అరె ఏమైందీ? - 25

  • 885
  • 375

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "అవి...........అవి.............నేను చెప్పినా ఎవరూ నమ్మరమ్మా." మంజీర గొంతు వణికింది. "అంతేకాకుండా మమ్మల్ని అసహ్యించుకుంటారు. అందుకనే నేను మంజీరని అవెవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాను." "నీలాంటి అమాయకురాలు అబద్ధాలు చెప్పదు. నువ్వు చెప్పేవి నమ్మకపోవడం ఉండదు. అవేమిటో చెప్పు." తనచేతిని ఇంకా అలాగే పట్టుకుని అడిగింది తనూజ. "అంతేకాకుండా మిమ్మల్నెవరూ అసహ్యించుకోరు. దయచేసి వాటిని చెప్పు. ఇది మంజీర జీవితాన్ని కాపాడడానికి చాలా అవసరం." "లేదమ్మా, అవి ఒకరికి చెప్పుకోగలిగే విషయాలు కావు." తన చేతిని తనూజ చేతులనుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మంజీర. "నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పనా?" తన చేతిని విడిపించుకోనివ్వకుండా అలాగే పట్టుకుని తనూజ అడిగింది. "నిన్ను అమాయకురాలిని చేసి ఆ విచికిత్సానంద స్వామి నీ మీద అత్యాచారం చేసాడు. నిన్ను అనుభవించాడు. ఇది మంజీర కి కూడా తెలుసు. ఇది ఎవరూ నమ్మరనే