Ram loves Janani in Telugu Love Stories by HARIKRISHNA BEJJANKI books and stories PDF | రామ్ లవ్స్ జననీ....

Featured Books
Categories
Share

రామ్ లవ్స్ జననీ....

కోరిక సముద్ర గర్బం‌ కంటే లోతైనది‌ భూమి కుండే ఆకర్శణ ‌శక్తి కంటే బలమైనది‌ అలాంటి కోరికకి కొలమానం అది నేరవేర్చుకోవాలనే సంకల్పమే.... ప్రేమించిన వాల్లనే పెళ్లి చేసుకోవాలనే కోరిక ప్రతి ప్రేమికులకు ఉంటుంది కానీ.....? ఎలా వాళ్లు విడిపోతున్నారు ఎలా విడగొడుతున్నదో మీకు తెల్సు....

నా పేరు రామ్ నేను ఒక అమ్మాయి నీ 4years నుండి లవ్ చేస్తున్న తను కూడా నన్ను 2 years నుండి లవ్ చేస్తుంది కని తను నా నుండి దూరంగా వెళ్ళి 6 గంటలు అవ్తుంది తనను పెళ్లి చూసుకొని హ్యాపీగా ఉందం అనుకున్న కానీ అందరి ప్రేమకి అడ్డుగా ఉండే కులం.పెద్దరికం మాకు అడ్డు పడ్డాయి.... తను నా నుండి దూరంగా వెళ్లిపోయింది ఇప్పుడు నేను తన దగ్గరికే వెళ్ళాలి అనుకుంటున్న నేను తన దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 గంటలు సమయం ఉంది అప్పటి వరకు తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటున్న తనను మొదటి సరి చూసిన క్షణం ఇంకా గుర్తుంది ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ జననీ బాగుంది కదా

అది 2017 డిసెంబర్ 3rd ఇంకా గుర్తు తను white డ్రెస్ లో కాఫీ షాప్ లో కూర్చొని ఉంది ఎప్పటిలాగే నేను కాఫీ కోసం వెళ్ళాను కానీ తనని చూసి ఆగిపోయాను.... ఆ క్షణం తను నా సొంతం అనే మాట నా మదిలో అచ్చు పడింది చెరపలేని పచ్చ బొట్టుల తన రూపం మైండ్ లో ఉండి పోయింది కాఫీ కోసం వెళ్లిన నాకు ఉదయాన్నే కాఫీ ఇచ్చే వైఫ్ లా తను నాకు కావాలి అని దేవుడి నీ కోరుకున్న దేవుడు నా మాట సరిగ్గా వినలేదు అనుకుంటా ప్రార్థించే లోపే అమ్మాయి లేచి వెళ్లిపోయింది తన వెంటే నీ పయనం అని నా బైక్ పిలుస్తుంది రారా తన వెంటే వెల్దాం అని బైక్ తీసి బయలుదేరాను తను వెళ్లిన దారి వెంటే... తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అల స్కూటీ పైన తెల్లటి డ్రెస్ లో వెళుతున్న తను ఎవరికి ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ నాకు మాత్రం అతిలోక సుందరి లా అనిపిస్తుంది ఎక్కువ పొగుడుతున్న అనుకున్న అలానే ఉంది మరి తను చెప్తే నమ్మండి లేకుంటే నా కళ్ళతో చూడండి తెలుస్తుంది....ఇది కలో నిజమో తెలియని కలవరం లో తను ఆగింది సడెన్ గా నా గుండె ఆగినంత పని అయ్యింది తన స్కూటీ పక్కన పెట్టీ నా దగ్గరికి వచ్చింది అల తను నా ముందు ఉన్న ఆ క్షణం నా జీవితం లో మర్చిపోలేని క్షణం....:

జీవితాంతం ఉండలేదని కావొచ్చు దేవుడూ ఆ కలిసిన క్షణాన్ని ఎంతో అందంగా ఆనందంగా నడిపించాడు

నిజంగా ఒక అమ్మాయి నీ చూసిన క్షణాన్ని ఎవరు మరిచిపోలేరు ఎందుకంటే ఆ చూసిన క్షణం లోనే అనిపిస్తుంది గా జీవితాంతం తనతోనే అని.. కని జీవితం నుండి దూరం అయ్యాక బాధలో గుర్తు చేసుకొని సంతోష పడే గురుతులు గా ఆ క్షణాలు మిగిలిపోతాయి అని ఇప్పుడే అర్థం అవుతుంది...

ఆ రోజు తను నా దగ్గరికి రా గానే గుండె వేగం పెరిగింది శ్వాస వేగం తగ్గింది తను మాట్లాడుతుంది ఎందుకు ఫలో అవ్తున్నవ్ నన్ను కాఫీ షాప్ నుండి చూస్తున్న ఎం అయిన చెప్పాలి అనుకుంటుంటే డైరెక్ట్ గా చెప్పు అనగానే ఆ చెప్పు అనే మాటతో నా నోటి నుండి వచ్చిన మాట నేను నిన్ను ప్రేమిస్తున్న అని ఆ మాట వినగానే అందరు అమ్మాయి లు చేసే పనే తను చేసింది కానీ కొంచెం గట్టిగ ఎంటో అర్థం అయింది గా కొట్టి వెళ్లిపోయింది నేను అందరిలానే అందమైన చేయ్ నన్ను తాకింది అనుకోని లైట్ తీసుకున్న తను వెళ్ళి పోయింది నేను మాత్రం తనను చూస్తూ అక్కడే ఉండి పోయా ....సరిగ్గా 2 రోజుల తర్వాత మళ్లీ తనని చూసా మా ఇంటి దగ్గరి కూరగాయల షాప్ దగ్గర తనని చూడగానే దగ్గరికి వెళ్లి మాట్లాడాలని చూస కని భయం నా అడుగులని ఆపేసింది అయిన దైర్యం చేసి వెళ్ళాను అప్పుడే వల్ల నాన్న వచ్చాడు....అక్కడే ఆగిపోయాను తనను చూస్తూ ఉండి పోయా ....ఇప్పుడు తనని చూడనికి కూడా లేకుండా కంటికి దూరంగా చేశాడు దేవుడు కొన్ని సార్లు అనిపిస్తుంది దేవుడూ మంచివాడా చెడ్డవడా అని ఎందుకంటే కొన్ని సార్లు అన్ని మనకు అనుకూలంగానే నడిపిస్తాడు కథ కని చివరలో ఆ ఆనందాన్ని మించిన దుఃఖాన్ని మిగిలిస్తాడు అందుకే దేవుడి పైన అప్పుడప్పుడు కోపం వస్తుంది కని ఇప్పుడు రావటం లేదు ఎందుకంటే నా జననీ దగ్గరికి చేరుకోవడానికి ఇప్పుడైనా సహాయ పడతాడు అని చిన్న ఆశ ఇంకా కొంత సమయమే ఉంది తన దగ్గరికి వెళ్ళడానికి.
అసలు మేము ఇద్దరం ఎలా ఒకయ్యమో చెప్పలేదు కదా అది 2019 feb 2.....?