ఇది మన కథ

(4)
  • 46.1k
  • 4
  • 19.3k

వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! . ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్‌ కార్డుపై గోల్డ్‌ కలర్లోని ‘మానస వెడ్స్‌ తరుణ్‌’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్‌ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్‌ యార్‌. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది.

1

ఇది మన కథ - 1

వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..!.ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్‌ కార్డుపై గోల్డ్‌ కలర్లోని ‘మానస వెడ్స్‌ తరుణ్‌’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్‌ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్‌ యార్‌. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే ...Read More

2

ఇది మన కథ - 2

ఎప్పుడైనా తను లీవ్‌ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది.మా ఆఫీస్‌లో తన లాస్ట్‌ వర్కింగ్‌ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్‌ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్‌ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్‌ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ ...Read More

3

ఇది మన కథ - 3

‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది..‘కరెక్టో కాదో అన్నది కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్‌ యూ టూ డియర్‌’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్‌ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్‌ ...Read More

4

ఇది మన కథ - 4

తను అలా నన్ను వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేక పోయాను చాలా బాధ పడ్డాను .అయినా నన్ను ప్రేమించి అమ్మ కోసం ,నాన్న కోసం ,సమాజం అని ఎవడినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం ఎంటి ..?నాకు ఏమి అర్ధం కాలేదు . అయినా నేను తప్పుడు మనిషిని ప్రేమించాను అని చాల ఫీల్ అవుతూ ఉన్నాను .అందరు ... ఆ బ్రహ్మ మనుషుల తల రాతలు రాస్తాడు అంటారు.కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను.నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను.ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది,నమ్మకం మెదడుకు సంబందిoచినది.ఒక్కసారి నిజంగా ...Read More