ఇన్స్పెక్టర్ :- శివయ్యగారు, మీకు అనుమానం ఉంది అంటున్నారు కాబట్టి మేము రంగా గారి మీద కేసు వేస్తున్నాం. కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేవరకు ఈ విషయం బయిటికి చెప్పద్దు. ఒకవేళ విచారణ లో ఆయనే దోషి అని తెలిస్తే మేమే యాక్షన్ తీస్కుని మీకు చెప్తాం. శివయ్య సరే అని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ వెంటనే పోలీస్ జీప్ లో రంగా ఇంటికి వెళ్తారు. ఇన్స్పెక్టర్ రంగా ఇంట్లోకి వెళ్ళగానే, రంగా మనుషులంతా రంగా ని, ఇన్స్పెక్టర్ ని ఒంటరిగా వదిలేసి బైటికి వెళ్ళిపోతారు. రంగా :- ఏమైంది? నేను చెప్పినట్టే చెప్పి ఉరిని నమ్మించావా? ఇన్స్పెక్టర్ :- మీరు తీస్కోచ్చిన కీరతకమైన హంతకులని దొంగల్ని చేసి.. మిమ్మల్ని తప్పించడం కోసం సూర్య ని గొప్పోడ్ని చేసిన సరే. ఆ శివయ్య గారు వదలడం లేదు. ఇందాకే మీ మీద కేసు పెట్టి వెళ్లారు. రంగా :- ఆ శివయ్య కి వచ్చింది అనుమానం మాత్రమే. అది నిజం