ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 3

  • 1.1k
  • 621

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "తను మనింట్లో నలభై రోజులు కాదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటానన్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చేసింది నాకు." మదన్ చెప్పింది వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. "కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకు ఎందుకు చెప్పలేదు? మాకు కావాల్సిందల్లా నీ ఆనందమే కదా." ఆ సమయం లో కిచెన్ లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా వున్నారు. "అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా ఒకటి రెండు సంవత్సరాలు బాచిలర్ గానే ఉండాలని వుంది." అలా చెప్పాలని తట్టినందుకు ఆనంద పడ్డాడు మదన్. "నేను ఇప్పుడూ అదే మాట అనబోతూ వున్నాను. మీరిద్దరూ లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు