జాస్మి

(10)
  • 41.7k
  • 5
  • 18.8k

"నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావ్." సూటిగానే అడిగింది జాస్మి. వివేక్ వెంటనే ఏమీ చెప్పలేకపోయాడు.అతడినే చూస్తుంది జాస్మి. అది కాలేజీ ఆవరణ. వారి చుట్టూ.. వారికి దరి దరిన.. కొంత మంది స్టూడెంట్స్ తమ సొద తమదిగా కదలాడుతున్నారు. వాళ్లెవరూ వీళ్లని పట్టించుకోవడమే లేదు. "చెప్పు." అంది జాస్మి. "ఏం చెప్పేది." అవస్థ పడుతున్నాడు వివేక్. "చాన్నాళ్లుగా నా వెంట పడుతున్నావ్. క్లాసులో నన్నే పట్టి పట్టి చూస్తున్నావ్. నాతో మాట్లాడడానికి యత్నిస్తున్నావ్. ఏమిటిదంతా." చకచకా మాట్లాడింది జాస్మి. వివేక్ బిత్తరయ్యి పోయాడు. అతడినే సూటిగా చూస్తుంది జాస్మి. "మరి.. మరి.. అది కాదు.." అంటున్నాడు వివేక్. "ఏం కాదు." టక్కున అంది జాస్మి. "అదే.. మరి.. మరి.. నువ్వంటే.." తడబడుతున్నాడు వివేక్. "ఆ. నేనంటే.. బోలో. కక్కై." విసురుగా అంది జాస్మి. తల గోక్కుంటున్నాడు వివేక్. "చేవ లేనోడివి. నీలాంటోడికి ప్రేమలెందుకు." కసురుకుంది జాస్మి. "అబ్బే ప్రేమ కాదు. నువ్వంటే ఇష్టం. అంతే." తడబడుతున్నాడు వివేక్. "అబ్బఛా." అంది జాస్మి తేలిగ్గా. తల దించుకున్నాడు వివేక్. "నిలతీస్తే నిలబడ లేక పోతున్నావు. నీకు ఎందుకు ఈ వెంపర్లాటలు. పోఫో." చెప్పుతుంది జాస్మి. "ప్లీజ్. ప్లీజ్." ఆమెకు అడ్డు పడ్డాడు వివేక్. "నాకెందుకు ఈ తంటాలు." అంది జాస్మి. వివేక్ ఏదో చెప్పబోతుండగా - "చాలు. ఇంతకీ కోరి పిలిచి నీతో ఈ రోజు మాట్లాడుతుంది ఎందుకో తెలుసా." ఆగింది జాస్మి. వివేక్ ఆమెనే చూస్తున్నాడు. "నీ చేష్టలకు బ్రేక్ వేయించడం కోసమే." చెప్పింది జాస్మి. వివేక్ ఏమీ అనలేక పోతున్నాడు. "సూటిగా చెప్పేస్తున్నాను. వినుకో. నాకు ఇట్టివి గిట్టవ్. నన్ను విడిచి పెట్టేయ్." చెప్పేసింది జాస్మి. "అది కాదు.." చెప్పుతున్నాడు వివేక్.

Full Novel

1

జాస్మి (JASHMI) - 1

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 1వ భాగం. ...Read More

2

జాస్మి (JASHMI) - 2

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 2వ భాగం. ...Read More

3

జాస్మి (JASHMI) - 3

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 3వ భాగం. ...Read More

4

జాస్మి (JASHMI) - 4

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 4వ భాగం. ...Read More

5

జాస్మి (JASHMI) - 5

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 5వ భాగం. ...Read More

6

జాస్మి (JASHMI) - 6 - Last Part

జాస్మి ఒక ఇమేజర్ స్టోరీ. తల్లితనం అగుపర్చే ప్రేమ కథ. 6 భాగాల నవలలో 6వ భాగం. ...Read More