అరె ఏమైందీ? - 11

  • 183
  • 81

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నో ఆంటీ. నేను అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామనుకోవడానికి కారణం కేవలం నా మామ్ ఆలా కావాలనుకుందని మాత్రమే కాదు. ఏదో తెలివితక్కువగా అలోచించి అనిరుధ్ తో ఆలా బిహేవ్ చేసాను, దూరం పెట్టాను తప్ప, తనంటే నిజంగానే ఇష్టపడుతున్నాను. ఆలా అంటున్నప్పుడు మంజీర బుగ్గలు ఎర్రబడిపోయి సిగ్గుతో తలదించుకుంది. సరే అయితే. కానీ నీ పెళ్లి ఇలా అనిరుధ్ జరిపించాలనుకోవడం మాత్రం సరికాదు. ఇది నేను అంగీకరించలేను. తనూజ అంది. నాకూ తనని అలా బలవంతపెట్టడం ఇష్టం లేదు. అనీజీ ఎక్సప్రెషన్ తో అంది మంజీర. కానీ తను వేరేలా ఒప్పుకుంటాడనిపించడం లేదు. మీరిద్దరూ నేను మీ శ్రేయోభిలాషినని, మీ మంచే కోరుకుంటానని ఒప్పుకుంటారు కదా. మంజీర ఇంకా సర్వేశ్వరం మొహాల్లోకి చూస్తూ అడిగింది తనూజ. నీకన్నా మా మంచి చెప్పేవాళ్లెవరుంటారు? అందుకనేకదా నిన్ను పిలిచి నీకు