Love Journey - 1 in Telugu Biography by Surya Prakash books and stories PDF | ప్రేమ ప్రయాణం - 1

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ప్రేమ ప్రయాణం - 1

మాది ఒక మధ్యతరగతి కుటుంబం

నా పేరు (సూర్య) నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను.

తాను వరుసకు నాకు మరదలు అవుతుంది . తనపేరు సత్య సత్య అంటే మా కుటుంబసభ్యులకు ఇష్టమే అందువల్ల నేను సత్యని ప్రేమించాను. తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానే గాని తన అభిప్రాయని తెలుసుకోలేకపోయాను ఆ ప్రేమ ఎంతలా అంటే తనని చూడకుండా ఉండలేనంతగా.వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సత్య వాళ్ళ నాన్నగారికి .అమ్మమ్మగారికి నేను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనతో మాట్లాడుదామన్న వల్ల అమ్మమ్మో నాన్నగారో దగ్గర ఉండేది. కానీ ఎప్పుడునేను అడిగిన తన మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పలేదు. అలా అని నామీదున్న ఇష్టాన్ని ఎప్పుడూ తాను చెప్పలేదు అలా ఎప్పుడూ తన గురించి ఆలోచించేవాడిని
మా వాళ్ళు అది గమనించి నన్ను కాళీగా ఉన్నానని నన్ను టైప్ నేర్చుకోమని పంపారు. అప్పుడు నేను టైప్ ఇన్స్ట్యూషన్ లో జాయిన్ అయ్యాను.

అక్కడ నాకు వర్ష పరిచయమైంది. వర్ష నేను టైప్ జాయిన్ కొన్ని రోజులకే మంచి స్నేహితులమయ్యాము. అక్కడ మొదలైంది నా తొలి స్నేహం (తోలి ప్రేమ)

మొదటి పరిచయంలోనే నాకు వర్ష ఎంతో దగ్గరి వ్యక్తిలా కలిసిపోయింది తనతో మాట్లాడుతుంటే నన్ను నేనే మరచిపోయేవాడిని టైం తెలిసేది కాదు ఎప్పుడెప్పుడు తనని కలుస్తానా అని ఎదురు చూసీవాడిని అయితే నేనుంఇంటర్ అయ్యక కాళిగా ఉన్నానని తాను ప్రైవేట్ గా డిగ్రీ చదువుతున్నాను అని నన్ను కూడా కట్టమని చెప్పింది

సరే అని నేను తాను చెప్పినట్లే డిగ్రీ లో జాయిన్ అయ్యాను. నాతో పాటుగా మా ఫ్రెండ్ (బుజ్జిని) ని కూడా జాయిన్ చేసాను. మేము ఇద్దరమూ వర్షతోపాటే కాలేజీకి వచ్చేవాళ్ళము .అలాగే కాలేజి అయ్యాక ఇంటికి వెళ్ళేవాళ్ళము. అలా కొన్ని రోజుల వరకు మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ఇష్టం గా మారింది కానీ నేను మొదట ప్రేమించిన అమ్మాయి గురించి తనకి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందిపడుతున్న సమయంలో నా స్నేహితురాలు సంధ్య సహాయం తీసుకున్నాను. తనకి సంధ్య జరిగిందంతా వర్షకి చెప్పింది. కానీ అప్పుడు వర్ష అందుకు ఒప్పుకోలేదు.

అందుకు కారణం తను అప్పటికే తన బావని ప్రేమిస్తున్నది తెలిసింది నేను తన అభిప్రాయాన్ని కాదనలేకపోయాను నేను తనతో ఫ్రెండ్ గా ఉండాలని అనుకున్నాను .

ఆ రోజు ఇంటికి వెళ్లిపోయము తన జ్ఞాపకాలతో నాకు ఆరోజు చాలా విచారంగా గడిచింది. మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళాను కాలేజి అయ్యాక సంధ్య వచ్చి వర్ష నీతో మాట్లాడాలని సాయిబాబా గుడికి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది.

నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది . నేను మా ఫ్రెండ్ కలిసి గుడి వెళ్ళాం అక్కడ వర్ష గుడిలో అప్పటికే నాగురించి వేచి ఉంది. ముందుగా సాయి బాబాని దర్శించుకున్నాము ఆ తరువాత వర్ష తన అభిప్రాయన్నీ నాతో చెప్పింది . తనకి మొదట తన చిన్నతననుంచే తన బావకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పటంతో తనని ఇష్టపడ్డానని అందువల్లే నేను నీ ప్రపోజల్ కి నో చెప్పానని చెప్పింది అప్పుడు నేను సరే మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పాను. అందుకు తాను ఒకప్పుడు తాను తన బావని ప్రేమించినమాట వాస్తవమేనని కానీ ఇపుడు తనని ప్రేమించడం లేదని చెప్పింది

అందుకు కారణం వాళ్ళ కుటుంబమే కారణమని నాతో భాధపడుతూ చెప్పింది. వర్ష వాళ్ళ నాన్న గారు ఒక చిరు వ్యాపారి . ఉన్నంతలో బాగానే సంపాదించేవారు అప్పటికి వర్ష వయస్సు 12 సంవత్సరాలు. వర్ష వాళ్ల నాన్న గారి కి వాళ్ల అమ్మగారికి కుటుంబకలహాలు కలగడంవలన ఆవిడ చనిపోయారు. వాళ్ళ నాన్న రెండోసారి పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ మొదటి భార్య పిల్లలను సరిగా చూసేది కాదని అందువల్ల వాళ్ళ నాన్నగారికి రెండో భార్యకి గోడవయ్యేది అందువల్ల అతను తాగుడు కి బానిస అయ్యాడని అప్పటి నుండి తనని పట్టించుకోలేదని చెప్పి బాధపడింది. అప్పుడే వాళ్ల బావ తనకి పరిచాయమయ్యాడాని వర్షని వాళ్ల బావకు ఇచ్చి పెళ్ళి చేస్తారని చెప్పడం తో ఇంట్లో సమస్యల వల్ల నేను కూడా ఒప్పుకోవలసి వచ్చింది అని చెప్పింది. అయితే వర్ష వాళ్ళ నాన్నగారు అన్నిచోట్లా అప్పులు చేసి ఇళ్ళు అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చినపుడు వాళ్ళ బావని సహయం కోరితే వాళ్ళు వాళ్ళ నాన్నని అవమానించి పంపేశారు అంతేకాక వర్షని పెళ్ళి చేసుకొనేందుకు అంగీకరించలేదు. చేసేదేమిలేక వాళ్ళు ఇల్లు అమ్మేసి మళ్ళీ బిసినెస్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి వాళ్ల పరిస్థితి బాగానే ఉందనేసరికి వర్ష వాళ్ళ నాన్నను కలవడానికి వాళ్ళ బావ వచ్చి వర్షని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని తన పరిస్థితి అప్పుడు వేరు అందుకే ఆ రోజు అలా మాట్లాడవలసి వచ్చిందని ఇప్పుడు వర్షనీ పెళ్లిచేసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పడం తో వాళ్ల నాన్న గారూ అందుకు ఒప్పుకున్నారు. కానీ వర్ష మాత్రం తనకి దూరంగా ఉండేదానని చెప్పింది అలా తనమీద ప్రేమ అసహ్యంగా మారిందని చెప్పింది. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తాను నా ప్రేమని అంగీకరించలేనని చెప్పాను అంది.

కానీ నా పరిచయం తనకి ఒక మంచి స్నేహితుడు దొరికాడని చెప్పింది. కానీ నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను ముందు నమ్మలేదు ఆ తరువాత తన అభిప్రాయాన్ని చెప్పింది (I Love you) నేను నిన్ను ఇష్టపడుతున్నానని. తాను అలా చెప్పగానే నా యొక్క ఫీలింగ్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆరోజంతా ఏదో సాదించనాన్న తపన నాలో నేనే తెలియని వింత అనుభూతిని పొందేవాడ్ని. కానీ వాళ్ల ఇంటిలో తన ప్రేమని ఒప్పుకుంటారని మా ఇంటిలో చెప్పమని అడిగింది అయితే ముందు చదువు పూర్తి చేసి అప్పుడు చెపుదామన్నాను ఇలా కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నాము.

కాని ఇంతలో మా ఇంటిలో ఈ సంగతి తెలిసి పోయింది . మా ప్రేమకు వాళ్ళు ఒప్పుకోలేదు కారణం తాను వేరే కులం అమ్మాయి . మా మధ్య దూరం పెరిగింది వర్షనీ కలుసుకోవడానికి కూడా వీలులేనంతగా దూరం పెరిగింది .తనకి ఈ సంగతి తెలిసి చాలా కంగారు పడింది ఇక నన్ను కలవలేమోనని చాలా బాధపడింది. నన్ను కొన్ని రోజులు హైద్రాబాద్ పంపించేశారు అయితే మా వాళ్లకు తెలియకుండ నేను తనకి ఫోన్ చేసి ధెర్యం చెప్పేవాడ్ని.

కొన్ని రోజులతరువాత నేను కాలేజీ కి వెళ్ళాను కానీ తాను అప్పుడు కనిపించలేదు. తనని చూడకుండా ఉండలేకపోయేవాడ్ని.

అనుకోకుండా వాళ్ళ స్నేహితురాలు (సువర్ణ) నాకు కనిపించింది .తనకి హెల్త్ బాగోలేదని అందుకే కాలేజీ కి రావటం లేదని తెలిసింది.(తాను కాలేజ్ కి రాకపోవటానికి కారణం అదికాదు) నాకు పిచ్చెక్కిపోయింది ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి తనని కలవాలని రోజు సాయంత్రం కాలేజీ బయట వేచి ఉండేవాడిని కాని తాను రాలేదని తెలిసి ఎలా ఉన్నదో అని భయపడేవాడ్ని.

నా పరిస్థి చూసిన వర్ష స్నేహితురాలు సువర్ణ ఇద్దర్ని కలపడానికి వర్ష స్నేహితురాలు లక్ష్మీ వాళ్ల ఇంటిలో ఏర్పాటు చేసింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు వర్ష నన్ను చూసి నన్ను పట్టుకుని నన్ను కలవలేమోనని ఎంతో ఏడ్చింది.అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది

అది ఏమిటంటే తనకి హెల్త్ బాగోలేదని అందుకే కాలేజీ కి రావటం లేదని అబద్దం చెప్పారు నాకు అసలు తాను ఎందుకు రాలేదంటే వాళ్ళ బావకి తనని ఇచ్చి పెళ్ళి చేయమని అడగడానికి వాళ్ళ అత్తవాలు వచ్చారని తనకి ఇష్టంలేదని చెప్పలేక నేను దూరమవుతానేమోనని తాను సూసైడ్ చేసుకోబోయిందని తెలిసింది. అప్పుడునాకు తన మీద చాలా కోపం వచ్చింది తనని గట్టిగా తిట్టేసాను .కానీ కొంతసేపటికి తనని దగ్గరకు తీసుకొని నీకేమైన అయితే నా పరిస్థితి ఏమిటి నిన్ను విడిచి నేను ఎలాఉండగలనని అనుకున్నావు. అని చెప్పాను తనకి అప్పటి పరిస్థితితులలో ఏమి చెయ్యాలో తెలియక అలా చేసాను అని చెప్పింది. కొంతసేపు మాట్లాడుకున్న తరువాత తనని వల్ల ఇంటికి దిగబెట్టి మళ్ళీ బుధవారం కలుద్దాము అని తనకి చెప్పాను.

ఇంటికి వెళ్లి ఏమి చెయ్యాలి అర్ధంకాలేదు తనకి నను కనిపించకపోతేనే తను చనిపోవటానికి సిద్ధపడిందనే ఆలోచనే నన్ను ఒక నిర్ణయం తీసుకునెలా చేసింది. బుధవారం వర్షని కలిసి కొంతసేపు మాట్లాడుకొన్నాము అప్పుడు నేను తీసుకొన్న నిర్ణయం చెప్పాను. మనం ఏక్కడికైనా వెళ్లి పెళ్ళి చేసుకొందామని చెప్పాను. అది విని వర్ష కంగారుపడింది. ఏమి చెప్పాలో ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి లో ఇప్పుడు వద్దు ముందు పరీక్షలు ఉన్నాయి అవి అవ్వని ఆలోచిద్దాము అని చెప్పింది. నేను అందుకు ఒప్పుకోలేదు తాను మాత్రం ఇప్పుడు వద్దని చెప్పింది. అయితే ఇపుడే మన నిచ్చితార్ధం అవ్వాలని అడిగాను. నెను అప్పటికప్పుడు ఉంగరం నల్లపూసలు అన్ని కొని తెచ్చాను. అవి చూసి తాను చాలా కంగారుపడింది. నేను తనకి నచ్చజెప్పి తన మెడలో నల్లపూసలు కట్టాను. చేతికి ఉంగరం తొడిగాను. అందుకు తాను చాలా సంతోషించింది. నేను తనకి మాట ఇచ్చాను ఎటువంటి పరిస్థితు లలోనైనా నేను నిన్ను వదలను అని. కానీ ముందు ఎక్జామ్స్ ఉన్నాయి కదా ముందు ప్రిపేర్ అవ్వు ఈలోపు నేను ఎం చెయ్యాలో ఆలో చిస్తాను అని చెప్పనే గాని నేను ఎక్జామ్స్ కి ప్రిపరేషన్ అవ్వలేకపోయాను

తనమీదే ధ్యాస నేను దూరమవుతాననే ఆలోచనికే తాను చనిలోవలనుకుంది అదే నేను దూరమయితే తలచుకొంటేనే భయమేసింది. ఇకఏమైనా తనని దూరం చేసుకోకూడదనుకున్నాను

ఎక్జామ్స్ రానే వచ్చాయి ఇద్దరికి ఒకే సెంటర్ వచ్చింది కానీ తనతో మాట్లాడటానికి కుదిరేదికాదు. వాళ్ళ నాన్నగారు వచ్చి దిగబెట్టేవారు. పరీక్షలు రాస్తున్నానేగాని పరీక్షలు అయిపోతే తనని ఎలా కలవాలి అనే ఆలోచనే నన్ను వేధించేది . అప్పుడు వర్ష నన్ను ఇంక రేపటితో పరీక్షలు అయిపోతాయి మరి మనం ఎలా కలవడం అని అడిగింది. నేను ఆలోచించిచి సాయింత్రం బాబా టెంపుల్కి రమ్మని చెప్పాను. వర్ష సాయింత్రం టెంపులకి వచ్చింది .

అప్పుడు నేను నా నిర్ణయాన్ని వర్షకు చెప్పాను. కానీ తాను ముందు భయపడింది. కానీ ఇంట్లో పరిస్థితులు మేము ఆ నిర్ణయం తీసుకొనేవిధంగా చేశాయి. చివరికి చివరి పరీక్షలు కంప్లిటయ్యే రోజు రానే వచ్చింది. అప్పుడు నేను నా ఫ్రెండ్ తో ఎక్జామ్స్ సెంటర్ కి బయలుదేరాను

అనుకోకుండా ఆరోజు నాకు ఆక్సిడెంట్ అయ్యింది . నాకు మా ఫ్రెండ్ కి కూడా దెబ్బలు తగిలాయి. అయినా మేము ఎక్జామ్స్ కివెళ్ళాము. ఒంటిమీద దెబ్బలతో నే ఎక్జామ్స్ రాసాను. మొత్తానికి ఎక్జామ్స్ కంప్లీటయ్యాయి . తాను ఎక్జామ్స్ రాసి బయటకు వచ్చింది .నన్ను చూసి కంగారు పడింది. నా ఒంటిమీద దెబ్బలు చూసి ఏడ్చింది అయితే మేము ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆరోజే మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవలనుకున్నాము. కానీ తాను అందుకు ఒప్పుకోలేదు. నా పరిస్థితి చూసి నన్ను వెళ్లిపోమని బాధపడింది. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు .అందుకు తాను ఆ ప్రోగ్రామ్ ని మారునాటిరోజుకి వాయిదా వేసింది.

వర్షనీ నేను ఇంటిదగ్గర దిగబెట్టి నేను కూడా ఇంటికివేళ్ళను మరుసటి రోజు నేను తన గురించి ఎదురు చూస్తున్నాను..... సమయం 10:00am నేను తనగురించి ఎదురుచూస్తున్నాను. కానీ తాను ఇంకా రాలేదు 10:30 ఐయింది తాను ఇంకా రాలేదు నాకు భయమేసింది ఏంచేయాలో తెలియలేదు వాళ్ళ ఇంటికి ఫొన్ చేస్తే ఫోన్ కలవలేదు నాకు టెన్షన్ ఎక్కువయ్యింది. మళ్ళీ ఏమైనా తాను పిచ్చిపనులు(సూసైడ్) చేస్తుందేమోనని. ఇక ఎమైనా గాని తనని కలవాలని వాళ్ల ఇంటికి బయలుదేరాను.

కొంతదూరం వెళ్ళాక వర్ష నాకు కనిపించింది. అప్ప్పుడు తన మొహంలో ఏదోతెలియని భయం మరియు ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఆందోళన మొత్తానికి వర్ష నన్ను నమ్మి నాతో వచ్చేసింది. అప్పుడు మొదలైంది మా టెంషన్న్ ఎక్కడికెళ్ళాలో తెలియదు వెళ్లిన తరువత ఏమి ఉద్యోగం చేయాలో తెలియదు కానీ వర్షనీ మాత్రం సంతోషంగా చూసుకోవాలి అని నిర్ణయించుకుని మా ప్రయాణం సాగించాను. మేము అనకాపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్ళాము. అక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలో తెలియక హైద్రాబాదు ట్రైన్ ఎక్కము.వర్ష నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది నా జీవితం లో బాధ తప్పించి సంతోషం అనే పదానికి చోటులేదు అనుకున్నాను కానీ నీవల్ల ఇప్పుడు సంతోషం గా ఉన్నాను అని చెప్పింది అప్పటికే మధ్యాహ్నం 12 అయింది.అప్పటికే మా ఇంటిలోవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతకడం ప్రాంభించారు. మా ఫ్రెండ్ బుజ్జిని చాలా ఇబ్బంది పెట్టారుట్ట. మా ట్రైన్ అన్నవరం వచ్చింది. మేము బయటకు వచ్చాము సరే ముందు గుడి దర్శనానికి వెళ్దాం అని గుడికి వెళ్లి దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసి అప్పుడు ఆలోచించాము ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అని చెప్పాను అందుకు వర్ష సరే అంది.

మేము ఉండటానికి ఇల్లు కోసం వెతికాము కానీ మమ్మల్ని చూసి ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే మా వయసు చిన్నవయసులాకనిపించింది కనుక.అప్పటికే సాయింత్రం అయ్యింది. రాత్రి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి మాది. అప్పుడు అక్కడ ఒక సత్రంలో ఒక గది అద్దికి అడుగగా ముందు అతను ఇవ్వను అన్నారు. కానీ మా పరిస్థితి చూసి అతను గది అద్దికి ఇచ్చారు. గది అద్దెకు తీసుకొని 3 రోజులు ఉన్నాము అప్పుడు తనని నేను గుడి దగ్గరే పెళ్లిచేసుకొన్నాను. ఆ తరువాత మేము జాబ్ కోసం ఇల్లు కోసం వెతకడం ప్రారంభిచాము కానీ ఇక్కడ జాబ్ మరియు ఇల్లు దొరకలేదు మేము అక్కడ ఉన్న 3 రోజులు 1పూట భోజనం తెచ్చుకొని సర్దుకొనేవాళ్ళం. తెచ్చుకున్న డబ్బులు అయిపోవచ్చాయి ఇంకా ఇల్లు దొరకలేదు జాబ్ దొరకలేదు.

అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక అక్కడ అన్నవరం లో ఉన్న మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కిరణ్ సహాయం అడిగాను తాను నాకు ఇల్లు దగ్గరుండి చూపించాడు మరియు ఆ ఇంటి ఓనర్ ప్రకాష్ గారు చాలా మంచి అతను. అతను నాకు పెట్రోల్ బంక్ లో జాబ్ కూడా చూసారు. కిరణ్ కూడా మాకు డబ్బులు సహాయం చేసాడు దాంతో కిరాణా సరుకులు మరియు వస్తువులు కొనుక్కున్నాము. కానీ మేము అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియదు. కొన్నాళ్ళు నేను పెట్రోల్ బంక్లో పంప్ బాయ్గా చేసాను.తనకి అక్కడ దగ్గరలో స్కూల్లో ట్యూటర్ గా జాయిన్ అయ్యింది అలా మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము

అప్పుడే అనుకోని విధంగా మా పేరెంట్స్ అక్కడకు వచ్చారు మేము అక్కడ ఉన్నట్లు మా వాళ్ల కు మా కజిన్ బ్రదర్ ద్వారా తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తామన్నారు. కానీ మేము అందుకు ఒప్పుకోలేదు మావాళ్ళు మరియు వాళ్ళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేశారు అందుకోసమైనా మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి మేము వెళ్లి మా ఇష్ట ప్రకారమే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పాము. చేసేదేమీలేక వాళ్ళు మమ్మల్ని పంపిచేశారు. అప్పుడు కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు. వర్ష వాళ్ల నాన్న గారు తనని బాగా తిట్టి వెళ్లిపోయారు. మేము తిరిగి అన్నవరం వెళ్లిపోయము. మరికొన్ని రోజులకి వర్ష వాళ్ల నాన్న గారు మేము ఉన్న ఇంటికి బాగా తాగి వచ్చి తనని నన్ను బాగా తిట్టి వెళ్లిపోయారు. కొన్ని నెలల తరువాత మేము అక్కడ నుండి వేరే ఇంటిలోకి మారిపోయాం. ఆ తరువాత జాబ్ కోసం మేము గాజువాక వచ్చి వాళ్ళ ఇంటిలోనే దిగడం జరిగింది. కానీ వాళ్ళ పిన్నికి అది ఇష్టం లేదు పరాయి వాళ్ళలాగా మమ్మల్ని చూసేది. అప్పుడు మేము గాజువాక లోని వేరే ఇలు అద్దికి తీసుకొని అన్నవరం నుండి గాజువాకక వచ్చేసాము. ఆక్కడకు కూడా వాళ్లు వచ్చి ఏదోఒకటి తనని అనేవారు. కానీ అది నాకు నచ్చక వాళ్లకి దూరంగా వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను.నా పరిస్థితి చూసి మా వాళ్ళకు కొన్నాళ్ళకి మా ఇంటికి వచ్చేయమని అడిగారు. అప్పుడు తనని తీసుకుని నేను వచ్చేసాను. మా ఇంటిలో తనకి ఎటువంటి లోటు లేకుండా మావాళ్ళు చూసుకొన్నారు.

మాఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి మాకు పాప పుట్టింది. అప్పుడు పాపని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లాను కానీ వాళ్ల నాన్న గారు బాగా తాగి వచ్చి తనవల్లనే అతను తలెత్తుకొని తిరగలేకపోయానని తనవల్లే ఇల్లు అమ్ముకున్నారని తనని మనసికంగా బాధించేవారు. ఎప్పుడు వెళ్లిన తనతో ప్రేమగా మాట్లాడేవారు కాదు వాళ్లకుటుంభం మొత్తం మమ్మల్ని దూరంగానే ఉంచేవారు నన్ను వాళ్ళు ఆ ఇంటి అల్లుడు లాగా ఎప్పుడు చూడలేదు. ఆ తరువాత మరికొన్నాళ్ళకి మాకు బాబు పుట్టాడు ఆ సంగతి వాళ్ళకి మేము చెప్పలేదు వాళ్ళ దగ్గరకి వెళ్ళలేదు. అక్కడ నుండి మా జీవితం సాఫీగా జరిగిందన్న సమయంలో అనుకోని సంఘటన నా జీవితాన్నే చిదిమేసింది. వర్ష నానుంచి శాశ్వతంగా దూరం అయ్యిపోయింది. జీవితాంతం తోడుగా ఉంటామని తనకి నేను నాకు తను మాట ఇచ్చి తాను మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోయింది.

కాని నువ్వులేని ఈ జీవితం వృధా నా మనసుని చంపుకొని ఈ సమాజంలో బ్రతుకుతున్నాను. నేను కన్న కలలు ఆశలు అన్ని నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నువ్వు ఇక లేవనే ఆలోచనే నన్ను చాలా కృంగదీస్తుంది. కానీ నీకు మాట ఇస్తున్నాను నా ప్రాణం ఉన్నంతవరకు నేను నీ జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటానని.