అరె ఏమైందీ? - 16

  • 909
  • 471

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అప్పుడప్పుడు అన్నా నేను నా భార్యతో అలా మాట్లాడుకోగలుగుతున్నాని నాకు ఆనందం గా వుంది. నాకు ఆ ఆనందం లేకుండా చేస్తావా? మరి నిర్మల తనలోకి రాకుండా చేసేస్తావా? సర్వేశ్వరం కోపంగా అడిగాడు తనూజ ముఖంలోకి చూస్తూ.  మరి తనంటే అంత ప్రేమ వున్నవాడివి, తను భర్తగా నిర్ణయించిన అనిరుధ్ కే  ఇచ్చి పెళ్ళిచెయ్యాలని ఎందుకు అనుకోలేదు? ఆ నిరంజన్ కి ఇచ్చి చేద్దామని ఎందుకు అనుకున్నావు? తనూజ అడిగింది. అప్పటికే నిరంజన్, ఇంకా మంజీర ఎదో లవ్ లో వున్నట్టుగా చిదంబరం చెప్పాడు. మంజీర కూడా తామిద్దరూ మంచి స్నేహితులమనే చెప్పింది. చిన్నతనం లో ఎంతో క్లోజ్ గా కలిసి ఆడుకున్నా, తరువాత, తరువాత అనిరుధ్ గురించి మంజీర ఏం మాట్లాడలేదు. ఇంక అనిరుధ్ ని పెళ్లిచేసుకోమని ఏమని అడగను? సర్వేశ్వరం అన్నాడు. దానికి ఎవరూ