నిరుపమ - 9

  • 846
  • 315

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీ పరిస్థితి నాకు అర్ధం అయింది. మీరు అక్కడికి వెళ్తే ఆ జ్ఞాపకాలతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే నాకూ అనిపిస్తూంది. మీరు అవి తట్టుకోగలరనే కాన్ఫిడెన్స్ వచ్చేవరకు అక్కడికి వెళ్లొద్దు. అయినా ఆ పెద్దవాళ్ళ ఇద్దరిగురించి బాధపడొద్దు. నేను వాళ్ళకి వాళ్ల అమ్మాయి లాగే అనిపిస్తూ వున్నాను. నన్ను చూసి చాలా స్వాంతన పొందుతున్నారు. కొంతకాలంపాటు నేను వాళ్ళని చూసుకుంటాను." "నిజంగానే? నువ్వు చెప్పేది వింటూవుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూంది." సడన్గా సమీర మొహం ఆనందంతో నిండిపోయింది. "హండ్రెడ్ పర్శంట్ ట్రూ. జస్ట్ బి రిలాక్స్డ్. నిరుపమ బెస్ట్ ఫ్రెండ్ గా మీ ఫీలింగ్ వాళ్ళ గురించి ఎలా ఉంటుందో నేను అంచనా వెయ్యగలను. ఫర్ ది ప్రెసెంట్ ఐ యామ్ దేర్ ఫర్ దెమ్." కుర్చీని సోఫాకి దగ్గరికి లాక్కుని, సమీర కుడి చేతిని