నిరుపమ - 10

  • 768
  • 366

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఐ సీ."   సమీర ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అంది మేనక. "అయన పెళ్లి చేసుకోలేదు. ఒక్కరే ఆ ఇంట్లో వుంటున్నారు. కానీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. ఎవరైనా ఆయన్ని చూస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. నేను, ఇంకా నిరుపమ అయన వల్ల ఎంతగా ఇంప్రెస్ అయ్యాము అంటే ఎం.ఎస్సి మాథ్స్ తో చదవాలనుకున్న వాళ్ళం ఎం.ఏ సైకాలజీ తీసుకున్నాం." తనూ కొంచం కాఫీ ఇంకో కప్పులో పోసుకుని సిప్ చెయ్యడం మొదలు పెట్టింది సమీర. "నిజం చెప్పాలంటే నిరుపమ చనిపోయాక నేనూ అయన దగ్గరికి పెద్దగా వెళ్లడం మానేసాను. కానీ నువ్వు వస్తానంటే మనిద్దరం కలిసి వెళదాం. నువ్వూ చాలా ఇంప్రెస్ అవుతావు ఆయన్ని చూస్తే." సమీర మళ్ళీ అంది. "కచ్చితంగా." నవ్వింది మేనక. "నేను సైకాలజీ నా స్టడీస్ లో సబ్జెక్టుగా ఎంచుకోక పోయినా