నిరుపమ - 20

  • 357
  • 135

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఆ సమయంలో తన మోహంలో ఏం ఎక్స్ప్రెషన్ చూసారు? ఏ ఫీలింగ్ డిటెక్ట్ చేశారు? ఎదో ఫీలింగ్, ఎక్సప్రెషన్ లేకుండా కచ్చితంగా వుండివుండదు." స్మరన్ అడిగాడు సూటిగా ఇంకా రంగనాథ్ మొహంలోకి చూస్తూ. రంగనాథ్ మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడిపోయాడు. "గుర్తు చేసుకోండి. జాగ్రత్తగా అలోచించి చెప్పండి. ఇది చాలా క్రూసల్." "ఎస్, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్ నేను డిటెక్ట్ చేసినట్టుగా అనిపించింది." సడన్గా కళ్ళు తెరిచి అన్నాడు రంగనాథ్. "ఏమిటది? ఆ ఫీలింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ ఏమై ఉండొచ్చు?" "గిల్టీ....గిల్టీ....ఫీలింగ్.....తనేదో తప్పుచేసి బాధపడుతున్నటుగా నాకనిపించింది." ఇంకా ఎలాంటి ప్రామ్ప్టింగ్ లేకుండా అన్నాడు రంగనాథ్. "అది ఇంకే ఫీలింగ్ కానీ అయివుంటుందని నాకు అనిపించడం లేదు." "దట్స్ ఇట్ మిస్టర్ రంగనాథ్. నా థియరీ మరింత స్ట్రాంగ్ అయింది. రేపే మీరు అంతగా