" నీకు మెహర్ విషయాలు తెలిశాయి. నాకు ఆపరేషన్ జన్నత్ క్లూ దొరికింది. " ఇంతియాజ్ స్వరంలో ఉద్వేగం, ఉత్సాహం. స్పందనగా విహారి నవ్వాడు.
" సర్ ! వాటీజ్ అన్వర్ ఫర్దర్ మూవ్ ?" విహారి ప్రశ్న కు వెంటనే వివరణ ఇవ్వలేదు ఇంతియాజ్. ఆలోచిస్తూ ప్రశాంతంగా కూర్చుండి పోయాడు.
అన్వర్ హైదరాబాద్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది.
ఈ మధ్య కాలంలో తన వాళ్ళను కలిశాడో లేదో . ఒకవేళ కలిసినా తన గురించి నిజం చెప్పాడా ? లేక తన ఉనికి కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాడా ?"
" అలాంటప్పుడు మెహర్ ని కలిసే విషయంలో ఆచి తూచి
అడుగెయ్యాలి. ఏం మాత్రం తొందరపడినా మన ప్లాన్ మొత్తం మిస్ ఫైర్ అవుతుంది."
" ఎక్జాక్ట్లీ ! అంతేకాదు. ఆపరేషన్ జన్నత్ క్లూ ఛేదించడంలో కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి.వారు నడిపేది భయంకరమైన డ్రగ్స్ రాకెట్. మతం ఇచ్చిన మార్ఫియా మత్తు మనిషిని రోబోను, రాక్షసుడిని చేస్తుంది. పైగా డ్రగ్స్ రాకెట్ మానవ మృగాలు గా ప్రవర్తిస్తారు. . ఏమాత్రమైనా వారు మన ప్ర్ప ప్రయత్నాలు పసిగడితే భీభత్సం సృష్టించి సామాన్యులను టార్గెట్ చేస్తారు. మన తొందరపాటు వల్ల అమాయకులు ల్ల బలైపోతారు. .
" కాని గౌరవనీయులైన హోం అమాత్యులు వారన్నట్లు మన ఆపరేషన్ పూర్తి కావాలిగా. " విహారి మాటల్లో శ్లేషకు ఇంతియాజ్ వినోదంగా నవ్వాడు.
" ముందు మెహర్ని అన్వర్ కలుసుకున్నాడో లేదో తేల్చుకోవాలి." అలా అర్థవంతంగా ఆపి విహారి కళ్ళల్లోకి చూశాడు ఇంతియాజ్. విహారి కి బాస్ ఆంతర్యం అర్థమైంది.
" షాపు యజమాని ఆ గడ్డం పెద్దాయన నా వివరాలు తప్పక
మెహర్ కు ఫోన్ చేసి చెప్పి ఉంటాడు. ఆయన ఆత్రం, కుతూహలం ఆయనది. సో , మెహర్ నా కోసం చూస్తుంటుంది. "
" కానీ గడ్డం పెద్దాయన థర్డ్ పర్సెన్. ఏవేవో కబుర్లు చెప్పి నవ్వించ గలిగావు. మెహర్ జలీల్ భాయ్ కూతురు. తండ్రి విషయాలు తెలీకుండా ఉంటాయా ? పైగా అన్వర్ తెలుసు అన్నావు.
" గురువు గారు అన్వర్ ఇల్లు వదిలి వెళ్ళే సమయానికి మెహర్ కు పట్టుమని పదేళ్లు లేవు. ఊహ తెలియని వయసులో ఉన్న అమ్మాయికి తన తండ్రి ఉద్యోగ వివరాలు
తెలిసుంటాయా ? ఎవరో తన అన్నకు తెలిసిన వ్యక్తి త్వరలో కలుస్తాడన్న ఆత్రం తప్ప. డోంట్ వర్రీ . ఐ విల్ మానేజ్. " విహారి భుజం తట్టి ఇంతియాజ్ చిన్నగా నవ్వాడు.
" మరి ఆపరేషన్ జన్నత్ క్లూ?" ప్రశ్నార్థకంగా చూశాడు విహారి.
" తెలుసుగా ! ఈ రాకెట్ ఉద్దేశం పూర్తిగా డబ్బు సంపాదించడం కాదు. వారి టార్గెట్ నాన్ ముస్లిం యూత్.
to weaken their morale and to make them totally useless............their selection of youth......ఖరీదైన కార్పొరేట్, పాపులర్ కాలేజీల్లో చదివే బంగారు పిచ్చుకలు.
వారిపై మత్తు వేల వేయడానికి దాదాపు ఆరునెలల పైనే పట్టి ఉండొచ్చు. ఎ వెల్ ప్లాన్డ్ నెట్వర్క్.......మరో విషయం. ఇంతవరకు డ్రగ్స్ కేసంటూ నాకు తెలిసి ఏ స్టేషన్ లోనూ
రిజిస్టర్ కాలేదు. సాధారణంగా డ్రగ్స్ కేసు వస్తే నగరపరిధిలో ఉన్న అన్ని స్టేషన్స్ నూ అలెర్ట్ చేస్తారు. అది జరగలేదు. అంటే వారు మనకు ఆవగింజంతైనా అవకాశం ఇవ్వటం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలపై వీకెండ్స్ లో రెయిడ్ చేయాలి." ఆలోచనగా ఆగాడు ఇంతియాజ్.
" ఎంత రహస్యంగా రెయిడ్ చేసినా మూమెంట్స్ వారికి ఏదో విధంగా తెలుస్తాయి. ..It can not be stopped. "
" మరి సొల్యూషన్ ఏమిటి ?"
విహారి గొంతు లో పచ్చి వెలక్కాయ పడింది.
కంగారు పడకు. మెదడుకు పని పెడితే ఏదో ఒక క్లూ దొరక్క పోదు." నవ్వుతూ భుజం తట్టాడు ఇంతియాజ్.
సాయంకాలం " సాగర్" క్యాంపస్ సందడి గా ఉంది. ఇంటికి వెళ్ళే సమయం . అందరూ రిలాక్స్ డ్ గా ఉన్నారు.
మెహర్ జీ ! ఈరోజు బంద్. ఆరు తర్వాతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీకు నా బుల్లెట్టే శరణ్యం.
ఆదిత్య మాట తీరుకు మెహర్ నవ్వింది.
" మీకెందుకు శ్రమ. గంట ఇట్టే గడిచిపోతుంది. బాస్ లో వెళతాను."
" నేను మిమ్మల్ని మోయటం లేదు. నా బండి మోస్తుంది. పైగా మీ ఇల్లు మా ఇంటి దారిలోనే . మొహమాట పడక బైక్ ఎక్కండి ".
ఇక తప్పలేదు మెహర్ కు .
బంద్ ప్రభావం పూర్తిగా తొలగి పోలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిపాటి రద్దీ కనిపిస్తోంది. ఆదిత్య బుల్లెట్ ఠీవిగా సాగిపోతోంది.
మెహర్ ఇంటి ముందు బుల్లెట్ ఆగింది. మెహర్ దిగి ఆదిత్యను " టీ" కి ఆహ్వానించింది. ఆదిత్య క్షణం తటపటాయించాడు.
మీ మాట నేను విన్నప్పుడు నా మాట మీరు వినాలి".
ఆదిత్య నవ్వుతూ బుల్లెట్ దిగాడు.
కొనసాగించండి 21