నువ్వేనా..నా నువ్వేనా.. 4

  • 583
  • 144

రేణు పళ్ళు కొరుకుతూ చేతిలో ఉన్న కొబ్బరి కాయ విసురుతుంది.. విజయ్ తెలివిగా పక్కకి తప్పుకున్నాడు.. ఆ కొబ్బరి కాయ వెళ్ళి పూజారికి తలకి తగిలి చచ్చానురా దేవుడా అంటు కింద పడిపోతాడు..అసలు కుదురుగా ఉండరుగా కోప్పడుతూ ఇద్దరినీ చూస్తుంది అంజలి..చుట్టూ ఉన్నవాళ్ళు పూజారిని కూర్చో పెట్టి నీళ్ళు ఇస్తారు..బానే ఉందా హాస్పటలకి పదండి అంటు విజయ్ తనని పైకీ లేపుతాడు... వావ్ పుజారి గారు మీరు చాల స్ట్రాంగ్ కొబ్బరి కాయా తగిలిన మీకేమీ కాలేదు అని అమాయకంగా చూస్తు అంటుంది రేణు..రేణు మాటలకి అందరు భళ్ళున నవ్వారు... పుజారికి నవ్వాలో ఏడవాలో తెలియక హాస్పటలకి బయలుదేరాడు..అదిగో ఆయన వస్తున్నాడు మీసంగతి చెప్తా ఉండండి అని అక్కడికి వస్తున్న భూపతికి ఎదురేళ్తుంది అంజలి..మామ్.. నేను నేమీ.. చేశాను అంతా అదే చెసింది పైగా ఏమి చేయనట్టు ఆ ముఖం చూడు ఎలా పెట్టిందో అంటూనే అక్కడికి వస్తున్న భూపతి ని చూసి బయపడుతున్నాడు విజయ్..అమ్మ చూడు వాడు మళ్ళి అబద్దం చెప్తున్నాడు ముందు వాడే నన్ను పిల్లలతో కలసి నన్ను ఏడిపించాడు అందుకే అని అమాయకంగా ముఖం పెట్టేసింది రేణు.. నాకేమీ తెలియదు మీ నాన్న వస్తున్నాడు ఏంచెప్తావో చెప్పుకో... మనం