శశివదనే - మొదటి భాగం

(8)
  • 67.1k
  • 2
  • 29k

అది హంపి నగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలిస్తున్న కాలం. శివుడు విరూపాక్ష ఆలయంలో ప్రధాన శిల్పిగా ఆ రోజే నియమించబడ్డాడు. శివుడికి ఒక ఇరవై-పాతిక ఏళ్ల వయసు ఉంటుంది. అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెదనాన్న సంరక్షణ లోనే పెరిగాడు. శివుడికి చిన్నప్పటి నుండి శిల్ప కళ మీద అభిరుచి. అతడు చేసిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతుందని అందరూ గొప్పగా చెప్పుకోవటం తో ఆ వార్త రాజు గారి చెవిన పడి ఆయన నుండి పిలుపు వచ్చింది. ఆ రోజు కాలినడకన తన గ్రామం నుండి హంపి నగరానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఆ నగరం గురించి వినటమే కానీ అదే చూడటం. ఆ మహా నగరాన్ని చూడటానికి అతడి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటం వల్ల వీధులు దీపాల కాంతి తో మెరిసి పోతున్నాయి. విరూపక్షుని గుడికి చేరువ అయ్యే కొద్దీ

New Episodes : : Every Tuesday

1

శశివదనే - మొదటి భాగం

అది హంపి నగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలిస్తున్న కాలం. శివుడు విరూపాక్ష ఆలయంలో ప్రధాన శిల్పిగా ఆ రోజే నియమించబడ్డాడు. శివుడికి ఒక ఏళ్ల వయసు ఉంటుంది. అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెదనాన్న సంరక్షణ లోనే పెరిగాడు. శివుడికి చిన్నప్పటి నుండి శిల్ప కళ మీద అభిరుచి. అతడు చేసిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతుందని అందరూ గొప్పగా చెప్పుకోవటం తో ఆ వార్త రాజు గారి చెవిన పడి ఆయన నుండి పిలుపు వచ్చింది. ఆ రోజు కాలినడకన తన గ్రామం నుండి హంపి నగరానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఆ నగరం గురించి వినటమే కానీ అదే చూడటం. ఆ మహా నగరాన్ని చూడటానికి అతడి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటం వల్ల వీధులు దీపాల కాంతి తో మెరిసి పోతున్నాయి. విరూపక్షుని గుడికి చేరువ అయ్యే కొద్దీ ...Read More

2

శశివదనే - రెండవ భాగం - 2

దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు. ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది. శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. “ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో భగవంతుని సేవకు అంకితం అయిపోవటం సాధ్యమేనా? దానికి ఎంత నిస్వార్థత, నిబద్ధత ఉండాలి” అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఆమె పై గౌరవ భావం కలిగింది. ఆ తరువాత రోజు కూడా గిరిజ ఉదయాన్నే గుడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. సంగీత నృత్యాలతో భగవంతుని ఆరాధించినది. ఆ రోజు మద్యాహ్నం దేవుడికి నివేదన అయిపోయాక పూజారి గారు శివుడిని పిలిచి – “అబ్బాయి శివుడూ, ఈ ఊరికి క్రొత్తగా వచ్చావు కదా ఈ చుట్టు పక్కల ప్రదేశాల విశిష్టత తెలుసునా?” అని ...Read More

3

శశి వదనే - చివరి భాగం - 3

“అంటే జీవితాంతం మీరు ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక తోడు, నీడ, వివాహం..” అని ఆపేశాడు. “మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” ఆమె చిన్న నవ్వు నవ్వింది. ********************** “నన్ను ఇక్కడ నిత్య సుమంగళి గా గౌరవిస్తారు, ప్రతి పెళ్ళిలో నేను మంగళ సూత్రాన్ని తాకిన తరువాతే వధువుకి మాంగల్య ధారణ జరుగుతుంది. నాకు జీవితాంతం వైధవ్యం లేదు. స్వామి వారికి చేసే ప్రతి పూజా కార్యక్రమం నేను లేనిదే జరగదు. సమాజం నుండి గౌరవం, రాచ మర్యాదలతో కూడిన జీవితం. ఇంతకు మించి ఇంకేమి కావాలి?” అన్నది తనకు తాను సమాధాన పరుచుకునేటట్లు. “సమాజం గౌరవిస్తుందనో లేక రాజ్యం కావాలనుకుంటోందనో కాదు మీ కోసం మీరు ఆలోచించుకున్నారా? మీ బాధలు, సంతోషాలు మీతో పంచుకునే వ్యక్తి ఒకరు కావాలని, వీరే కావాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా ” అని అసలు సందేహాన్ని బయట పెట్టాడు ...Read More