వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎందుకు భయపడుతున్నావ్" అంటాడు. శాంతి :- "అయ్యో, వాడు మా ఇంట్లో పనోడు, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే." వీర ఆ పనోడిని పిలిచి "ఇదిగో, ఈ 500 ఉంచుకో. ఇక్కడ చూసింది మాత్రం మీ పెద్దయ్యగారికి కానీ మీ చిన్నయ్య గారికి కానీ చెప్పకు" అని అంటాడు. ఆ పనోడు డబ్బులు తీస్కుని "కంగారు పడకండి చిన్నమ్మగారు, నేను చూసింది మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పను" అని అంటాడు. ఆ పనోడు అక్కడ్నుండి వెళ్ళిపోయి, ఊరిలో ఉన్న టెలిఫోన్-బూత్ దగ్గరికి వెల్లి ఒక ఫోన్ చేస్తాడు. పనోడు :- "అయ్యా, మీరు వెతుకుతున్న అవకాశం మీకు దొరికింది అయ్యా, ఆ శివయ్య కూతురు శాంతి, వీర ప్రేమించుకుంటున్నారు."అటు ఫోన్ నుంచి రంగా "శభాష్, మంచి వార్త వింపించావు, ఈ దెబ్బతో ఆ శివయ్య పని, ఈ ధర్మ-వీర ల పని పట్టేయచ్చు. ఒకే దెబ్బకి