" లలిత టీచర్ " రిటైర్ అయ్యారు.
సన్మాన సభ. ఎవరూ లేరు. కరోనా సమయం.
నిశ్శబ్దంగా ని్ర్జనం లో, ( ప్రిన్సిపాల్ ఛాంబర్ లో) లో నిరాడంబరంగా జరిగింది..... నాన్న చెప్పారు. " -------------
స్నేహితుని మెసేజ్ చూసి. , అద్దాలు సవరించుకుంటూ,
కన్నీటి ధార ను తుడుచుకున్నాడు వనమాలి.
వనమాలి కి 30 సంవత్సరాల వయస్సు. వివాహమై నాలుగేళ్ల బిడ్డ. , పేరు కృష్ణ.
కళ్ళు మూసుకుని బాల్యానికి వెళ్ళిపోయాడు వనమాలి.
" ఒక్క రోజు స్కూల్ మానెయ్యరా,. ఏం కాదు . పిన్ని కూతురి పెళ్లి కి పోవాలి. " అమ్మ.
ఒకటవ తరగతి చదువుతున్న తను , ఏడుస్తూ " మీరు పోండి ,. నేను రాను " అన్నాడు.
" నువ్వెక్కడ వుంటావు రా బుజ్జోడా ? " అమ్మ గారం.
" మా లలితా టీచర్ దగ్గర." తల ఎగరేస్తూ చెప్పాడు .
" ఓర్నీ ! నువ్వొక్కడివే నా ఆమెకు ? ఇంత మంది .( చేతులు చాచి ) అంది అమ్మ నవ్వుతూ.
" ఎంత మంది అయినా సరే , నవ్వుతూ అన్ని నేర్పిస్తుంది. "
" అది స్కూల్లో, మరి ఇంట్లో ........"
"మరి లేదు, గిరి లేదు. స్కూల్ అయిన తరువాత ఇంటికి పోతా."
ఆ తల్లి,. పిల్లలందరికీ ప్రాణం. ఆ పిల్లలు ఆమెకు ఊపిరి. "
అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఆమె అంటే పేరెంట్స్, కొలీగ్స్, పనివారు అందరూ గౌరవిస్తారు.
ఆమె భర్త కూడా టీచర్. జ్ఞానాన్ని పంచటం తప్ప వారిరువురి కి వేరే లక్ష్యం లేదు.
సోషల్ స్టడీస్ అందరికీ ఆమడ దూరం.మరి మాకు అత్యంత ఆహ్లాదం.
కారణం. మా టీచర్ భర్త, రామకృష్ణ గారు . సబ్జెక్టు ను ఎంతో సరళంగా, వినోదంతో వివరించేవారు .
వారి ఇల్లు ఎప్పుడూ పిల్లల తో సందడిగా ఉంటుంది.
" మా ఇంట్లో సున్నం కొడుతున్నారు .మీ ఇంట్లో చదువుకుంటాం."
" మా ఇంట్లో బంధువు లు వున్నారు, మీ ఇంట్లోనే వుంటాం "
పెద్ద, చిన్న, అన్ని తరగతుల (క్లాసులో ,) వారికి అది ఆశ్రయం, ఆశ్రమం.
12తరగతులు ఆ టీచర్ ఆశీస్సుల తో అండ దండ లతో
గడిచిపోయింది.
" ఏమండీ,. కృష్ణ స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తీయండీ" భార్య సుమ .
ఉలిక్కిపడి ఫోను అందుకొని ," యస్, ఎప్పుడు, ఎంత ఓకే."
విసుక్కుంటూ, ". చదివేది LKG , instruments 100kg, Instructions లాంగ్ పేజీ.
Very unlucky kids.
హే భగవాన్ ! ఈ బిడ్డల్ని రక్షించు.!
సారీ నాన్నా ! కృష్ణ తో అన్నాడు వనమాలి.
వాడికి అర్ధం కాలేదు.
" ఏమండీ ! అలా వున్నారు ?" సుమ
" నన్ను వనమాలీ ! శిఖిపింఛ మౌళి " అని పిలిచే లలితా టీచర్ రిటైర్ అయ్యారట.
" నీకే కాదు నాకు కూడా favourite teacher.( వారిద్దరి దీ ఒకే స్కూల్. ప్రేమ వివాహం. )
" The best escorting teacher. ఆవును. నేను కబడ్డీ tournaments వైజాగ్ వెళ్ళాను. అప్పుడు ఆ మేడమే మా
Escort తెలుసా?"
స్కూల్ అంతా ఫాన్సే ఆ మేడం కి.
సార్ స్కూల్ లో సార్ కి కూడా.
క్యాంపస్ లో వుండే వాళ్ళు కదా. ఇద్దరి లోకం విద్యార్థులే.
"" ఎటూ కలిసి కృతజ్ఞతలు చెప్పలేం. మేడం నెంబరు కనుక్కుని ఆశీర్వాదం తీసుకుందాం. "
కృష్ణ పరుగెత్తుకుంటూ వచ్చి," అమ్మా ! నా వీడియో ఆగిపోయింది. Home work note చేసుకోలేదు." అనేసి బయటకు వెళ్ళబోయాడు.
" ఈ రోజు స్కూల్ అయిపోయింది.. ... ఫోను ఛార్జింగ్ లో పెట్టాలి " సుమ.
" రోజూ ఇట్లే అవుతుంది. కృష్ణా ! ఇలారా ! నీకు మంచి కథ చెబుతాను. " అని వనమాలి వాడి నుంచి పట్టుకున్నాడు.
" తమ ఇద్దరి చదువు ఎంత ఆనందంగా సాగింది, ఎంత మంది స్నేహితులు ఉన్నారు " అన్నీ చెప్పి సాగాడు.
" మీకు దెబ్బలు పడలేదా డాడీ ?"
" ఇద్దరమ్మల దగ్గర తిన్నాను. తాతగారి దగ్గర అసలు తినలేదు."
ఇద్దరా" ?
" లలిత టీచర్ లో ను అమ్మ లోను కారుణ్యం---కాఠిన్యం సమానంగా వుండేవి."
", అంటే ?"
" తప్పు చేస్తే తోలు తీస్తా రు. మాట వింటే ప్రేమ కురిపిస్తారు."
"
అంటే దుర్గా దేవి లాగా. దుర్గా మాత ఏం చేస్తుంది చెప్పు ?"
నీకు అమ్మ దసరా గురించి చెప్పింది కదా !"
దండం పెడితే కరుణిస్తుంది. ఎదురు తిరిగితే మాత్రం చంపేస్తుంది."
Very good.మంచి టీచర్ లందరూ దుర్గా మాత లే .
************
మేడం నెంబరు దొరికింది. మాట్లాడే లోపల బోలెడు మెసేజ్ లు.
"
Let's unitedly rise to the situation. Ramakrishna
sir is hospitalized and madam needs support."
వనమాలి" ఏంటిది సుమా ? "
"మెసేజ్ చదివిన సుమ వెంటనే మేడమ్ కు మెసేజ్ చేసింది.
మేమంతా మీ వేలు పట్టుకుని తిరిగిన వాళ్ళం. మీ లాలన
పాలన తో పెరిగిన వాళ్ళం."
" School is the second home and home is the best home."
అని prove చేసిన మీరిద్దరూ మాకు దైవతుల్యులు .
మీకు మేము ఉపయోగపడే క్షణం వచ్చింది.
మీరు నిశ్చింతగా ఉండండి.
మా ప్రియతమ "సార్ " కు మేము వున్నాం.
అంతే చకచకా వారి గ్రూప్ ల ద్వారా సీనియర్లు జూనియర్ లు, టీచర్లు అందరినీ కలుపుకుని హాస్పిటల్ ఖర్చులకు డబ్బు మేం పంపిస్తాం అని ముందుకు వచ్చారు.
ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో వున్న 'రామకృష్ణ కోలుకొని ఇంటికి వచ్చారు. లలిత టీచర్ ద్వారా అంతా విన్నారు.
" మాకు పిల్లలు లేరన్న భావన కలగ నీయని, ఈ పిల్లలు
పుష్పించి, ఫలిస్తున్నారు. ఇంతటి కఠిన కరోనా సమయం లో కారుణ్య వర్షం కురిపించిన పిల్లలకు, పెద్ద వారికీ నమస్సుమాంజలి." అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వారి అంకిత భావం, దాని ప్రతిఫలం రెండూ చూసి అవాక్కయ్యారు హాస్పిటల్ వారు.
గురు-శిష్యుల అనుబంధం అవ్యక్తం, అమూల్యం అమోఘం అద్భుతం అపూర్వం అతుల్యం.
ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన గురువు భారత దేశం. గురుదక్షిణ గా అంగుష్ఠాన్ని అర్పించిన ఏకలవ్య శిష్యులు వున్న ఈ నేల, జగద్గురువు శంకరాచార్యులు నడిచిన ఈ భూమి విద్యకు, విద్యాలయాలకు, గురు- శిష్య
సంబంధానికి ఒక ఉన్నత స్థానం కలిగి ఉంది. గురువు సన్నిధిలో మెరుగులు దిద్దిన చిన్నారుల కే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. అదే మన దేశపు తరగని సంపద. అది వ్యాపారం కాదు. రిమోట్ కంట్రోల్ లో జరిగేది కాదు.
నిర్లక్ష్యం చేయదగినది కానే కాదు.పునాదులు కూలిపోతాయి.. తస్మాత్ జాగ్రత్త !
......…...........గురు భ్యోం నమః ........
ఒక నెల తరువాత ఇంటికి వచ్చిన రామకృష్ణ మాస్టారు,
లలితా టీచర్ అందరికీ మెసేజ్ పెట్టారు." ఇంత కంటే గొప్ప
సన్మానం" ఎవరికీ జరిగి వుండదు . మీలాంటి శిష్య రత్నాలు
వున్న మా జన్మ ధన్యం. చిరకాలం పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి."
మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ మనసు లోనే ధన్యవాదములు తెలిపారు.వనమాలి కృష్ణ ను ఎత్తుకొని ముద్దాడి " నీకు మా
టీచర్స్ ను చూపిస్తాం, ఓకే నా ?"
అందరి ఇళ్ళలో అదే పరిస్థితి. కొన్నాళ్లకు తమ పిల్లల తో అందరూ కలిసి " వారిద్దరి నీ " కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
అందరి ప్రార్థన ఒకటే.
"భగవంతుడా ! నా దేశం లో అన్ని టి కంటే గొప్పది" గురు-శిష్య సంబంధం.గురువు శిక్షణ లో పెరిగిన విద్యార్థులే జీవనం నైపుణ్యాలను స్వంతం చేసుకుంటారు.
విదేశీ పద్ధతులు అన్ని రంగాల్లో అనుకరించటం ఒక ఎత్తు అయితే, విద్యారంగంలో మరొక ఎత్తు. ఆ చెడు రోజు
రాకూడదని మా అందరి ఆకాంక్ష."
మాస్టారి కోరిక పై "" SHEEL (. Society for Healthy, Educated and Empowered Living." ) అనే ట్రస్టు ను ప్రారంభించారు.
For needy persons,. With the Tag
" EDUCATION IS LIFE. ....
SAVE EDUCATION.,SAVE LIFE.
............ లక్కవరం.శ్రీనివాసరావు ( ల . శ్రీ. )