నులి వెచ్చని వెన్నెల - 22 (Last Part)

  • 1.7k
  • 630

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ   సమయం పదకొండున్నర అవుతూంది. మీ  అంకుల్ పదకొండు గంటలకే వస్తానని చెప్పారు కానీ ఇంకా రాలేదు. ఫోన్ కూడా అటెంప్ట్ చెయ్యడం లేదు. తను మాట నిలబెట్టుకోగలరంటావా? సోఫాలో తన పక్కనే కూచున్న మేనక మొహంలోకి చూస్తూ అడిగింది సమీర. ఇప్పటివరకూ ఒక్క అసైన్మెంట్ లో కూడా మా అంకుల్ ఫెయిల్ కాలేదు. కాస్త లేటయ్యారు అంతే. మీరు కొంచెం ఓపిక పట్టండి. మేనక అంది. దానికి మేనక ఎదో అనబోతూ ఉండగా స్మరన్ ఇంకా అనురాగ్ అక్కడకి వచ్చారు. వాళ్ళని చూస్తూనే సమీర, మేనక ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇద్దరం కలిసి వద్దామనుకున్నాం, నా వల్లనే లేటయింది. అక్కడున్న సోఫాలో కూలబడుతూ అన్నాడు అనురాగ్. ఎలాగు వచేస్తున్నాం కదాని ఫోన్ అటెంప్ట్ చెయ్యలేదు. స్మరన్ అక్కడున్న కుర్చీలో కూచుంటూ అన్నాడు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా వున్నాను మిస్ సమీరా.