ఈ కథ ఒక ఆర్మీ అధికారి గురించి . అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి . అతని ప్రేమ గురించి. అలాగే అతన్ని బాగా inspire చేసినటువంటి ఒక అధికారి గురించి, దేశం మీద ఒక సైనికుడికి ఉండే భక్తి , విధేయత గురించి. మరియు ఆర్మీ లో జరిగే కొన్ని అక్రమ ఒప్పందాలు , వాటి వెనుక ఉన్న కొంత మంది పెద్దల గురించి, వాటికి వ్యతిరేకంగా ఇద్దరు అధికారుల చేసే పోరాటమే ఈ కథ . అతని పేరు సుభాష్. అతను హైదరాబాద్ లో అతని స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. సుభాష్ కి అతను తప్ప ఎవరు లేరు. చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. అతని స్నేహితుడి పేరు హేమంత్. ఇద్దరు చిన్నపుడు నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు. హేమంత్ ఒక sofrware కంపెనీ లో పనిచేస్తున్నాడు. సుభాష్ కి ఆర్మీ లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి ఆర్మీ పరీక్షలు రాసి