Those three - 7 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 7

Featured Books
Categories
Share

ఆ ముగ్గురు - 7

అన్వర్ రాడార్ పరిధిలో కి రాకపోవడం నిజంగా ఓ అద్భుతం ! ఊహించని టర్నింగ్ పాయింట్ .
" అతడు నిలుచుంది కొండవాలు చివర సర్ . పైగా మంచు
పడుతోంది . సీక్రెట్ కెమెరా గురి తప్పించుకోవడానికి ఈ రెండూ కారణాలు కావచ్చు . ఏదైమైనా అన్వర్ భాయ్ అదృష్టవంతుడు . చావు తప్పించుకున్నాడు . మనకు, తెలంగాణా ఇంటెలిజెన్స్ వింగ్ కు చేతి నిండా పని కల్పించాడు .
రావ్ మాటలకు నవ్వాడు జూనియర్ .
" స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్ లో ఇంతియాజ్ అనే ఏ.సి.పి స్థాయి ఆఫీసర్ ఉన్నాడు . కౌంటర్ మిలిటెంట్ ఆపరేషన్స్ నిర్వహించటంలో ట్రైనింగ్ తీసుకున్నాడు . డిపార్ట్మెంట్ తరపున మన మెసేజ్ అతడే రిసీవ్ చేసుకుంటాడు . వెల్ ట్రైన్స్, డ్యూటీ మైండెడ్ అండ్ వెరీ డైనమిక్ . " అన్వర్ సెర్చ్" అతడి పర్వ్యూ లోకే రావచ్చు. నేను రెకమెండ్ చేస్తాను .రావ్ జూనియర్ ను సాభిప్రాయంగా చూశాడు . అలీ పహరా సిబ్బంది కి దొరకటం , అన్వర్ తప్పించుకోవడం, ఆపరేషన్ జన్నత్ వివరాలు మీడియా వెలుగులోకి రాకుండా సెన్సార్ చేయబడ్డాయి . సరిహద్దు దాటుతూ నలుగురు ఉగ్రవాదులు బి.ఎస్. ఎఫ్ జవాన్ల చేతిలో హతమైయ్యారు ."
అన్న వార్తే ప్రజలకు చేరింది.

చాలా సంవత్సరాల తరువాత తెలుగు వార్తలు టీ.వీ లో చూస్తున్నాడు అన్వర్. రహీం చెప్పిన మాట ను సిన్సియర్ గా పాటిస్తున్నాడు . ఓపిక ఉన్నంతవరకు , విసుగు రానంత వరకూ టీ.వీ ముందు కూర్చుంటున్నాడు. లేదంటే పడకే . ఇదీ అన్వర్ పరిస్థితి .

" ముస్లిం యువకుల్లో మతం పట్ల అవగాహన కల్పించి ,
శాంతి పూర్వక సహజీవనానికి , ప్రపంచ శాంతి కి కృషి చేస్తున్న డాక్టర్ ఇనాయతుల్లా" న్యూస్ రీడర్ ఈ వార్త చెప్పగానే టీ.వీ స్క్రీన్ పై అయిదు పదులు నిండిన ఓ వ్యక్తి
చిత్రం కనిపించింది . ఆయన వాలకం చూస్తుంటే విద్యావేత్త
అనిపించింది.
" రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే సద్భావనా సదస్సు కు ప్రధాన వక్త డా. ఇనాయతుల్లా . మౌలికంగా మతం అంటే ఏమిటి ? శాంతి యుతి సహజీవనం అన్న
ఆదర్శాన్ని ఎందుకు పాటించాలి ? నేటి యువత వ్యక్తి గత
వికాసం కోసం , సమాజ శ్రేయస్సు కోసం ఏం మార్గం లో అడుగేయాలి అన్న అంశాలను వివరిస్తారు .
ఈ సమావేశం ముఖ్యం గా యువత కోసం ఉద్దేశింప బడినది . ఈ సభకు విశిష్ట అతిథి రెవెన్యూ మంత్రి షేక్ మస్తాన్. న్యూస్ రీడర్ ఆ వార్త ముగించి ' ఇప్పుడు క్రీడా వార్తలు అని టాపిక్ మార్చింది. అన్వర్ ఆలోచిస్తూ ఆ క్రీడా వార్తలను పట్టించుకోలేదు .
" ఇస్లాం , జిహాదీ ! ఈ రెండు పదాలకు పవిత్ర ఖురాన్ లో
అర్థాలు ఏమిటి ? ఖురాన్ గురించి తనకు పూర్తిగా అవగాహన లేదు . తన అరబ్ భాషా జ్ఞానం అంతంత మాత్రమే. మతోన్మాదులు, స్వార్థ రాజకీయ నాయకుల ప్రభావం వల్ల ఈ రెండు పదాలు అసలు ఉనికే పోగొట్టు కున్నాయి . ఈ పదాలకు డా.ఇనాయతుల్లా వివరణ ఇవ్వగలడా ? సద్భావనా సమావేశానికి వెళితే ? వెళ్ళే వీలు లేదే ! తను ఈ నాలుగు గోడల కే పరిమితం . రహీం చెప్పినట్లే నడుచుకోవాలి . " విసుగు, కోపం కలిగాయి అన్వర్ కు .
ఇంతలో ల్యాండ్ ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకున్నాడు .
అవతలి రహీం. " హెలో ! అన్వర్ భాయ్ ! ఎలా ఉన్నావు ? "
అన్వర్ నవ్వాడు. నవాబులా దర్జాగా ఉన్నాను . కాకపోతే హౌస్ అరెస్ట్ . "
తనూ నవ్వాడు రహీం .
" డోన్ట్ వర్రీ ! ఒక్క రోజే నీకీ బందిఖానా. తర్వాత నీవు ఫ్రీ బర్డ్ . సరే ! రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమం ఉంది . "
" అవును ! నేను న్యూస్ చూశాను . సద్భావనా సమావేశం
కదా !"
" అవును . ఆ ప్రోగ్రామ్ టీ.వీ కవరేజ్ లో అన్ని ఛానెల్స్ లో వస్తుంది . నువ్వు తప్పకుండా చూడాలి ."
" అలాగే . అంత కన్నా పనేముంది ? మంచి కాలక్షేపం .
మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకోవచ్చు .
రహీం ఫోన్ పెట్టేసాడు. మళ్ళీ నిశ్శబ్దం. అన్వర్ టీ.వీ బంద్
చేసాడు . బెడ్ మీద పడుకున్నాడు .
"సరిహద్దు దాటుతున్న నలుగురు ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో పహరా చేతిలో హతం " ఇది నిన్నటి వార్త .
ముగ్గురు చనిపోయారు. అలీ గాయపడ్డాడు . మరి నలుగురు హతం " అంటారేమిటి ? అలీ కూడా చనిపోయాడా ? ఆ ఆలోచనే భరించలేక పోయాడు అన్వర్ . ఇది ఖచ్చితంగా సెన్సార్ చేయబడ్డ న్యూస్ . అలీని వారు వదులు కోరు . అలీ అవసరం వారికి చాలా ఉంది.
హైదరాబాద్ మహా నగరం నల్లటి చలి దుప్పటి కప్పుకుంది .
దీపాల కాంతిలో నక్షత్ర మండలం లా వెలిగిపోతోంది.
రూం బయటకు వచ్చాడు అన్వర్ . నగరం లోనే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ మూడు అంతస్తుల భవనం మీద
నుండి కనుచూపు మేర కనిపిస్తుంది. చూస్తూ అలాగే నిలబడి పోయాడు .
అతడి ముఖం లో కమ్ముకున్న నీలినీడలు ఆ చీకటి లో కలిసి పోయాయి. ఇన్నాళ్ళు బండలా బిగుసుకు పోయిన అతడి గుండె ల్లో కదలికలు ప్రారంభమైయ్యయి
. ఆ కదలికల కలకలం కళ్ళ తడిలా మారింది.. గతం జ్ఞాపకాల పొగమంచు లా మనసును ఆవరించింది.

.........8