నా ఫిలాసఫీ.....

(15)
  • 89.2k
  • 6
  • 30.8k

... నా ఫిలాసఫీ లోంచి కొన్ని సత్యాలు... " జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "... @.... మన జీవితంలో సంభవించే ప్రతీ అనుభవానికి మనమే బాధ్యులను.... @....మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.... @....ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది..... @.... ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం , తోనూ, మరి తప్పు చేశా మేమో అన్న భావం తోనూ బాధపడుతుంటారు.... @...ప్రతి ఒక్కరూ తమలోపల నేను బాగాలేను... అన్న అసంతృప్తితో ఉంటారు... @...ఇది కేవలం "ఆలోచన" మాత్రమే ....మరి ఆలోచనలను మనం మార్చుకోవచ్చును..... @...మనమే "రోగాలు" అనబడే వాటికి మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము..... @.... క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమో అన్న భావన, మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచనా విధానాలు......

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

నా ఫిలాసఫీ..... - పరిచయం

..... నా ఫిలాసఫీ లోంచి కొన్ని సత్యాలు..." జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "...@.... మన జీవితంలో సంభవించే ప్రతీ అనుభవానికి మనమే బాధ్యులను....@....మనం చేసే ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది....@....ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది.....@.... ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం , తోనూ, మరి తప్పు చేశా మేమో అన్న భావం తోనూ బాధపడుతుంటారు....@...ప్రతి ఒక్కరూ తమలోపల నేను బాగాలేను... అన్న అసంతృప్తితో ఉంటారు...@...ఇది కేవలం "ఆలోచన" మాత్రమే ....మరి ఆలోచనలను మనం మార్చుకోవచ్చును.....@...మనమే "రోగాలు" అనబడే వాటికి మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము.....@.... క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమో అన్న భావన, మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచనా విధానాలు......@....క్రోధ భావనను వదిలిపెట్టేస్తే "కాన్సర్" సైతము నయమవుతుంది.....@.....మనం గతాన్ని పూర్తిగా విసర్జించి,ప్రతీ ఒక్కరినీ క్షమించేయాలి.......@....మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి....@.....ఈ క్షణంలో మనల్ని మనం ...Read More

2

నా ఫిలాసఫీ... - 1

Part___1(b) ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలే...ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును*బహిర్ ప్రపంచంలో మన సమస్య ఏదైనా ,మన పరిస్థితి ఏదైనా అది అంతర్ ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే....మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పుకు తీసుకురావచ్చు....*మన పట్ల మనకున్న" ద్వేషం,"కూడా నువ్విలా ఉన్నావు,నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం, లాంటి ఆలోచనలే!!! నేను చాలా చెడ్డవాడిని,అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అసలు మీరు భావించరు.... ఇలా ఆలోచనలే మనలో భావాన్ని సృష్టిస్తాయి... ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా!!! మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును... మొదట నీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆలోచనల వల్ల జనించే భావన కచ్చితంగా మిమ్మల్ని వదిలి పెడుతుంది....*ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి... అంతే తప్ప ,"మనకు ఇటువంటి ఆలోచనలు ...Read More

3

నా ఫిలాసఫీ... - 2

నా ఫిలాసఫీ part ___2(a) నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది... నా శరీరం గాయపడుతుంది.. రక్తము స్రవిస్తుంది... నొప్పిస్తుంది....ఉబ్బుతుంది.. మడదబడుతుంది... పుండ్లపాలు అవుతుంది... ముడతలు పడుతుంది... వయసు అయిపోతోంది... సరిగ్గా నడవలేదు... చూడలేదు.. వినలేదు... ఎన్నో రోగాలు మారిన పడుచుంది... ఇలా ఎన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకుని ఉండవచ్చు ...వీటన్నిటిని నేను విని ఉన్నాను ఇతరులతో నా సంబంధిత బాంధవ్యాలు సరిగ్గా ఉండవు.... అందరూ నా భావాలను వ్యక్తపరిచ నివ్వకుండా నన్ను అణచి వేస్తున్నారు....నాకు ఎవరూ లేరు... నాతో బెట్టు చేసినట్లు ప్రవర్తిస్తారు.... నన్ను ఎవరు సమర్థించరు.... నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తారు నా దారిన నన్ను వదలరు...ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు... నన్ను ఎవరు ప్రేమించరు... నేను చెప్పేది మాత్రం ఎవరూ వినిపించుకోరు... నేను ఒంటరి వాడిని/ దానను.... నన్ను అందరూ అవమానిస్తారు ...వాళ్లు మానసికంగా నెగ్గెందుకు నన్ను ఓడిస్తారు ....ఇంకా ...Read More

4

నా ఫిలాసఫీ... - 3

నా ఫిలాసఫీ పార్ట్__3(b)మనల్ని మనము ప్రేమించుకోవడం సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ,ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని... అది "మనల్ని మనం ప్రేమించుకోవడం"... అనేది అద్భుతమైన ఔషధము ....మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.... మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే.... మనం సాధించిన అభివృద్ధికి లేదా, విజయాలకు గర్వపడడమో,లేక అహంభావంతో ఉండడమో, లేక మీరు ఉన్న స్థితితో పోల్చుకొని ఇతరులను తక్కువ చూడడమో, కాదు ....ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు.... ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది, మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవం అవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల ,మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల, మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి.....ఇక్కడ" ప్రేమ "అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం ....ప్రేమ అనేది జీవితపు ఏ ...Read More

5

నా ఫిలాసఫీ... - 4

నా ఫిలాసఫీ Part __2(c) నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదుఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది.... మరీ ముఖ్యంగా ఆమె పంటివరుసలనీ.... ఎంతో మంది "పంటి "డాక్టర్లను కలిసింది ...వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అద్వాన్నంగా చేశారు ....అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది... ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన, "నేను అందంగా లేను "అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపజేశారు.... నిజానికి ఆమె అసలు సమస్య ,ఆమె రూపురేఖలు కావు ...ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం.... ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురక పెట్టేది.... చుట్టూ ఉన్నవాళ్లు చాలా అసహనంగా భావించేవారు ...ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది ....బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది... కానీ, ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ ...Read More

6

నా ఫిలాసఫీ... - 5

3... సమస్య ఎక్కడి నుండి వస్తుంది ? Part ____3(a) "గాతకాలం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రమూ లేదు"సరే!!! మనమెన్నో విషయాల్ని ప్రస్తావించు ...మనము సమస్య అనుకొనే దాని నుండి ప్రారంభించి, ఎన్నో మలుపులు తిరిగి, 'అసలు సమస్య 'ఏమిటో తెలుసుకున్నాము..." మనము బాగాలేము" అన్న భావన మరి" మన పైన మనకు ప్రేమ లేకపోవడం "అనేది మనలో ఉండడమే అసలు సమస్య .అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచి ఉత్పన్నమవుతుంది .ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నడి వచ్చాయో చర్చిద్దాం....తమ గురించి, తమ జీవితం గురించి, పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సుతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని, భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా? అనర్హులమనే భావన, తాము ప్రేమించబడము ,అనే భావనలు అందరిలోనూ ఏదో తీవ్రతల్లో ఉంటాయి. ...Read More