ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "అయితే నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించావన్న మాట." అంతవరకూ రెండో కూతురి మీద వున్న చిరాకు మాయం అయిపొయింది మంగవేణిలో. "ఎంతవరకూ వచ్చింది?" "చాలా దూరం వచ్చింది." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ. " ఇంక పెళ్లి ఒక్కటే తరువాయి." "ఏది, సరిగ్గా చెప్పు? నువ్వు ఏమేం చేసావ్ వాడితో, ఎలా చేశావ్?" ఉత్సుకత ఇంకా పెరిగిపోయింది మంగవేణిలో. " అంతా నువ్వు చెప్పినట్టుగానే చేశాను మామ్. ముందు ఒప్పుకోలేదు, నన్ను ప్రేమించలేనంటూ మొండికేసాడు. కానీ నువ్వు చెప్పింది నిజం మామ్, నా అందాల్ని ఎరవేసేసరికి కాదనలేక పోయాడు. ఇప్పుడు నా వెనకాల కుక్కపిల్లలా తిరుగుతున్నాడు." "భేష్! నా కూతురివనిపించావు. కానీ ఇదే సరిపోదు. మీ ఇద్దరి మధ్య కాస్త ఆ ఇది కూడా అయిపోయి....." "అది కూడా అయిపోయింది