నిరుపమ - 8

  • 675
  • 324

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "జస్ట్ ఆలా నా ఫ్రెండ్ ని కలుసుకుని మాట్లాడదామని వెళ్ళాను." మేనక మళ్లీ ఇంటికి వెళ్లేసరికి నిర్మల ఒక్కర్తీ మాత్రమే ఇంట్లో వుంది. "సారీ ఎక్కువ సమయం బయట గడిపేసినట్టుగా వున్నాను." "ఏం పర్లేదులే. నిరుపమ కూడా ఇంతే. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందంటే, ముఖ్యంగా ఆ సమీర ఇంటికి వెళ్లిందంటే సమయం తెలియదు. ఎంత సేపైనా అక్కడే ఉండిపోతుంది." కుర్చీలోనుంచి లేస్తూ అంది నిర్మల. "నువ్వు కాస్త నీ రూంలో రెస్ట్ తీసుకుంటూ వుండు, నేను వంటింట్లో పనిపూర్తి చేస్తాను." "మీరు ఏమి అనుకోకపోతే ఆంటీ నేను మీకు వంటింట్లో సాయం చేస్తాను." ఆమె మొహంలోకి చూస్తూ అంది మేనక. "నాకు వంట ఏమీ రాదు. మామ్ నేర్చుకోమంటుంది. కానీ నాకే నేర్చుకోవాలనిపించదు. కానీ మామ్ కి మాత్రం వంటింట్లో సాయంగా వుంటూ వుంటాను." "నీకు నిరుపమకి