Those three - 10 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ఆ ముగ్గురు - 10

" సాగర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ " ఆ అడ్మిన్ బ్లాక్ పైన సైన్ బోర్డ్ మెరిసి పోతోంది . ఉదయం తొమ్మిది గంటల సమయం . క్యాంపస్ , క్యారిడార్స్ , స్టూడెంట్స్ తో , ఫ్యాకల్టీ మెంబెర్స్ తో సందడిగా ఉన్నాయి . అప్పుడే ఓ ఎన్ ఫీల్డ్ బైక్ రిథమిక్ బీట్ తో స్కూటర్ స్టాండ్ లో వచ్చి ఆగింది . ఓం వ్యక్తి , మరీ ఆజానుబాహుడు కాదు . కాని ఎత్తుగా , హుందాగా ఉన్నాడు. బైక్ దిగి రిమ్ లెస్ గ్లాసెస్ మధ్య వేలితో సున్నితం గా సవరించుకొని ప్రిన్సిపాల్ ఛాంబర్ వైపు అడుగులు వేశాడు . నడకలో ఠీవి , ప్రతి అడుగు లో ఆత్మ విశ్వాసం..... మొదటి చూపులోనే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు .

" మే ఐ కమిన్ సార్ ?"
ఏదో ఫైల్స్ చూస్తున్న ప్రిన్సిపాల్ తలెత్తి చూశాడు.
" కమిన్ ప్లీజ్ ! " కొత్త వ్యక్తి ని ఆహ్వానించాడు. అతడు విష్ చేసి ప్రిన్సిపాల్ ఎదురు కుర్చీలో కూర్చున్నాడు .
" ఐ యామ్ ఆదిత్య." క్షణం ఆగాడు .
" ఓహ్ ! మీరా ?" ప్రిన్సిపాల్ మొహంలో చిరునవ్వు .
" నా గురించి ఆశా మేడం ముందే చెప్పారా ? తనూ నవ్వాడు ఆదిత్య .
" వెల్ కం టు అవర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్"
" థ్యాంక్యూ సర్ " చిరునవ్వు తో మళ్లీ ప్రతిస్పందన .
" యువర్ స్పెషలైజేషన్ ? ఐ మీన్ రీసెర్చ్ లో మీ టాపిక్ " ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ యాగ్రోబేస్డ్ ఫర్మ్స్ ".
" వెరి వెరి టైమ్లీ టాపిక్ " ప్రిన్సిపాల్ అభినందన.
" నాది గ్రామీణ నేపథ్యం . నా కృషి తో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే గ్రామీణ యువకులకు గైడ్ లైన్స్ అందించాలన్న ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకున్నాను . ఓ ఎన్.జీ.ఓ ద్వారా సహకారం అందిస్తున్నాను .
" చాలా మంచి పని చేస్తున్నారు. ఎప్పుడు జాయిన్ అవుతారు ".
" ఇప్పుడే "
" దెన్ మీట్ మిస్టర్ ప్రకాష్ ఇన్ ది ఆఫీస్ ఫార్ ది ఫార్మాలిటీస్ "
" ఓకే సార్ ! " లేవబోతున్న ఆదిత్య క్షణం ఆగాడు .
" మీది చాలా చక్కటి ట్రాక్ రికార్డ్ . ఎమ్ . ఎస్ సి లో ప్రాజెక్ట్ హెడ్ గా మీకు అనుభవం ఉంది . మరి..... అలాంటి పొజిషన్ వదులుకొని ఓ ప్రైవేట్ బిజినెస్ స్కూల్ లో ఫ్యాకల్టీ గా .... "
ఆదిత్య వెంటనే సమాధానం ఇవ్వలేదు . చిరునవ్వు తో క్షణం ఆగాడు " ఐ లైక్ టీచింగ్ ".
" మే ఐ కమిన్ సర్ ?"
ప్రిన్సిపాల్, ఆదిత్య ఒకేసారి డోర్ వైపు చూశారు . పాతికేళ్ల లోపు యువతి పంజాబీ దుస్తుల్లో శిల్పం లా నిలబడి ఉంది . ఆమెను చూడగానే ప్రిన్సిపాల్ మొహంలో ప్రసన్నత మాయమైంది . కర్ర లా బిగుసుకు పోయాడు .
ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ , టేబుల్ ముందు నిలుచుంది .
"ఐ యామ్ వెరీ వెరీ సారీ ! " మొహం దీనంగా ఉంది. మాటలు తడబడుతున్నాయి . "
" వై డూ యూ సే సారీ ? నువ్వు లేటే . యూ ఆర్ ఎ రెగ్యులర్ లేట్ కమ్మర్ " ప్రిన్సిపాల్ తలెత్తలేదు .
సర్ ! రెండు బస్సులు మారి రావాలి . ఎంత ముందు బయలుదేరినా టైముకు రాలేకపోతున్నాను . " ఆదిత్య కు ఆమె బాధ అర్థమైంది . సానుభూతి గా చూశాడు .
" ఈ విషయం లో నేనేమీ చేయలేను . రూల్స్ కాదని రోజూ పర్మిషన్ ఇవ్వను . నీ సమస్య కు మార్గం నువ్వే చూసుకోవాలి . " ప్రిన్సిపాల్ అంగుళం కూడా దిగి రాలేదు .
" అంత దూరం నుండి టూవీలర్ లో రావడం కష్టం సర్ . ఐ యామ్ ఎ లేడీ ".
ఆదిత్య కు పరిస్థితి అర్థమైంది.
" సర్ ! మీరేమీ అనుకోనంటే నేనొక మాట చెప్పనా ?"
" ష్యూర్లీ "
" మేడమ్ కు ఫస్ట్ అవర్ లీజర్ ఇవ్వండి. కాస్త ఆలస్యం అయినా షెడ్యూల్ దెబ్బ తినదు."
" మంచి ఐడియా న
. కానీ. మిగతా స్టాఫ్ ఒప్పుకుంటారా ? అదో అవకాశం గా తీసుకోరా ?"
" ఎవరు అబ్జెక్షన్ పెడతారో వారిని మేడం పొజిషన్ లో ఊహించుకొనమనండి . వారినే సొల్యూషన్ ఇవ్వమనండి .
దట్సాల్. వారింక నోరెత్తరు . ఐయామ్ ష్యూర్ "
మెహర్ (మేడం.. ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ) మొహంలో ఆతృత.
కొన్ని క్షణాలు ఘనీభవించిన కాలం .
" ఓకే మెహర్ ! మీ హెచ్.ఓ.డీ ని ఒకసారి నన్ను కలవమని చెప్పు." ప్రిన్సిపాల్ కు ఆదిత్య సలహా నచ్చింది .
మెహర్ ఊపిరి పీల్చుకుంది . కృతజ్ఞతగా ఆదిత్య వైపు చూసింది .
" మీరు మంచి ట్రబుల్ షూటర్ ఆదిత్యా ! '" ప్రిన్సిపాల్ కితాబు. ఆదిత్య చిరు దరహాసం .

ఆదిత్య కారిడార్ లో నడుచుకుంటూ క్లాస్ రూమ్ వైపు అడుగులు వేశాడు . ఓం క్లాస్ రూమ్ లో నుండి మెహర్ బయటకు వచ్చింది . ఆదిత్య ను చూసి చిరునవ్వు తో ఆగింది . ఆదిత్య ఆగాడు .
" మీకు చాలా థాంక్స్. మీ ప్రయత్నం వల్లే నా సమస్య తీరింది . మీ రీజనింగ్ సార్ కు బాగా నచ్చింది .
" నిజానికి ఈ మాత్రం ఆలోచన ఆయనకే ఉండాలి . రూల్స్ అంటూ ఆయన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు .
" కొన్ని సందర్భాల్లో ఆయన మొండి తనం మనకు చిరాకు కలిగిస్తుంది. కాని...ఆ మాత్రం పట్టుదల...పట్టు లేకపోతే ఈతరం యువతరం మాట వింటుందా ?"
" సారీ ! మీ అభిప్రాయం తో నేను ఏకీభవించను . పిల్లలు అల్లరి చేయటం సహజం . ఆ అల్లరి శృతి మించకుండా కట్టడి చేస్తేనే అందం...ఆనందం . సైలెన్స్ కు. గ్రేవ్ యార్డ్ సైలెన్స్ కు చాలా బేధం ఉంది."
అతడిని చిరునవ్వు తో చూసింది మెహర్ .

కొనసాగించండి........11
..