సుభాష్ అక్కడ నుంచి మానసని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. సుభాష్ మరియు మానస ఒకే దగ్గర ఉంటున్నారు .ఇద్దరు చాలా అనందంగా ఉంటున్నారు కొన్ని రోజులు ఆలా గడిచిపోయాయి . ఒక రోజు సుభాష్ మానస ఇద్దరు మాట్లాడుకుంటారు సరదాగా సుభాష్: నువ్వు ఎంత వరుకు చదువుకున్నావు ? మానస : డిగ్రీ కంప్లీట్ చేశా, అది కూడా చెల్లి కోసం. తనకి చదువు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తను ముంబైలో ఉంటుంది. తనని కొన్ని సంవత్సరాల క్రిందనే "ముంబై" పంపించేసా. కానీ తనకి నేను ఈ పని చేయడం అసలు ఇష్టం లేదు, అన్ని వదిలేసి తనతో వచ్చేయ్ అని చాలా సార్లు అడిగింది . కానీ ఆలా వెళ్లడం అంతా సులభం కాదు అని తనకి తెలియదు. అప్పటినుంచి నాతో పెద్దగా మాట్లాడదు, అక్కడే ఒక న్యూస్ పేపర్ లో పని చేస్తూ ఉంటుంది .ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది. మనం ఫోన్ చేయలేము తనకి, ఎందుకంటే తనకి అవసరమైతేనే ఫోన్