నీడ నిజం

(10)
  • 168.5k
  • 4
  • 74.8k

హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ?” వృద్ధుడి కం

New Episodes : : Every Tuesday & Friday

1

నీడ నిజం - 1

నీడ-నిజం నాంది హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ...Read More

2

నీడ నిజం - 2

రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద ...Read More

3

నీడ నిజం - 3

తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా ...Read More

4

నీడ నిజం - 4

.‌‌‌‌‌‌‌‌‌‌ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో విధ్యాదరి ఓ పాపులర్ డైలీ లో ఓకే ప్రత్యెక కాలం నిర్వహించేది . ఆ దిన పత్రిక తరపున సదస్సుకి ఆహ్వానింప బడింది . సదస్సుకు ముఖ్య అతిథి సాగర్. ఆ ఎం.జీ.ఓ మహారాజ పోషకుడు. అ సందర్భం లో విద్యాధరిని చూడడం , మాట్లాడటం జరిగింది . ఎందఱో ఉగ్రవాదం పై విభిన్న కోణాల్లో మాట్లాడారు . విద్యాధరి కూడా మాట్లాడింది . అందరితో పోలిస్తే ఆమె భావాల్లో సమస్య పై మరింత స్పష్టత, ఇరు మతాల వారికీ అనుకూలమైన ఆలోచనలు , అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె భావాలూ సదస్సులో చాల మందికి నచ్చాయి . నిజం చెప్పాలంటే ...Read More

5

నీడ నిజం - 5

అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన కారణం ఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి. ...Read More

6

నీడ నిజం - 6

ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు. విశాల రాజస్థాన్ లో ఆమె వర్ణించే ప్రదేశాలు ఎక్కడని వెదకటం ? వెంటనే భారత్ రామ్ కు ఓ రాజస్థాన్ మిత్రుడు గుర్తుకొచ్చాడు.అతడే శాంతిలాల్ .వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రాజస్థాన్ లో మూల మూల పరిచయం వుంది. భరత్ రామ్ అతడిని సంప్రదించాడు. విద్యాధరి కధనం సాంతం విన్నాక శాంతిలాల్ మనసులో రెండు ప్రదేశాలు మెదిలాయి. అ రెండు ప్రదేశాలు గ్రామీణ వాతావరణం లో ఉన్నవే. భరత్ రామ్ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. అయన సూచన ప్రకారం సాగర్, విద్యాదరి ఒకసారి రాజస్థాన్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాలి. ఇందువల్ల విద్యాధరి సమస్యకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది. ...Read More

7

నీడ నిజం - 7

అ గ్రామం లో గాలి దుమారం లా పరుగులు తీసి ఊరికి మరో చివరికి వచ్చింది. అక్కడ రాజమహల్ లా కనిపించే ఒక భవనాన్ని చూసి బాధ, భయం, ఉద్వేగం, ఉద్రేకం- ఒక్కసారి కలగలిసి సాగర్ర కెరటాల్లా ఆమె ను చుట్టూ ముట్టాయి.ఆ తాకిడికి తట్టు కోలేక స్పృహ తప్పింది. సుదర్శనం డాక్టర్ గా ఆమె రక్షణ బాధ్యత తీసుకున్నాడు.వెంటనే అందరూ తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ధ్యాసలో , ఆలోచన లో వారుండి పోయారు.విద్యాధరి రాక, ప్రతి కదలిక గ్రామ వాసుల్లో కలకలం, కలవరం రేపాయి. ఆమె ఏనాడో గతించిన "కోమలా దేవి" అన్న నిజం వారికీ అసలు మింగుడు పడలేదు. ఈ అద్భుతం వారికి దైవ ఘటనగా తోచింది. ఆమె దైవాంశ సంభూ తురాలు అన్న భావన వారి మనస్సులో బలం గా నాటుకుంది. ఎవరికీ తో చిన విధం గా వారు ...Read More

8

నీడ నిజం - 8

రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ఉత్సాహం -ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగాడు. చివరి మెట్టుపై పేరుకు పోయిన నాచు మొక్కలు రాహుల్ కాలుజారి చెరువులో పడేలా చేసాయి. అంతే భయం తో రాహుల్ పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రాహుల్ నీళ్ళలో పడిన చోట లోతు ఎక్కువ. అందుకే నేల అందక నీళ్ళపై గిలగిల కొట్టుకుంటున్నాడు. క్షణాల్లో పరిస్థితి విషమించింది. ఎవరో ఒకరు సాహసం చేయకపోతే ఓ పసి ప్రాణం నీటి పా లవుతుంది. కోమల క్షణం ఆలస్యం చేయలేదు. మొండి ధైర్యం తో చెరువులో దూకింది.గట్టు మీద ఆడవాళ్ళు ‘జాగ్రత్త,జాగ్రత్త’ అని అరుస్తున్నారు. ఎలాగో ప్రాణాలకు తెగించి కోమల రాహుల్ ను ...Read More

9

నీడ నిజం - 9

తల్లి మనోవేదన చూసి కూడా వారు కదలలేదు.మెదలలేదు.తమ వైఖరి మారదన్నట్లు మౌనంగా వుండిపోయారు. విషయం తెలిసి విక్రమ్ బిగుసుకు పోయాడు.తనంటే ప్రాణం పెట్టే తమ్ముళ్ళే తన హర్షించలేక పోతున్నారు. ఇప్పుడు తనేం చేయాలి ? తమ్ముళ్ళ కోసం తన నిర్ణయాన్ని వెనక్కు తీసికోలేడు. అలాగని తమ్ముళ్ళను ఒప్పించ లేడు. తన అవసరం తనది.వారి ఆలోచనలు,అభ్యంతరాలు వారివి. రెండూ సమాంతర రేఖలు. తమ్ముళ్ళను పిలిచాడు. తమ ప్రవర్తన కు అన్ని గట్టిగా మందలిస్తాడని వారూహించారు. అన్నకు ఏ సమాధానం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. అన్నను ఎదిరించలేరు..ఆయన నిర్ణయాన్ని ఆమోదించలేరు. చిత్రమైన పరిస్దితి. “...కోమలి తో నా వివాహం మీకు నచ్చలేదు. అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. నా కోసం మీరు దిగి రావాల్సిన పని లేదు. మీ అభ్యంతరాలు మీవి.నా సమస్య నాది. మనది రాజవంశం.మన చరిత్ర గొప్పదన్న స్పృహ నాకూ వుంది...ఈ పరగణాన్ని. శాశిస్తూ అందరికీ ఆదర్శంగా వుండే ...Read More

10

నీడ నిజం - 10

ఈ విషయం పనివారి ద్వారా విక్రమ్ తల్లి కి తెలిసింది.ఆమెకు కొడుకు-కోడలి అవస్థ అర్థ మైంది.పర్వం పేరు తోనో,పండుగ పేరుతో నో రాహుల్ ను కొంతకాలం కీ దూరంగా వుంచాలనుకుంది. అందుకు దైవికంగా అవకాశం వచ్చింది. రాహుల్ ను ఎలాగో ఒప్పించి, ఆ పసివాడిని తీసికొని పక్క వూరికి ప్రయాణమైంది.మొదట రానని మొరాయించాడు. కాని నాయనమ్మ మాటల గారడీ కి పడి పోయాడు. పైగా అప్పుడు వేసవి శెలవులు. స్కూల్ బెడద కూడా లేదు.రాహుల్ కూడా హాలిడే మూడ్ లో వుండటంతో ఆమె పని సులువైంది. తల్లి సమయస్ఫూర్తి కి విక్రమ్ మనసులో నవ్వుకొన్నాడు. కోమల కూడా మనసులో నే కృతజ్ఞతలు చెప్పుకుంది. కోరినంత ఏకాంతం . కోమలా విక్రమ్ సింగ్ ల ను శారీరకంగా ఒకటి చేసింది. అంకిత భావం, ఆర్ద్రత, అనురాగం త్రివేణీ సంగమమై కోమల రూపంలో విక్రమ్ ను వరదలా ముంచెత్తాయి. ఇలా రోజులు క్షణాల్లా ...Read More

11

నీడ నిజం - 11

అఘోరి విక్రం లోగిలి లో అడుగు పెట్టగానే అప్రయత్నం గా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుకు కారణం అతడికి స్పష్టం గా స్ఫురించలేదు. కానీ, ఏదో అర్థం అపశ్రుతి మనసు లో మెదిలింది . వెంటనే ఆ అనుభవం దంపతులకు వివరించాడు. జాగ్రత్త గా ఉండమని సూచన చేసాడు.విక్రం ఆ సూచన అంతగా పట్టించుకోలేదు. ఆడది కనుక కోమల కొంత జంకింది . ఏం జరుగుతుందో అన్న భయం ఆమె లో కాస్త అలజడి రేపింది .ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓ ఎండవేళ , ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ లేని సమయాన ఓ ఆగంతకుడు విక్రం ఇంటి ముందు ‘ భిక్షాందేహి’ అంటూ నిలుచున్నాడు. అతడు ఔత్సాహిక క్షుద్రోపాసకుడు –పన్నాలాల్. ఆ పిలుపు విన్న కోమల భిక్ష వేసి వెళ్లి పోయింది. ఆ యువకుడు వెంటనే కదలలేదు .ఒక్క క్షణం చుట్టూ అనుమానం గా చూసాడు . ...Read More

12

నీడ నిజం - 12

కాళరాత్రి ఎలాగో గడిచింది . తెల్లవారింది .విక్రం సింహ్ మరణవార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది . జనం తీర్థప్రజ లాగా రాసాగారు . పరగణా కదిలింది . సముద్రం లా పొంగిన జనసముహాలను , సానుభూతి పరులను ఆపటం విక్రం తమ్ముళ్ళకు అసాధ్యమైంది . అన్నగారి అంత్య క్రియలు మరో రోజుకు వాయిదా వేయక తప్పింది కాదు . ఆ రోజు కూడా అరని శోకంతో నే గడిచి పోయింది . ఏది ఆగినా ఆగక పోయినా కాలం ఆగదు . సూర్యుడు పడమటి కొండల పై అలసట గా నిట్టూర్చాడు . ఊరి పై చీకటి మెల్ల మెల్ల గా పరుచు కుంటోంది . విక్రం శవాన్ని అ రోజు ఉదయమే పెద్ద లోగిలి కి తరలించారు . శవాన్ని ప్రత్యేకమైన తైలాలతో భద్రపరచారు . పూలవాసన తో , అగరుధూపం తో శవాన్ని ఉంచిన ప్రదేశం ...Read More

13

నీడ నిజం - 13

13వ ఎపిసోడ్ ఈ వివరణ తో పన్నాలాల్ కు మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది . ప్రజల నమ్మకం, భక్తి ఓ రక్షణ కవచం లా అనుకున్నది సులభం గా సాధించవచ్చు . ఈ ప్రయత్నం లో తనకు అజయ్ సహకారం ఉంటె చాలు . పనివారిని అడిగితే అజయ్ మేడమీద ఉన్నాడని తెలిసింది . తన మంత్రాన్గానికి అదే అనువైన చోటు అని అనుకుంటూ మెడ మెట్లు ఎక్కాడు పన్నాలాల్ స్వామి వేషం లో ఉన్న పన్నాలాల్ ను అజయ్ మొదట గుర్తించలేదు . గుర్తించిన తర్వాత అతడి అసాధారణ వేషం చూసి ఆశ్చర్య పోయాడు . పెద్ద ఉపోద్ఘాతం లేకుండా ,నాన్చకుండా, సూటిగా అసలు విషయం వివరించాడు . “అజయ్ బాబు ! నేను చెప్పేది ప్రశాంతం గా వినండి . మీరిప్పుడు పుట్టెడు దుఖం లో ఉన్నారు . ఈ స్థితి లో మిమ్మల్ని ...Read More

14

నీడ నిజం - 14

అజయ్ నే అనుసరిస్తూ ఆ గదిలో అడుగు పెట్టిన కోమల ఎదురుగా కుర్చీలో కూర్చున్న సాధువు లాంటి ఆగంతకుడిని చూసి కలవర పడింది . అజయ్ ప్రశ్నార్థకం గా చూసింది . “ వదినా ! వీరు గొప్ప సాధువులు. ఈ కష్ట కాలం లో వీరి రాక కాస్త ఊరట కలిగిస్తుందని నేనే పిలిపించాను . అన్నయ్య కు వీరు దైవం తో సమానం . వీరి మాటంటే అన్నయ్యకు వేదం . వీరు చెప్పేది శ్రద్ధగా వినండి . మీకు వీరి మాటలు నచ్చితే , అందువల్ల మీ బాధ తొలిగి పోతుందనుకుంటే వీరు చెప్పినట్లు చేయండి . అయితే – ఇందులో బలవంతం ఏమీ లేదు .” క్లుప్తం గా ముగించాడు అజయ్ . అనుకున్నది సాధించాలన్న లక్ష్యం తో అజయ్ కోమల తో అతి వినయం గా మాట్లాడవలసి వచ్చింది . ఇప్పటికే రెండు ...Read More

15

నీడ నిజం - 15

మరైతే నేను చెప్పేది జాగ్రత్తగా విను !రే పు నీ భర్తకు ఘనంగా అంత్య క్రియలు జరుగుతాయి. . ఈ ఊరి చరిత్ర లో అదొక పోలేని అపూర్వ సంఘటన. విక్రం పుణ్యాత్ముడు . ధన్యజీవి! జీవితాన్ని ఒక సాధన గా , తపస్సు గా భావించిన మహామనీషి. అలాంటి ఉత్తముడు నీ భర్త కావడం నీ పూర్వజన్మ సుకృతం . ఆయనతో నీ జీవితం అతి స్వల్పమే అయినా అదొక అపూర్వ వరం ! అలాంటి మ హా నుభావుడు శాశ్వతం గా తప్పుకున్నాక వైధవ్యం భరిస్తూ అసలెందుకు బ్రతకాలి ? అంతకన్నా అతడిని అనుసరిస్తూ పుణ్యస్త్రీ గా సహగమనం చేయటం ఉత్తమం కదా ?” “ మీరు చెప్పింది అక్షరాలా నిజం.” కోమల అతడి తర్కజాలంలో పూర్తిగా పడి పోయింది . పైగా మనసును భ్రమిమ్పజేసే మంత్ర ప్రభావం ! “ ఈ పరిస్థితి లో నీకు ...Read More

16

నీడ నిజం - 16

కోమల పద్మాసనం లో నిటారుగా, యోగినిలా ఉంది . చూపులు నేల వైపు, మొహం లో ఏ భావం లేదు . ఎవరేం చెప్పినా బదులు . మౌనం -------అందరి మతులను పోగొట్టే మౌనం .!పన్నాలాల్ కు పరిస్థితి అర్థమైంది . ఆమెను కాస్త కదిలించే ప్రయత్నం చేయాలి . కోమల కు ఎదురు నిల్చున్నాడు . స్వరం మార్చి , విజయ్, తేజ్ సింహ లకుఅనుమానం రాకుండా “ అ మ్మా ! కోమలా అని మెల్లగా పిలిచాడు . కోమల ఉలిక్కిపడి పన్నాలాల్ ను చూసింది . కళ్ళు కలుసుకున్నాయి .“ చూడమ్మా కోమలా ! ఇందరు పెద్దలు ఇంతగా ప్రాధేయ పడుతుంటే మౌనంగా ఉండటం భావ్యం కాదు . అవతల ఆ పుణ్యాత్ముడికి అంత్యక్రి యలు జరగాలి . త్వరగా నీ మనసులో మాట వారికి చెప్పమ్మా . !” పన్నాలాల్ ‘సూచన ‘ చేశాడు ...Read More

17

నీడ నిజం - 17

విద్యాదరి సుదీర్ఘ కధనం ముగిసింది. చివరి సంఘటన లో ప్రభావం ఆమె ముఖం పై స్పష్టం గా కనబడుతోంది . బంగారు ఛాయలో మెరిసే ఆమె లో అరుణ వర్ణం . విద్యాధరి తీవ్రమైన మానసిక సంఘర్షణ కు , ఉద్రేకానికి లోనవుతున్నట్లు ప్రొఫెసర్ భరత్ రామ్ గమనించాడు . “ కూల్ డౌన్ “ ఆమె వెన్ను తట్టి అనునయించాడు . తండ్రి లాంటి భరత్ రామ్ అరచేతిని విద్యాధరి ఆర్తిగా చెంపకు ఆనించుకుని కళ్ళు మూసుకుంది . ఆమె కళ్ళు స్రవిస్తున్నాయి . భరత్ రామ్ కు ఆ క్షణాలు ఎంతో పవిత్రం గా అనిపించాయి . గతం లోంచి వర్తమానం లోకి ఆమె పూర్తిగా రాలేక పోతోంది . ఇంకా ఏవో జ్ఞాపకాల శకలాలు మనసు పొరల్లో ఉండిపోయి ఆమెను కదిలిస్తున్నాయి . ఇంకా ఏదో చెప్పాలన్న తహ తహ ఆమె కళ్ళల్లో స్పష్టం గా ...Read More

18

నీడ నిజం - 18

రాహుల్ బాబు ---ముప్పై అయిదు వసంతాల నిండు వ్యక్తిత్వం. ఆకర్షణీయమైన రూపం . కళ్ళ మెరుపుల్లో తళుకుమనే సౌజన్యం .సంస్కారం. గంభీరం గా కనిపించినా ఎదలో ప్రతిధ్వనించే ‘ చక్రవాక’ రాగం. ఓ చక్కని అనుభూతి, ఓ చక్కని అనుభవం వెరసి రాహుల్ బాబు .రాహుల్ కు మనసు తెలుసుకొని నీడలా మెలిగే అర్ధాంగి. పదేళ్ళ లోపు కూతురు ఉన్నారు కూతురి పేరు -కోమలాదేవి !కోమలా దేవి మమతల యశోదా మయిలా రాహుల్ కు మాతృప్రేమ లో మాధుర్యం గోరుముద్దల్లా అందించింది . ఆ అనురాగం పూర్తిగా ఆస్వాదించక ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని కోమలా దేవి నాటకీయం గా లోకం నుండే తప్పుకుంది . ఆ వెలితి ఎవరూ పూడ్చలేనిది .రాహుల్ కూతుర్ని కోమలాదేవి ప్రతి రూపం గా పెంచుకుంటున్నాడు. కూతుర్ని అమ్మా’ అని పిలుస్తూ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లి పోయిన తల్లిగాని తల్లిని అనుక్షణం ...Read More

19

నీడ నిజం - 19

విద్యాదరి రాజస్తాన్ నుండి హైదరాబాద్ వచ్చిందని తెలియగానే ఆమె తల్లితండ్రులు ,చెల్లెళ్ళు ఆమెను చూసేందుకు వచ్చారు. విద్యా వారితో కలిసి గ్రామానికి బయలుదేరింది. పుట్టిన ఊరు ఆ ఒడిలో లభించే ప్రశాంతత , ప్రేమ ఓ మధురానుభూతి . ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణం ఆమె మనసు తేలికైంది. తల్లి ఆదరణ , తండ్రి వాత్సల్యం, చెల్లెళ్ళ స్నేహానురాగాలు----విద్యాధరి కి రోజులు క్షణా ల్లా దొర్లిపోతున్నాయి . కూతురు చెప్పిన విషయాలు సాంతం విన్నాక మాధవరావుకు అఘోరి గుర్తుకు వచ్చాడు . అతడు చెప్పిన భవిష్యవాణి ఇంతవరకు జరిగింది ‘ ప్రారంభం’. కాదు కదా అనిపించింది . ! కాస్త భయం వేసింది . కానీ----తన అనుమానం కూతురుకు చెప్పలేదు . ఇదే సందేహం , భయం విద్యా లో కూడా ఉంది . తండ్రి లాగానే తనూ బయట పడలేదు . ఒకరోజు సాయంత్రం విద్యాధరి గుడికి వెళ్ళింది ...Read More

20

నీడ నిజం - 20

అజయ్ పెదవులపై చిరునవ్వు ‘ గొప్ప రాజవంశానికి ప్రతినిధి ‘ అన్న కామెంట్ మంత్రం లా పనిచేసింది . నిజానికి అతడి బలం, బలహీనత---రెండూ ఈ లో నే ఇమిడి ఉన్నాయి . అతడి సంస్కారానికి , సంకుచిత మనస్తత్వానికి royal blood అన్న భావనే మూలం . అన్న విక్రం నుండి మంచి గుణాలు పుణికి పుచ్చుకు న్నాడు . జాత్యహంకారం తో మొండిగా, బండ గా తయారయినాడు . ఇంతలో రూపా దేవి వచ్చింది . భార్య గా పరిచయం చేశాడు . పేరుకు తగ్గట్లే ఆమె చాలా అందం గా ఉంది . చదువు, సంస్కారం ఉన్న మనిషి లా అనిపించింది . ఈ బండరాముడికి, దొండపండు లాంటి రూపా దేవికి జత ఎలా కుదిరిందా ? అని జస్వంత్ ఆశ్చర్యపోయాడు . “ ...... సతి నిస్సందేహం గా దురాచారమే . ఈ అభిప్రాయం ...Read More

21

నీడ నిజం - 21

అతడి కామెంట్ కు అజయ్, రూపా దేవి మొహాల్లో తృప్తి , ప్రసన్నత కనిపించాయి. జస్వంత్ కోమల పునర్జన్మ పై ఏ ప్రశ్నలు వేయలేదు . సంఘటన వివరాలు తెలియనట్లే ఉండిపోయాడు . తను మాత్రం ఊరిలో చాలా మందిని కలిసి విద్యాధరి రాకకు సంబంధించిన వివరాలు సేకరించాడు . గ్రామం నుండి జైపూర్ తిరిగి వచ్చాడు . రిలాక్స్ అయాడు . Future plans ...Read More

22

నీడ నిజం - 22

" సతి" ---మరిచి పో దగిన ఓ చారిత్రిక సత్యం’—‘sati -A forget table historical fact--- అన్న మకుటం తో రెండు పేజీల సుదీర్ఘ రెండు వారాల ‘ ఆదివారం అనుబంధం కోసం జస్వంత్ సిద్ధం చేశాడు . very very thought provoking and logical . మొదటి వారం –సతి పుట్టు పూర్వోత్తరాలు chrological order lo వివరించాడు . కాలం తో పాటు సతి ఆచరణలో వచ్చిన విపరీతమైన , అమానవీయ మార్పులు , ఆ కాలం నాటి స్త్రీల నిస్సహాయత , దుస్థితి కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు . తన కధనానికి సాక్ష్యం గా చారిత్రిక సంఘటనలు ఉదాహరిస్తూ సతి దురాచారమని నిస్సందేహం గా తీర్మానించాడు . కానీ- కొన్ని అనివార్య పరిస్తితులలో , సందర్భాల లో , సతి—‘జౌహర్ విధి గా ఆచరించ వలసి వచ్చింది . రాజపుత్ర కుటుంబాలలో -రాజ్యం ...Read More

23

నీడ నిజం - 23

రాహుల్. కోమలా దేవి . మా అమ్మ.” మూడు పదులు దాటిన అ యువకుడిని జస్వంత్ పరిశీలన గా చూశాడు . సాదరం గా చేయి . “ చెప్పండి. What can I do for you ?” మీకు ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా తెలిశాయి ? రాహుల్ సూటిగా విషయాని కే వచ్చాడు . “ మీ ఊరి వాళ్ళ ద్వారా తెలిశాయి . “ కేవలం వాళ్ళు చెప్పిన వివరాలతో అంత సాహసం చేశారా ?” ‘సతి పై ఆర్టికల్ రాయటం సాహసమా ?” “ ఆర్టికల్ రాయటం సాహసం కాదు. చివర కొస మెరుపు జోడించటం “ రాహుల్ మాటలకు జస్వంత్ నవ్వాడు . “ మీ ఊహ కరెక్ట్ . ఆమె వివరాలు వేరే source ద్వా రా తెలిశాయి . అవి తెలిసిన తర్వాతే మీ ఊరు వచ్చాను ...Read More

24

నీడ నిజం - 24

ఎదురుగ ఉన్న అపరిచిత వ్యక్తుల్ని ప్రశ్నార్థకం గా చూశాడు భరత్ రామ్ . “ జస్వంత్, జర్నలిస్ట్, ...హి ఈజ్ రాహుల్.” మర్యాద పూర్వకం గా కలిపాడు . భరత్ రామ్ కళ్ళలో మెరిసిన ఆశ్చర్యం; జస్వంత్ , రాహుల్ కూర్చున్నారు . “జస్వంత్ ! చెప్పండి. “ జస్వంత్ విద్యాధరి డైరీ టేబుల్ పై ఉంచాడు . “ఈ డైరీ.....? “ విద్యాధరి గారిది . మీరు దిగిన లాడ్జ్ రూము లో వార్డ్ రోబ్ పై అరలో కనిపించింది .” ఈ ఆయుధం తో నే ఇంత సంచలనం సృష్టించారు కదూ .?” జస్వంత్ జవాబు.....చిరునవ్వు “ ఈ డైరీ చదవాలని మీకు ఎందుకు అనిపించింది . ...It reflects the mind of a lady….her sensitive feelings and thoughts. ..ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదు . ..కానీ ముత్యాల సరాల్లాంటి అక్షరాలూ ...Read More

25

నీడ నిజం - 25

సా గర్ అసహనం, కోపం తెలుసు గనుక విద్యా తను లాడ్జ్ లో డైరీ మరిచి పోయినట్లు అతడి తో చెప్పలేదు . సాగర్ కూడా విషయం తెలీనట్లే ఉన్నాడు . రాహుల్ ఫోన్ చేసినట్లు చెప్పలేదు . తన సహజావేశం తో విద్యాను నిలదీయ లేదు . డైరీ వెలుగు లోకి వస్తే రాహుల్ ప్రసక్తి వస్తుంది . రాహుల్ ‘అమ్మ’ సెంటిమెంట్ తో విద్యాను కదిలిస్తాడని సాగర్ భయం . పూర్వ జన్మ బంధాలు విద్యా జీవితాన్ని , ప్రశాంతతను కలవర పెట్టడం సాగర్ కు ససేమిరా ఇష్టం లేదు . కానీ---రాహుల్ , జస్వంత్ రాక తో అతడు ఉలిక్కి పడ్డాడు . వాళ్ళను కూల్ గా రిసీవ్ చేసుకున్నాడు . పైగా విద్యధరి గారి డైరీ రిసీ వ్ చేసుకున్నాడు . ఇంటి గుమ్మం తొక్కిన వారిని గెంటి వే య లేడుగా. “ ...Read More

26

నీడ నిజం - 26

“ నీలో మళ్ళీ కోమలను చూసి నేను కంగారు పడ్డాను . “ “కంగారెందుకు “? “......నీవు కోమల ప్రభావం లో నుంచి బయట పడేదెప్పుడు మనం ప్రశాంతమైన జీవితం గడిపెదేప్పుడు ? నా కేం తోచటం లేదు .” “జస్వంత్ చెప్పింది విన్నారుగా ? నాలో కోమలకు సామాజిక న్యాయం జరగాలి .అప్పుడే తనకు ముక్తి , నాకు విముక్తి .” “సామాజిక న్యాయమంటూ పెద్ద పెద్ద పదాలు వాడి మనల్ని భయ పెట్టి తన లక్ష్యం కోసం పావులుగా వాడుకున్టాడే మో . ?” “ఇదే పదం భరత్ అంకుల్ అంటే?” “ఆయన మన మంచి కోరే పెద్ద మనిషి ---పైగా డాక్టర్ . ఆయన మాటకు విలువ, గౌరవం ఉన్నాయి . “ “అందుకే ఆయనను కలవండి . మీ సందేహాలు తీర్చుకోండి . సమస్య నుండి బయట పడండి . “ అని జస్వంత్ ...Read More

27

నీడ నిజం - 27

నాకు ఆమెను చూడాలని ఉంది . “ ఎవర్ని ?’అజయ్ కు అర్థం కాలేదు . “పూర్వజన్మ లో మీ వదిన గారు . ఈ లో ........... భర్త కళ్ళలోకి చూస్తూ ఆగింది . అజయ్ మౌనం. జవాబు చెప్పలేని అశక్తత . “ ఏం మాట్లాడరు ?” “ ఏం మాట్లాడమంటావ్ ? ...ఏం మాట్లాడినా నీ జవాబు మౌనమేగా “ అజయ్ లో చిరు కోపం . “ అందుకు కారణం మీరే . మీరు నా నుండి ఏదో దాస్తున్నారు . అదే నాకు నచ్చటం లేదు . “ “ నేను దాస్తున్నానా ?” “ కాదా / మీ వదిన గారి సహగమనానికి సంబంధించి ఏదో నాకు తెలియ కూడని రహస్యం ఉంది . ఆ రహస్యం నాకు చెప్పటం లేదు . రాహుల్ కూడా ఆ రహస్యం తెలుసుకోవాలని పట్టుదలగా ...Read More

28

నీడ నిజం - 28

గిరిధర్ లాల్ జైపూర్ లో వెదకని లాడ్జంటూ లేదు . చిన్న చితక మొదలుకొని అయిదు నక్షత్రాల స్థాయి వరకు జల్లెడ పట్టేశాడు . ఎక్కడా వివరాలు ఆవగింజంత కూడా దొరకలేదు . అతడికి ఈ పని అప్పగించింది రూపాదేవి . అజయ్ కు చెప్పలేదు . “భర్తకు తెలియకుండా మొదట తనే విద్యాదరి ని కలవాలి . మిస్టరీ తెలుసుకోవాలి .” ఆమె ఆలోచన. అసైన్మెంట్ ఒప్పుకున్నాక గిరిధర్ మొదట విద్యాదరి టీం వివరాల కోసం గ్రామం లో వాకబు చేశాడు . ఒక అవగాహన కు వచ్చాడు . మిగతా పట్టణాలు , నగరాల తో పోల్చుకుంటే అజయ్ సింహ్ గ్రామం జైపూర్ కే కాస్త దగ్గర . పైగా సాగర్ స్థాయి వ్యక్తులు సాధారణం గా తమ విడిదికి జైపూర్ నే prefer చేస్తారు . అందుకే గిరిధర్ తన పరిశోధన జైపూర్ తో ప్రారంభించాడు ...Read More

29

నీడ నిజం - 29

“ సాగర్ ! మీరు వయసు లో నా కన్నా చిన్నవారు . అయినా పెద్దమనసు చూపించారు . ఏమిస్తే మీ ఋణం తీరుతుంది . రాహుల్ కళ్ళ లో పల్చటి కన్నీటి పొర . ‘ మీరు నాకు ప్రత్యేకం గా ఏమీ ఇవ్వక్కర లేదు . మీ చిన్నాన్న బారి నుండి విద్యాను కాపాడితే చాలు . “ స్పందన గా సాగర్ చిరునవ్వు . “ అమ్మ నా ప్రాణం. ఆమె కోసం దేవుడినైనా ఎదిరిస్తాను . పదేళ్ళ వయసు లో అమ్మను దూరం చేసుకొని చాలా పోగొట్టుకొన్నాను . మళ్ళీ ఆ పొరపాటు జరగదు . “ హామీ ఇచ్చాడు రాహుల్ . నేనూ రాహుల్ సపోర్ట్ తో నే ఇంత సాహసం చేస్తున్నాను . నాకు విద్యాగారి పట్ల కమిట్మెంట్ ఉంది . I am not totally proffessional.” జస్వంత్ భుజాలు ...Read More

30

నీడ నిజం - 30

పై కీలక సమావేశం జరుగుతున్నా సమయం లో విద్యా తన గది లో ఆలోచనలతో సతమతమవుతోంది . “ తన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఆరాటపడుతున్నారు .? మానసిక స్థాయి, , సంస్కారం పెంచుకొని సాగర్ , పుత్రికా వాత్సల్యంతో భరత్ రామ్ అంకుల్, డాక్టర్ అంకుల్ ; అనురాగం, పూర్వ జన్మ బంధం తో రాహుల్, తను తప్పక లక్ష్యం చేరుకోవాలని, కోమల కు న్యాయం జరగాలని జస్వంత్,---ఇందరి అండ దండలు తనకు తోడు నీడ గా ఉన్నప్పుడు ఎందుకు భయ పడాలి ? అయినా తనకు స్థిమితం లేదు . మనసులో ఇంకా వెలితి . కారణం ఏమిటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేసుకుంది . ఎంత మధన పడినా జవాబు స్ఫురించటం లేదు . అలసటగా కాసేపు కళ్ళు మూసుకుంది . మనసు నిగ్రహించుకోవటానికి శ్వాస మీద దృష్టి నిలిపింది . ...Read More

31

నీడ నిజం - 31

అజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు .“ నువ్వు తెర వెనుక వ్యక్తివి . పైగా మేము నియమించిన వ్యక్తివి . నిన్నెవరూ అంతగా పట్టించుకోరు . ఈ దృష్టి నా మీద ఉంది . నేనీ తాకిడి తట్టుకోవాలంటే ఆమెను ఎలాగైనా కలవాలి . చేసిన తప్పు ఒప్పుకొని ఆనాటి సంఘటనలు బయటపెట్టొద్దని మంచిగా, మన్ననగా ఒప్పించాలి . ఆమెకు నా వల్ల ఎలాంటి అపాయం ఉండడని భరోసా కలిగించాలి . నా సమస్య కు సమాధానం నేనే ! సమస్యా పరిష్కారం నా బాధ్యత .“ మీది చాలా మంచి నిర్ణయం అజయ్ బాబు ! మీరు అప్పటిలా ఆవేశపడక , నాలాంటి మరో క్షుద్రున్ని సంప్రదించక ప్రశాంతమైన మనసుతో ఆలోచించారు .తప్పక మీ ప్రయత్నం ఫలిస్తుంది . నాదొక చిన్న మనవి . దైవం ఇచ్చిన తల్లిని దూరం చేసి రాహుల్ బాబుకు మనం చాలా అన్యాయం చేశాం ...Read More

32

నీడ నిజం - 32

ఆ పెద్ద లోగిలి ముందు వ్యాను ఒక్క కుదుపు తో ఆగింది . అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు . అందరూ దాదాపు ఒకే వయసు . బాగా చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారిలా హుందాగా, గంభీరంగా ఉన్నారు . వారెవరో, ఎందుకు వచ్చారో అజయ్ కు అర్థం కాలేదు . అయినా అజయ్ వారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోమన్నాడు . తనూ కూర్చున్నాడు . “ నా పేరు భరత్ రామ్ . సైకియాట్రిస్ట్ . వీరు నా కొలీగ్స్ . .... దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం విద్యాదరి అనే పదేళ్ళ పాపను కౌన్సిలింగ్ చేశాను.” వచ్చిన నలు గురి లో ఒకరు పరిచయం చేసుకున్నారు . అజయ్ మొహం లో రంగులు మారాయి . “ విద్యాధరి ఎవరు?” భరత్ రామ్ ప్రశ్న అర్థం కాలేదు . “ ... నేను ట్రీట్ ...Read More

33

నీడ నిజం - 33

‘రాహుల్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి విద్యాధర కళ్ళు అత్తగారి కోసం అన్వేషిస్తున్నాయి . అక్కడ దిగిన గంట లోనే నాలుగు సార్లు రాహుల్ కు చేసింది . రాహుల్ నిస్సహాయం గా భరత్ రామ్ ను చూశాడు . అతడి బాధ ఆయనకు అర్థమైంది . “ విద్యా ! మీ అత్తగారిది పెద్ద వయసు కదా ? విశ్రాంతి గా పడుకొని ఉంది . రేపు ఉదయం స్థిమితం గా చూడవచ్చు . నువ్వు ఈ రాత్రి రెస్ట్ తీసికో ‘” అత్తా- కోడళ్ళ సమావేశం చాలా కీలకమైంది . విచిత్రమైన పరిస్తితుల్లో చాలాకాలం తర్వాత కలుస్తున్నారు . కలిసిన క్షణం లో వారిద్దరి భావోద్వేగం ఊహకందని స్థాయి లో ఉంటుంది . అందుకు పెద్దావిడను సిద్ధం చేయాలి . ఆవిడ రాత్రి పూట ఓ పెద్ద గ్లాసు నిండా పాలు తాగుతుంది . మరేమీ తీసుకోదు ...Read More

34

నీడ నిజం - 34

రాహుల్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి విద్యాదరి కళ్ళు అత్తగారి కోసం అన్వేషిస్తున్నాయి . అక్కడ దిగిన గంట లోనే నాలుగు సార్లు రాహుల్ కు చేసింది . రాహుల్ నిస్సహాయం గా భరత్ రామ్ ను చూశాడు . అతడి బాధ ఆయనకు అర్థమైంది . “ విద్యా ! మీ అత్తగారిది పెద్ద వయసు కదా ? విశ్రాంతి గా పడుకొని ఉంది . రేపు ఉదయం స్థిమితం గా చూడవచ్చు . నువ్వు ఈ రాత్రి రెస్ట్ తీసికో ‘” అత్తా- కోడళ్ళ సమావేశం చాలా కీలకమైంది . విచిత్రమైన పరిస్తితుల్లో చాలాకాలం తర్వాత కలుస్తున్నారు . కలిసిన క్షణం లో వారిద్దరి భావోద్వేగం ఊహకందని స్థాయి లో ఉంటుంది . అందుకు పెద్దావిడను సిద్ధం చేయాలి . ఆవిడ రాత్రి పూట ఓ పెద్ద గ్లాసు నిండా పాలు తాగుతుంది . మరేమీ తీసుకోదు ...Read More

35

నీడ నిజం - 35

సహగమనం సాంఘిక దురాచారం అన్న ఒకే ఒక్క ఆయుధం తో వారు అజయ్ పై ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు . అధికార పార్టీ లోని పై ఈ అవకాశాన్ని పూర్తిస్థాయి లో వినియోగించుకున్నాయి . సమావేశాలతో , ప్రదర్శనలతో అతడి కీర్తిని , పలుకుబడిని దెబ్బ దీశాయి . ఇలా అన్నివిధాల అడకత్తెర లో పోక చెక్క లా నలిగిపోయిన అజయ్ చివరకు భార్య ముందు తలవంచాడు . ఆనాడు జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పాడు . అలా చెప్పుకుంటే బార్య దృష్టి లో తనెంత దిగజారి పోతాడో తెలుసు . కానీ—తప్పదు .ఈ మానసిక క్షోభ కన్నా ఆ పతనం మేలు . అజయ్ చెప్పింది మౌనం గా విన్నది . ఆమె మొహం లో కోపం, బాధ, అసలు కనిపించలేదు . నిర్వికార స్థితి . అజయ్ ఆశ్చర్య పోయాడు . “ నన్ను చూస్తుంటే అసహ్యం వేయటం ...Read More

36

నీడ నిజం - 36

చిన్నగా దగ్గి సీట్లో సర్దుకుని కూర్చున్నాడు . ఆమెకు తన ఆంతర్యం తెలుసు .అయినా ఇలా అడుగుతుందంటే ఆమె మరేదో ఆశిస్తోంది జాగ్రత్తగా మాట్లాడాలి . కోమలా దేవి సహగమనం వెనుక మిస్టరీ ఉన్న మాట నిజం. అందరూ అనుమానిస్తున్నట్లే అది కోమలాదేవి తనకై తాను కోరుకున్న సహగమనం కాదు . మరెవరిదో హస్తముంది . మన:స్ఫూర్తిగా సహగమనానికి పూనుకున్న తర్వాత ఎవరూ కేకలు పెట్టరు . చితిలో నిలువునా కాలిపోతున్నా ఉలకరు, పలకరు .ముఖ్యంగా రాజపుత్ర స్త్రీలు . కోమలా దేవి రాజపుత్ర స్త్రీ కాకపోయినా సంస్కారం లో , సాహసం లో వారికే మాత్రం తీసిపోదు . ఆమె అలా కేకలు పెట్టడానికి ‘ అమ్మా’ అన్న రాహుల్ బాబు పిలుపు కారణం . విక్రం సింహ ఆమెను వివాహం చేసుకుంది రాహుల్ కోసం . ఆ బాధ్యతను కూడా కాదని ఆమె సహగమనానికి సిద్ధపడిందంటే ఆమె ...Read More

37

నీడ నిజం - 37

కోమలా ! నీ పేరు ....” “ కోమలా అని పిలుస్తూ పేరు అడుగుతారేమిటి అత్తయ్యా ?” విద్యా మాట్లాడేది గ్రామీణ రాజస్థానీ కాదు ---స్వచ్చమైన . తను హిందీ మాట్లాడ గలదు . అత్తయ్య కూడా భాష మార్చింది .” “జన్మ మారితే పేరు కూడా మారాలిగా ? ఆమె గలగలా నవ్వింది . “ మారింది...... విద్యాధరి .” విద్యాధర . పేరుకు తగ్గట్టే బాగా చదువుకున్నావు . కోమలాదేవి లా అమాయకురాలివి కావు . ఆ జన్మ లో నా మనవడికి అమ్మ లా ప్రేమ నందించావు . ఈ జన్మలో ప్రేమతో పాటు బుద్ధి , ఓర్పు నేర్పాలి . ప్రతిదానికి చిన్న పిల్లాడిలా అలుగుతాడు . కోపం తెచ్చుకుంటాడు . ఇంకా అప్పటి పసితనం పోలేదు .మనవడిని మురిపెం గా చూసింది . “ నన్ను మరీ తీసేయకు ! అమ్మకు నా ...Read More

38

నీడ నిజం - 38

తను అజయ్ వస్తాడని ఎదురు చూస్తున్నాడు . వచ్చింది అతడి భార్య రూపాదేవి ! కారణం ఏమిటో సాగర్ కు అర్థం కాలేదు . “ ! నేను రూపాదేవి---అజయ్ సింహ్ భార్యను . “ . స్వచ్చమైన ఆంగ్లం . అంతకన్నా స్వచ్చమైన చిరునవ్వు . రూపాదేవి చేతులు జోడించింది . ఆమె లో రూపం, స్వరం, వినయం, వందనం పోటీ పడుతున్నాయి . సాగర్ మర్యాదగా కూర్చోమన్నాడు . కూర్చుంది . “ విద్యాధర బాగున్నారా ? ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా ?” ఆమె ప్రశ్న కు సాగర్ సమాధానం చెప్పాడు . “ మీరు మా గ్రామం వచ్చినప్పుడు మేము లేము . పిల్లల్ని చూడటానికి జైపూర్ వెళ్లాం “ “ ఇట్సాల్ రైట్ .” అర నిమిషం నిశ్శబ్దం . సంభాషణ ఎలా పొడిగించాలో ఎవరకీ అర్థం కాలేదు . “ ...Read More

39

నీడ నిజం - 39

విద్యాదరి రాహుల్ ఇంటికి వచ్చి వారం రోజులైంది . ఈ వారం రోజుల్లో తన అత్తగారికి మరింత చేరువైంది . ఆమెతో అనుబంధం పుర్వజన్మదే అయినా భావం విద్యాధరి లో లేదు . ఆమె తో ఉన్నప్పుడు విద్యాధరి తన ఉనికి మరిచిపోయి పూర్తిగా కోమలాదేవి లా ప్రవర్తిస్తుంది . ఈ విషయం లో ముసలావిడ ఆశ్చర్యం, ఆనందం అంతా , ఇంతా కాదు. ఇప్పుడు ఆమెకు ఒకే బాధ . కోడలుంది . పెద్ద కొడుకు లేడు . విక్రం సింహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ముసలావిడే కాదు , కోమలా దేవి లా స్పందించే విద్యా కూడా ఉదాసీనం గా మారిపోతుంది . కానీ—ముసలావిడకు విక్రం లేని లోటు ప్రత్యక్ష అనుభవం. విద్యాధరి కి ఓ బాధా వీచిక , మధుర స్మృతి . ఒక సాయంకాలం విద్యాలయం రోడ్డు వెంబడి విద్యాధరి , రాహుల్ నడవ సాగారు ...Read More

40

నీడ నిజం - 40

“ నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను . ...దయచేసి నన్ను ఆపొద్దు . , రాహుల్! విద్యాధరి స్వరం లో చిరాకు, చిరుకోపం, అభ్యర్ధన . రాహుల్ నిస్సహాయంగా చూశాడు . “ మీ చిన్నాన్న రహస్యం తెలిస్తే నాన్నమ్మకు ఏదో అవుతుందని కదూ నీ భయం ? ..మరి, తెలియకుండా ఎన్నాళ్ళు దాచి పెడతావ్ ? మీ పిన్ని నన్ను చూడలేదు . ... చూసుంటే ? ఎంత గొడవ జరిగేది ?” రాహుల్ చూపుల్లో మళ్ళీ అదే నిస్సహాయత . “ .... ఎప్పటికైనా నిజం ఆమెకు తెలియాలి . మనం ఆపినా ఆగదు. దాచినా దగదు . ఒక్కసారిగా తెలిసి ఆమె కృం కృం గిపోవటం కంటే ముందుగానే ఆ పరిస్థితికి ఆమెను సిద్ధం చేయటం మంచిది కదా ?”” రాహుల్ కాదనలేక పోయాడు . కానీ, ముందుగా భరత్ రామ్ అనుమతి తీసుకోవాలని ...Read More

41

నీడ నిజం - 41

తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న భరత్ రామ్ , జస్వంత్ లకు విద్యాధరిని ప్రపంచానికి పరిచయం చేయటానికి శంకుస్థాపన అనువైన సంధర్భం అనిపించింది . అందుకు వేదిక కావాలి . ఆ వేదిక పై విద్యా తన పునర్జన్మ రహస్యాన్ని ప్రపంచానికి చాటాలి . అందుకు రాజకీయ వర్గాల అండదండలు అవసరం . రాజకీయ ప్రముఖులు , మనస్తత్వ నిపుణులు , మేధావులకు ఆ వేది క కేంద్ర బిందువైతే ; అశేష ప్రజానీకం ముందు విద్యా వేదిక పై నిలబడి అజయ్ ను ఎదుర్కొంటే ---ఆ వేదిక చరిత్ర సృష్టించగలదు . అజయ్ అన్నివిధాలా ఆశక్తుడ వుతాడు . అతడు ప్రజా న్యాయస్థానం ముందు తలవంచక తప్పదు . శంకుస్థాపన రోజే గ్రామం లో జాతీయ స్థాయి లో ఆ సభ జరగాలి . నిజం వెలుగు చూడాలి . కోమల శాంతించాలి . ఆలోచనకు పూర్తి రూపం ...Read More