1 నేను.. నాది.. - బివిడి ప్రసాదరావు సుకన్య.. నల్లగా ఉంటుంది. లావుగా ఉంటుంది. యుక్త వయసుది కనుక.. నిగనిగ లాడుతుంటుంది. తన చదువు.. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం. నా చదువు.. పదో తరగతి. ఇద్దరం.. ఎదురెదురు ఇళ్ల వాళ్లం. ఇద్దరం.. పక్క పక్కగా నడుస్తున్నాం. శివరాత్రి జాగరణ.. అంటూ.. మెల్కొని ఉన్నాం. 'ఒక టిక్కెట్టుతో రెండు సినిమాలు' అంటే.. వెళ్తున్నాం. "సుకన్యా.." పిలుస్తోంది తన తల్లి. సుకన్య ఆగి.. అటు చూసింది. నేనూ.. సుకన్యతో పాటు నిలిచి పోయాను. మా వెనుక.. సుకన్య అమ్మ.. మా అమ్మ.. వస్తున్నారు. "నెమ్మదిగా నడవండి.." సుకన్య తల్లి చెప్పింది. "మీతో మేము నడవ లేక పోతున్నాం" అమ్మ అంది నవ్వుతూ. ఇక తప్పక.. అందరమూ కలిసి నడిచాం. సినిమా హాలులోకి చేరుకున్నాం. మా అమ్మలు.. మా ముందు కుర్చీల్లో.. నేను.. సుకన్య.. సరిగ్గా వాళ్ల వెనుక కుర్చీల్లో.. కూర్చున్నాం. సుకన్యే.. పక్క
Full Novel
నేను.. నాది.. - 1
నేను.. నాది.. (1వ భాగం) - బివిడి ప్రసాదరావు ఇది ఒక మనిషి మనసు ఆట. ఎన్ని ఐనా, ఏం ఐనా చివరికి చేరేది అక్కడికే అని తెలిపే/నేరిపే రచన. ఇది (70s’) నాటి కథ. ...Read More
నేను.. నాది.. - 2
నేను.. నాది.. (2వ భాగం) - బివిడి ప్రసాదరావు ఇది పక్వంలోని మదుల అలజడుల ఊట. ఎన్ని ఐనా, ఏం ఐనా చివరికి చేరేది అక్కడికే అని తెలిపే/నేరిపే రచన. ఇది (70s’) నాటి కథ. ...Read More
నేను.. నాది.. - 3
నేను.. నాది.. (3వ-చివరి-భాగం) - బివిడి ప్రసాదరావు ఇది యవ్వనం లొల్లిలో మనసు తేట. ఎన్ని ఐనా, ఏం ఐనా చివరికి చేరేది అక్కడికే అని తెలిపే/నేరిపే రచన. ఇది సెవెన్టీస్ నాటి కథ. ...Read More