ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలెయ్యడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాసాడు.
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా ...Read More
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 2
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర వెంటనే అతని మొహం అంతా హర్ట్ తో నిండిపోయింది. "నా క్లోజ్ ఫ్రెండ్ కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా." ఆ వాయిస్ లో కూడా బాధ వుంది. "కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు." ఆలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది. తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడిన మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్నతన అంచనా తప్పయిపోయింది. తను పరీక్షలు రాసి వూరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. తను ఎంతో డిజప్పోయింట్ అయింది. అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మరిచిపోయింది. కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అని పదే పదే ఆలోచిస్తూంటే అంతసేపూ ...Read More
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 3
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "తను మనింట్లో నలభై రోజులు కాదు, ఇక్కడే ఉంటానన్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చేసింది నాకు." మదన్ చెప్పింది వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. "కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకు ఎందుకు చెప్పలేదు? మాకు కావాల్సిందల్లా నీ ఆనందమే కదా." ఆ సమయం లో కిచెన్ లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా వున్నారు. "అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా ఒకటి రెండు సంవత్సరాలు బాచిలర్ గానే ఉండాలని వుంది." అలా చెప్పాలని తట్టినందుకు ఆనంద పడ్డాడు మదన్. "నేను ఇప్పుడూ అదే మాట అనబోతూ వున్నాను. మీరిద్దరూ లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు ...Read More
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నిజంగానా?" తనకి తెలియకుండానే తనూ రాతి కిందకి దిగిపోయి, ఆమెకి ఎదురుగా వెళ్లి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. "నేనస్సలు నమ్మలేకపోతున్నాను." "చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పానని." సమ్మోహనంగా నవ్వింది సుస్మిత. "నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ నువ్వు నా దగ్గరకి రావడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు. ఈ లోపున పరీక్షలు అయిపోయాయి. నువ్వు వెళ్లి పోయావు. అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు." కాస్త ఆగింది. ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా ఆలా చూస్తూనే వుండిపోయాడు మదన్. తను హ్యాండ్సమ్ గా ఉంటానని మదన్ కి తెలుసు. కానీ ఇలాంటి ...Read More
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 5
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "బహుశా అదే కారణం వల్ల కావచ్చు తనని ఆ దృష్టితో చూడలేక పోయాను. తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తూందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పను. నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి భావాలూ ఆలోచనలు పెట్టుకోవద్దని. కానీ తను వినలేదు. నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు. నా అన్నావదినాలకి కూడా తనంటే అంతో ఇంతో ఇష్టమే కావడం, తన పేరెంట్స్ కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. తనని ప్రేమించమని, ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది. నేనెక్కడికి వెళ్లిన నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకూ వచ్చాక, నా కుడి ...Read More