రాత్రి 11.46
"మేను తాకిన గాలి తరం కూడా కాలేదు...
ఆ క్షణం... "
"నా స్వేద వర్షపు జడులని ఆపటం..."
బహుశా...
" కళ్ళలోని సంద్రాలు జారటానికి... కనుల గటపలు ఇరుకు అయ్యాయేమో..."
అన్నట్లుగా...చెమటలు...
"హే నీ కన్నా నేనే ముందు అన్నట్లు కన్నీళ్లు..."
పోటాపోటీ గా వస్తున్నాయ్...
కళ్ళలో జారుతున్న... నీళ్లు వల్ల ఫోన్ స్క్రీన్ కూడా సరిగ్గా కనపడట్లేదు...
వీడియో కాల్ లో....
అటు వైపు "వాడి" స్థితి కూడా ఇలానే...
ఇంతకీ ఏంటి నీ భాద అనుకుంటున్నారా...???
ప్రేమా....😍
ప్రేమే గమనం..🚴
ప్రేమే... కమనం...🖋️🖋️
ప్రేమే... చరణం....🎶🎶🎶
ఆ ప్రేమే... సర్వస్వం.....🌍🌍🌍🌍
నాది కూడా ఇలాంటి ఒక అందమైన ప్రేమ కథే...
మరి ఇంత అందమైన ప్రేమ కధలో భాద ఎందుకు పాపా...?? అంటారా...
నా బాధ కి కారణం నా ప్రేమే...
...😣😣😣
ఆనందాన్నీ, భాద ని సమర్ధవంతం గా సమతుల్యం చేస్తున్న ప్రేమ...
దేన్నీ జీవితం లో నిలుపుతుంది...???
***********************************
కొన్నీ రోజుల క్రితం...
నిస్సంకోచం గా అది మార్చి నెల...
(ఎందుకు చెప్తున్నా అంటారా... మీరే కనుక్కోండి...😋)
రాత్రి 9.40....
ఏంటే ఇంత ధైర్యం... రేపు ఎక్సమ్ ఉంది...
అది కూడా "ఎం.వన్"..... ఆ ఫోన్ లో పీక్కునే బదులు వెళ్లి చదువుకోవచ్చుగా...😡
అనింది... పూజ 📚📚
గోడకి వేసి ఉన్న తలగడ కి నడుము ఆన్చి... కాళ్ళు ముడుచుకొని... మరీ శ్రద్ధగా
మొబైల్ లో ఏదో కెళుకుతున్న రోష్ని...
ఒక్కసారి గా పూజ... వైపు లుక్ ఇచ్చి...🙄
హ్మ్మ్... ఎం కావాలి... నాకు సోప్ వేస్తున్నావ్...
చెప్పు...
అని మళ్ళీ సెల్ లోకి చూపు దూర్చింది...
"కనిపెట్టేసావా... " అని సినిమాటిక్ గా... సాగదీసింది పూజ...
రోష్ని పక్క కి నవ్వుతూ వచ్చిది...😁
రోషి బంగారూ...😍 అని పిలిచింది... తన చెయ్యి
లాగుతూ...🤗
( రోష్ని ని ముద్దు గా రోషి అని పిలుస్తారు వాల్ల ఫ్రెండ్స్)
రోష్ని: అంత ఓవర్ ఆక్ట్ చేయకు...😏 ఎయిర్ పోడ్స్ కావాలా...?? 😕
పూజ: నా మనసు నీకు తెలుసు...రోషి 😍😘
అందుకే మనది జన్మ జన్మ ల...🤔 అని ఏదో చెప్పబోతుంటే...
రోష్ని: తొక్కేమ్ కాదు... ముస్కొని పో...😡
ఇప్పటికి మూడు హెడ్ సెట్స్ పగలగొట్టావ్...
ఈ ఎయిర్ పోడ్స్ చాలా ఇస్టమ్ గా కొనుక్కున్న... చచ్చినా ఇవ్వను...😒
పూజ: బేబీ... అలా అంటావెంటి బేబీ... ప్లీస్...ప్లీస్..
ఇవ్వవే...😞
రోష్ని: ఐనా... ప్రతిసారి ఆ.. రాజేష్ గాడి మీద కోపానికి నా హెడ్ సెట్స్ బలైపోవాలా...??
నేను ఇవ్వను పో... 😡 .... కోపంగా...
పూజ: ( అమాయకంగా ) బేబీ... plz ఈ సారి రాజా తో గోడవేం లేదు ఆల్ హ్యాపీస్ కాసేపు మాట్లాడుకుని ఇచ్చేస్తానే... 🙁🙁🙁🙂
మా అమ్మ కదూ... ఇంకొక జన్మ అంటూ ఉంటే... నీ హెడ్ సెట్స్ గా పుట్టి నీ రుణం తీర్చుకుంటా... ప్లీస్ రా... 😋
రోష్ని: ఎందుకు చంపేయటనికా...!!! ( చిరాకుగా అని మళ్ళీ ఫోన్ వైపు చూసింది..)😐
పూజ కోపం గా మొహం పెట్టి... పట్టుకున్న రోష్ని చెయ్యి పక్కకి నెట్టేసి
నాకేం అవసరం లేదు..,😐🤒
నీ డొక్కులో... ఎయిర్ పోడ్స్...అని కోపం గా వెళ్లిపోబోతుంటే...🚶🚶
రోష్ని: హ్మ్మ్.... ఐతే వద్దా... సరే లే... నీ కప్బోర్డు లో ఉన్న కొత్త ఎయిర్ పోడ్స్ కూడా నేనే వాడతాలే...
అనింది చిన్నగా నవ్వుతూ...
పూజ: వెనక్కి తిరిగి హెయ్... అని నవ్వుతూ వెళ్లి కప్ బోర్డ్ తెరిచి చూసింది... ఎదురుగా
బోట్ కంపెనీ ఎయిర్ పోర్డ్స్ ఉన్నాయి...
రోష్ని పూజ ని చూసి చిన్నగా నవ్వింది...
థాంక్ యూ రోషి...💃💃💃
లవ్ యూ అని చాలా ఎక్సయిట్ అయ్యింది... 👩❤️💋👩ఎంతో ఆనందం గా... రోష్ని దగ్గరకి వచ్చి..🏃 రోష్ని బుగ్గ మీద ముద్దు పెట్టింది...
( ఫ్రెండ్ ఇచ్చిందంటే ఆ మాత్రం ఉంటుంది గా మరి😊😊😊)
అప్పటి దాకా నవ్వుతున్న రోష్ని కొంచం సీరియస్ గా మొహం పెట్టి...🙂
ఈ సారి విరగొట్టవో నీకు ఫోన్ కూడా లేకుండా చేసేస్తా... ) అనింది కోపం గా😡
పూజ: okey డార్లింగ్...😘😘😘
అని మురిసిపోతూ వాటిని చూసుకుంటు...
"ఉండు మొన్న ఆ బక్కది ఇయర్ ఫోన్స్ ఇవ్వమంటే తెగ ఫోస్ కొట్టిందిగా దానికి చూపించి వస్తా"
అని బయటకి వెళ్తుండగా...
రోష్ని: కాస్త నవ్వుతూ...
ఆ...ఇంతకీ ఇంకొక కోతి ఏది...
పూజ: (డోర్ దగ్గర బ్రేక్ వేసి)
గ్రౌండ్ లో సిట్టింగ్ వేసినట్లుంది...
రేపు ఎక్సమ్ కదా...
రోష్ని: వార్డెన్ వచ్చే టైం అయ్యింది... గ్రౌండ్ లో బాథాకాని ఏమిటి దానికి... వెళ్లి తీసుకురా... 😡
పూజ: ఆ ఒక్క మాటతో... చెంచు చెంచు మని ఎయిర్ పోడ్స్ చెవిలో పెట్టుకొని బయటకి ఉరికింది...
( తన ఫ్రెండ్ కోసం గ్రౌండ్ అంతా వెతుకుతుంది...)
చివరకు... ఒక సైడ్ కొర్నేర్ లో... చుట్టూ ఒక గ్యాంగ్ ని వేసుకొని... "మన హీరోయిన్..."
ఒక రేంజ్ లో కూర్చుని చేతిలో ఉన్న బుక్ మీదకి వంగి మరీ... ఏదో చేసేస్తుంది
ఆ నిశీధి వెన్నెల కాంతి...
వెండి వర్షం లా తన మీద పడుతుంటే...
ముందుకు పడుతున్న జలపాతాలు వంటి కురులను సరి చేసుకుంటూ...
చల్లని గాలి తుంటారిగా తనని తాకుతుంటే... దానికి స్వాదిస్తూ....
అప్పుడే వికసించిన పారిజాత పుష్పమా అనేటట్లు
ఉంది ఆమె...
( బహుశా ఎక్సమ్ కి ప్రిపేర్ అవుతుందేమో...... నాకు కుడా తెలీదు చూద్దాం రండి )
పూజ వచ్చి తన ముందు నుంచుని నడుము మీద చేతులు వేసుకొనినుంచుంది...
మన పాప అది అంత ఎం గమనిచట్లేదు... ఏదో చేసేస్తుంది బుక్ లో...💤💤💤
ఒక్క సరిగా...
వెనుక నుంచి ..."అన్వి".... అని పిలుపు వినిపించిది...
వెనుక దూరం గా తన ఫ్రెండ్ ఎవరో... ఏవేవో సైగలు చేసింది...
సమాధానం గా..
వెనక్కి తిరిగి మన పాప కూడా చేతులతో ఏవేవో...సైగలు చేస్తూ నవ్వుకుంటుంది...
పూజ: ఆపుతావా..!!! నీ వెధవ సైగలు... 😡
ఒక్కసారిగా ముందుకు తిరిగింది..అన్వి
( మన హీరోయిన్ పేరు అన్వి అన్నమాట బాగుంది కదా...😇😇😇)
ఒక్కసారిగా ఉలిక్కి పడి చూసి...
నువ్వా... !! ,🙄
ఎవరో అనుకొని భయపడి చచ్చా...😣
అని మళ్ళీ బుక్ వైపు చూసింది అన్వి...
పూజ: ఎం చేస్తున్నావ్... తొట్టి గ్యాంగ్ ని వేసుకొని...
రూమ్ కి రా రేపు ఎక్సమ్ ఉంది గుర్తుందో లేదో...మేడంకి అని మొహం చిట్లించింది
కూర్చున్న అన్వి బుక్ పట్టుకొని పైకి లేచి...
ఆ బ్యాచ్ కి... సరే నే.. బాయ్ 👋👋పొద్దున్న కలుద్దాం... 😄
అని చెప్పి వెళ్తుండగా...
వెనుక కూర్చున్న వాళ్లలో ఒక అమ్మాయి.. గట్టిగా... అన్వి...🔊
"రేపు కుమ్మేద్దాం... మర్చిపోకు..."☺️
అనింది...
అన్వి చిన్న నవ్వు విసిరి...😊
హా... పక్కా...👍👍👍 ఫిక్స్ ఐపో...
అని...చెప్పి పూజ దగ్గరకి వచ్చింది...
పూజ తన వైపు గుర్రు గా చూడటం గమనించిన అన్వి... " ఏంటి పాపా... మింగేస్తావా... ఎం...??"😋 అనింది మన హీరోయిన్
"ఎం లేదులే "అని... పూజ వేగం గా వెను తిరిగింది...
అన్వి: ఓయ్... స్పోర్ట్స్ కార్... కాస్త బ్రేక్స్ వేయవే... అని పరిగెత్తుకుంటూ... తనపక్కకి వచ్చింది...
వాళ్ళు ఇద్దరూ... వల్ల రూమ్ వైపు కదిలారు...
కొంచెం మౌనం తర్వాత...
నడుస్తూ... పూజ అన్వి వైపు చూసి...
పూజ: ఏంటే ఆ తొట్టిది ఎవరినో కుమ్మేద్దాం అంటుంది...??😏😏😏
ఐనా వాళ్ళతో నీకేంటి పని... నీకు తెలుసు కదా వాళ్ళ గురించి...
ఐనా రేపు ఎక్సమ్ పెట్టుకొని ఎం చేస్తున్నావ్...??? చదివావా...😡
అన్వి: పూజ భుజం మీద చెయ్యి వేసి...
"గుర్తుంది పూజా... డార్లింగ్... 👍
అందుకే కదా...
ఈవెనింగ్ నుంచి కష్టపడి చదివేస్తున్నా...🤓 "
పూజ: ఇప్పుడు నిజం చెప్పు...,😏
అన్వి: ఇంత ఇంటెలిజెన్స్ ఏంటే నీకు... ఇంత ఇంటెలిజెన్స్ తో రూమ్ షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా గర్వం గా ఉందే...😋😋
ఇదిగో ఇప్పుడే చెప్తున్నా... నువ్ గాని
రాజకీయాల్లోకి వెళ్తే... డైరెక్ట్ P.M ఐపోతావ్ అంతే...
అన్వి చెప్తుంది ఫిక్స్ ఐపో...🤗🤗🤗
పూజ అన్వి వైపు కోపం గా చూసి 😡
పూజ: సోది ఆపి విషయానికి రా...😏
(అన్వి మనసులో...దీనేకమ్మ దీన్ని అస్సలు డైవేర్ట్ చేయలేము😣అనుకుని)
అన్వి: 🙄అంటే...(సాగదీస్తూ...) కష్టపడి స్లిప్స్ ప్రిపేర్ చేస్తున్నా😁
పూజ: ఓసిని... ఎంకమ్మా... 😏😏😏😶
అన్వి: 😎😎😎
నీ సంగతేంటి... నువ్ చదివేసేవా... హ చదివేసే ఉంటావులే... 👌☺️
పూజ ఒక లుక్ ఇచ్చి...
పూజ: నాకు,రోషి కి ఇంటర్నల్స్ ఉన్నాయి... రోషి ఐతే ఫుల్ చిల్ లో ఉంది...😄
అలా మాట్లాడుకుంటూ... రూమ్ కి వచ్చేసారు...
ఇద్దరు...
రాజేష్ ఫోన్ చేయటం తో... పూజ మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చేసింది...
అన్వి, రోష్ని కొంచెం సేపు మాట్లాడుకున్నాక....
ఎవరి ఫోనులో వాళ్ళు మునిగిపోయారు...
కొంచెం సేపటికి... అన్వి వాష్ రూమ్ కి వెళ్ళింది...
🎶🎶వేవెల మైనాల గారం... వినిపించెను నా మౌనం...🎶🎶🎶🎶🎶🎶
ఆరారు కాలాల ధ్యానం... కనిపించని నీ రూపం..🎶🎶🎶🎶🎶🎶
హే.. హే.. హే... ప్రాయమే అగ్ని తల్పం...
హే..హే..హే.. ప్రాణమే మేఘ శిల్పం...🎶🎶🎶🎶
అంటూ...ఫోన్ మోగటమ్ మొదలయింది...📱📲📲📲📲
( ఇది నా ఫేవరేట్ రింగ్ టోన్... ఏ మూవీ సాంగ్ ఓ చెప్పగలరా...)😊😊😊
-కొనసాగుతుంది...
*****************************
అంతా బానే ఉంది...😊☺️
ఆ ఒక్క ఫోన్ కాల్ మన కథని మలుపులు తిప్పబోతుంది... అంటే నమ్ముతారా...😢😢😢😢
హ... ఏముంది... తన లవర్ గాని ఫోన్ చేసాడేమో...🤔
అనుకుంటే మీది తప్పు జవాబు...🤣🤣
Bye....