నిరుపమ - 5

  • 183
  • 66

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీరు నిరుపమ ఆత్మహత్యకి సంభందించి ఏదైనా క్లూ దొరుకుతుందని నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ మిస్టర్ స్మరన్ ఆ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ కాలేనేమో అనిపిస్తూంది." మరోసారి నిట్టూర్చాడు నిరంజన్. "నిరుపమ మీకు చాలా క్లోజ్ కదా. మీరంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేది." నిరంజన్ అన్నది తను విననట్టుగానే అన్నాడు స్మరన్. "నేను అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నేను తనకీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో జాయిన్ అయింది." నవ్వుతూ అన్నాడు నిరంజన్. "తను తన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేదా?" "తన తండ్రి తరువాత ఏ అరమరికలు లేకుండా ఇంకెవరితోనైనా తన విషయాలు షేర్ చేసుకుందీ అంటే అది కేవలం నాతోనే. తనకీ సంభందించిన ప్రతి విషయం