Lilavati - 1 in Telugu Fiction Stories by Siri books and stories PDF | లీలావతి - 1

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

లీలావతి - 1









‌ సమయం ఉదయం 6గంటలు


సూర్యుడు తన డ్యూటీకి సమయం అయింది అని అప్పుడే వచ్చేశాడు.


పక్షులు ఆహారం కోసం పయనం మొదలు పెట్టాయి.


చల్లటి గాలి.... హాయిగా వుంది.


ఆహ్లాదకరమైన వాతావరణం కి అనుకూలంగా ఒక ఇంట్లో నుండి మధురమైన గానం.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే


ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌!



ఒక అమ్మాయి పాడుతున్న శ్లోకం వినసొంపుగా వినిపిస్తుంది.


పూజముగించుకుని , హారతి పల్లెంతో బయటకి వచ్చింది ఆమె.


అదంతా అనగా ఈ సన్నివేశం ను చూస్తున్న గాయత్రి గారి కి కళ్ళు తిరిగినంత పనయ్యింది.


" లిల్లీ! ఇది నువ్వేనా?" ఆశ్చర్యం గా పలికింది ఆమె స్వరం.


ఆ అమ్మాయి కోపంగా పక్కకి తప్పుకో అన్నట్టు చూసింది.


" అలాగే లేవే... నువ్వు ఇవాళ పూజ చేస్తుంటే భూకంపమే!" వెటకారంగా పలికింది గాయత్రి గారి స్వరం.


ఉరిమి చూసింది ఆ అమ్మాయి.



అక్కడే హాల్లో వున్న శ్రీనివాస్ ,పద్మావతి లకి హారతి ఇచ్చి...

ప్లేట్ పూజ గదిలో పెట్టీ వచ్చింది ఆ అమ్మాయి.



" ఇప్పుడు చెప్పవే ముసలీ! ఏంటి ఓ తెగ ఎక్కువ చేస్తున్నావ్?"

గాయత్రి గారి వైపు చూస్తూ అడిగింది లిల్లీ అనబడే ఆ అమ్మాయి.



" ముసలి ఏంటే.. మూతి పగులుతుంది" అన్నది .


" ముసలి కాక ... నువ్వు ఏమైనా పడుచు పిల్లవా ముసల్డానా" నవ్వుతూ లిల్లీ అన్నది.


" ఉండవే అయిపోయావు నా చేతుల్లో" లిల్లీ నీ పట్టుకోవాలి అని చూసి సోఫాలో కూలబడింది.



" చూసావా?... ముసలి అప్పుడే చతికలబడ్డవ్... హ హా " నవ్వింది లిల్లీ.


" ఏంటే ఆ మాటలు " పద్మావతి గారు కోప్పడ్డారు.


" అత్తని అనే సరికి కోడలి గారికి బాధ ఏంటో" నిట్టూర్చింది లిల్లీ.



" చూడరా! నీ కూతురు ఎలా మాట్లాడుతుందో " శ్రీనివాస్ గారి వైపు చూస్తూ చెప్పింది.


" పోనీలే అమ్మ... లిల్లీ కాలేజ్ కి టైం అవుతుంది త్వరగా టిఫిన్ చేసిరా" శ్రీనివాస్ గారు అన్నారు.


" రావే పెడతాను" పద్మావతి గారు చెప్పి వెళ్లి పోయారు.


" వస్తున్నా అమ్మా" చెప్పి వెళ్తూ... గాయత్రి గారి వైపు చూసింది.


ఆవిడ మౌనంగా వుంది.


' ఈ ముసల్డాని కోపం పోగొట్టాలి... ఎలా?' మనసులో అనుకుని


" ఓయ్ ముసలి దా మెద్దాం ఫుల్ గా ఆకలి వేస్తుంది " పొట్ట పట్టుకుని చెప్పింది.


" అయ్యో అవునా పదవే!" కోపం అంతా పోయింది.


శ్రీనివాస్ గారు లిల్లీ ఇద్దరు కార్ లో కాలేజ్ కి బయలు దేరారు.


( లిల్లీ అమ్మ పద్మావతి, నాన్న శ్రీనివాస్, నానమ్మ గాయత్రి దేవి.

శ్రీనివాస్ గారు కాలేజ్ ప్రిన్సిపల్... అక్కడే ఎంబీఏ సెకండ్ఇయర్ చేస్తుంది లిల్లీ.

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న మాట వీరిది.)


@@@@@



కాలేజ్ బయట ప్రాంతంలో...


శ్రీనివాస్ గారి కార్లో

" నాన్నా! ఇక్కడ దింపెయ్"


" ఎందుకు లిల్లీ?"


" అబ్బా నాన్న మీకు తెలిసి అడక్కండి... మీ కూతుర్ని అని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలిసిపోతుంది... ఇక ఏముంది అందరూ ఏదో వింత జీవిని చూసినట్టు చూస్తారు. అందుకే నేను మీతో రాను"


" సర్లే గానీ... జూనియర్స్ నీ రాగింగ్ అది చెయ్యకు " నవ్వుతూ చెప్పారు.


కార్ నుండి దిగింది లిల్లీ.


" లిమిట్ గా " వెనుక నుంచి అరిచింది.


నవ్వుతూ వెళ్లి పోయారు.



******



" హై... ఫ్రెండ్స్" కాలేజ్ లో అడుగు పెట్టగానే కనిపించిన తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తింది.


" హేయ్ లిల్లీ లేట్ ఏంటి?" సుప్రజ అడిగింది.


" ఏముంది ఇది లేచేసరికి కాలేజ్ టైం అయి వుంటుంది... " రోజా చెప్పింది.


" కాదు లేవే... ఫస్ట్ డే కదా!.. అందుకే " బడులిచ్చింది లిల్లీ.


( సుప్రజ, రోజా,. లిల్లీ, శివ, రూపేష్ ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి)


" అది సరే... మంకీ బ్యాచ్ ఎక్కడ?" తనే అడిగింది.


"ఇక్కడ " లిల్లీ తల మీద చేరొక్కటి ఇచ్చారు.


"ఓచ్! ... నొప్పిరా" తలమీద దిద్దుకుంటూ చెప్పింది.


" మంకీ ఏంటే?"


" సారీ రా... జూనియర్స్ వస్తారు కదా పదండి ఓ లుక్ వేద్దాం"


ఐదుగురు నవ్వుకుని అక్కడే పార్కింగ్ ప్లేస్ లో సెటిల్ అయ్యారు.


" లిల్లీ అటు చూడవే!" సుప్రజ చెప్పింది.


అందరూ అటు వైపు చూసారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వస్తుంటే పిలిచారు.


పేర్లు అడిగి సెన్సిటివ్ గా అనిపించే సరికి పంపేశారు.


ఎదురుగా ఒక అతను బ్లాక్ షర్ట్ , బ్లూ జీన్ , కళ్ళకి గ్లాసెస్ తో బైక్ మీద వస్తున్నాడు.

" లిల్లీ అతన్ని పిలుద్దాం" శివ అన్నాడు.


అప్పుడు అటు వైపు చూసింది లిల్లీ. అతను అలా వస్తుంటే అలాగే చూస్తూ వుండి పోయింది.


******


( కథ కొనసాగుతుంది)