలోని అపారమైన
జ్ఞాన సంపద తోనే జరిగాయి......
7.ఆనందాన్ని,వినోదాన్ని,ఆరోగ్యాన్న కలిగిస్తుంది....*******************************************
ప్రకృతి ఆనంద ప్రదాయిని.....
నోరులేని,మూగజీవాలకు,
ఆహారాన్ని,ఆరోగ్యాన్ని,
సమకూరుస్తుంది........
ప్రకృతి తత్వాన్ని అనువైన,
సహజ జ్ఞానాన్ని వాటికి ఇచ్చింది....
అలాగే మనిషి యొక్క,
అనారోగ్యాలకు రోగాలకు ,
ఔషధాలను ఇస్తుంది.....
మనసుకు బాధలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రకృతి తన సుందరమైన దృశ్యాలతో వీనులవిందైన,
సంగీతంతో హాయిగొలిపే చల్లని ,
సమీరంతో తన నీడలా,
వెన్నుదన్నుగా మన మనసుకు,
ఆనందాన్ని వినోదాన్ని ఆరోగ్యాన్ని
కలిగించి తేలికగా చేస్తుంది.....
8.ప్రకృతిని నిశితంగా పరిశీలించి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.........
********************************************************************
చీమల ద్వారా క్రమశిక్షణను ,
నేర్పుతుంది... ఎన్ని ఒడిదుడుకులు,
అడ్డంకులు ,ఎదురైనా తను అనుకున్న,
గమ్యాన్ని చేరుకోవాలని, మనకు
"నదుల"ప్రవాహం ద్వారా సందేశం
ఇస్తుంది .....తన కోసం కాకుండా
పరుల కోసం జీవించాలని,
గాలిని ,ఆహారాన్ని నీడనిచ్చే
ఒక "చెట్టు"ద్వారా మనకు
బోధిస్తుంది .......మనిషి తన
ధర్మాన్ని ఎల్లవేళలా, ఎలాంటి
లోపం లేకుండా నిర్వహించాలని, "సూర్యచంద్రుల" ద్వారా
ప్రకృతి తత్వం తెలియజేస్తుంది.....
ఎంతగా భాదించినను నిర్లక్ష్యంగా ,
చూసినా ఓర్పును కలిగి ఉండాలని ,
"నేల"తత్వం ద్వారా ప్రకృతి
మనకు నీతిని బోధిస్తుంది....
కుల ,మత ,వర్గ ,వర్ణ విచక్షణ
చూపకుండా పెద్ద ,చిన్న , భేదం,
చూపకుండా ,అందరినీ సమానంగా
చూడాలని ,అందరికీ సమానంగా,
పంచాలని, సమానత్వ భావనను
"గాలి"ద్వారా మనకు అందజేస్తుంది....
ఆకలిని ,దాహాన్ని ,అవసరాన్ని
గురించి అడిగిన అడగకపోయినా, సమకూర్చాలని మహోన్నత,
విశిష్టమైన భావనను
తన బిడ్డలైన ఈ సకల ప్రాణికోటికి,
"మొక్క"ల ద్వారా
ఆహారాన్ని సమకుర్చుట,
అనే కర్తవ్యం ప్రకృతి తెలియజేస్తుంది....
తన వద్ద లేకున్నాను, ఇతరుల
వద్ద తీసుకొని అవసరమైన ,
వేళలో అందజేయాలని గుణాన్ని
"వర్షం"ద్వారా తెలుపుతుంది ....
తనలోని కల్మషాలను కడిగేసుకుని, ఎప్పటికప్పుడు నూతనంగా,
ఆరోగ్యంగా ఉండాలనే,
విధానాన్ని "నీటి" తత్వం ద్వారా,
మనకు బోధిస్తుంది.......
నిరంతరాయంగా నిస్వార్ధంగా,
పనిచేయాలని తనలోని చతుర్భుతాల,
ద్వారా మహోన్నత సందేశాన్ని
తెలుపుతుంది ......దయ, జాలి
సానుభూతి "ప్రేమ" తత్వం
అహంకార గుణం ఇవన్నీ
ప్రకృతిలో ఉన్నాయి...
ఇవే మనిషికి తోటి మనిషికి,
మధ్యన ఉండవలసిన సుగుణాలు.....
ఈ ప్రకృతిని పరిశీలించకండి,
ప్రకృతి తత్వాన్ని గ్రహించండి,
ప్రకృతిలోని సుగుణాలను,
అలవరుచుకోండి......
మీ జీవన విధానాన్ని సరి చేసుకోండి.........
ఆరోగ్యము.........
****************
ఈ క్రింది ఔషధాలు ఎప్పటికీ
మందుల షాపులలో దొరకవు......
1 వ్యాయామమే ఔషధం.....
2.ఉపవాసమే ఔషధం....
3.సహజ ఆహార ఔషధం.....
4.నవ్వు ఔషధం
5.కూరగాయలు ఔషధం
6.నిద్ర ఔషధం
7.సూర్యకాంతి ఔషధం
8.ఎవరినైనా నిస్వార్ధంగా ప్రేమించడం ఔషధం 9.ప్రేమించబడడం ఔషధం
10.కృతజ్ఞత అనేది ఔషధం
11.నేరాన్ని వదలడం ఔషధం
12.ధ్యానం ఔషధం
13.మంచి స్నేహితులే ఔషధం
ఈ ఔషధాలు తగినంతగా,
మీ అంతకు మీరేసంపాదించుకోవాలి......
పై ఔషదాలు సంపాదించుకుంటే,
బజారులో ఉండే మందుల షాపులలో,
ఉండే ఔషధాలతో,
99% అవసరమే ఉండదు.....
ఆరోగ్యమే మహాభాగ్యము......
***************************
🚶1.రోజుకి నడక ఎన్ని అడుగులు నడిస్తే మంచిదో నిపుణుల అభిప్రాయాలు....
చాలా మందికి ఈ సందేహం ఉంటుంది.....ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని అడుగులు నడవాలి అని.....
మనం తీసుకునే ఆహారం,జీవన విధానం ప్రధాన పాత్ర పోషిస్తాయి.....
అదే విధంగా,ఒత్తిడి లేకుండా ఉండాలి....
మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి
చాలా అవసరం.... అలాగే
వ్యాయామం కూడా....
మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది....
వ్యాయామం చేయడం వల్ల,
చాలా ప్రయోజనాలని ,మనం పొందవచ్చు......కేవలం
ఆరోగ్యంగా, శక్తివంతంగా,
మాత్రమే కాకుండా, ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా
జాగ్రత్తగా ఉండవచ్చు....
[1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు 1491 అడుగులు]
1.ఎంత నడవాలి........
********************
ప్రతిరోజు నడవడం మంచిది ,
అంటూ ఉంటారు....అయితే,
ఎంత దూరం నడవచ్చు....
ఎన్ని అడుగులు ,
అనే సందేహం చాలా
మందిలో ఉంటుంది......
మరి దాని గురించి మనం
తెలుసుకుందాం..........
శక్తివంతంగా ఉండడానికి,
సమస్యలు లేకుండా ఉండడానికి
ఎన్ని అడుగులు వేయాలి ....
అనేది మనం చూస్తే....
తాజాగా చేసి సర్వే ప్రకారం,
10 వేల అడుగులు వరకు
రోజూ నడిస్తే మంచిదని,
తెలుస్తోంది......రోజుకి 7 వేల అడుగులు
(4.695 కిలోమీటర్లు) నడవవచ్చు.....
తాజాగ ప్రచారం చేసిన,
ఈ సమాచారాన్ని బట్టి
ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి....
కనీసం రోజుకి 7 అడుగులు వేస్తే మంచిదట.... అయితే, 10 వేల అడుగుల
కంటే ఎక్కువ నడవడం లేదా
వేగంగా నడవడం వలన
అంత ప్రయోజనం లేదు .....
అని డాక్టర్లు చెబుతున్నారు.....
ఎన్ని అడుగులు వేయడం
వల్ల ప్రయోజనాలు పొందవచ్చు....
అని చూస్తే ఈ పరిశోధనలో,
2100 మంది పాల్గొనడం జరిగింది....
వీళ్ళ వయసు 38 సంవత్సరాల నుండి
50 సంవత్సరాల మధ్య ఉన్నాయి.....
అయితే వీళ్ళని మూడు గ్రూపులుగా
కింద విభజించారు....
రోజుకి 7 అడుగుల కంటే తక్కువ నడిచిన వాళ్ళు.....
7000 నుండి ,
9,999అడుగులు నడిచిన వాళ్ళు.......
10 వేల కంటే ఎక్కువ అడుగులు నడిచిన వాళ్ళు.....
అయితే 7 వేల నుండి పదివేల మధ్య అడుగులు నడిచిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారని మరణాల ప్రమాదం
తగ్గిందని తెలిసింది..........
ఇక పదివేల అడుగుల కంటే
ఎక్కువ నడిచిన వాళ్లలో ఎటువంటి ప్రయోజనాలు కనపడలేదు......
ఇది ఇలా ఉంటే 4 వేల నుండి 5 వేల అడుగులు నడిచిన వాళ్ళు కూడా
కాస్త పరవాలేదు అనిపించిందట......
ఎక్కువ నడిస్తే.........
********************
5 వేల అడుగులు (3.353 కిలోమీటర్లు)......
నుంచి 6 వేల అడుగులు (4,024 కిలోమీటర్లు)...
నడిచిన వాళ్లలో,
పెరుగుతున్న ప్రమాద తగ్గింది .....
10 వేల వరకు ఇలానే ఉంది.....
కానీ, అంతకంటే ఎక్కువ అడుగులు
నడవడం వలన ,అంత పెద్ద
ఉపయోగం ఏమీ లేదని,
సరిపోల్చడం వల్ల తెలిసింది అన్నారు....
గమనిక.........
**************
ఆరోగ్య నిపుణులు అధ్యయనాల
ప్రకారం
ఈ వివరాలను అందించాం
ఈ కథనం కేవలం మీ అవగాహన
కోసమే ఆరోగ్యానికి సంబంధించిన,
ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను,
సంప్రదించడమే ఉత్తమ మార్గం.....
🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏