మనసిచ్చి చూడు - 2

  • 2k
  • 963

                    మనసిచ్చి చూడు... 2కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు కానీ గౌతమ్ లో మాత్రం ఎలాంటి భావం లేదు.కాసేపటికి తేరుకుంది.       జరగాల్సిన తంతు పూర్తి అవుతూ ఉంది.మాంగల్య ధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది.కానీ కంట్రోల్ చేసుకుంది.అంతా పూర్తి అయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.           కొత్త పెళ్ళి కూతురికి ఉండాల్సిన కల తనలో  అసలు లేదు.గుండెల్లోని బాధ కళ్లలో తెలుస్తుంది.ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమ గారు.సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ.కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు,తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా.        ప్రతాప్ వర్మ కళ్లలో కొంచెం సంతోషం కనిపిస్తుంది.తన కొడుకు పెళ్ళి