అన్న చెల్లెలి అనుబంధం

ఒక ఊరిలోని ఒక కుటుంబంలో అమ్మ, అన్న మరియు  చెల్లి ఉండేవారు. వారు చాలా పేదవారు. నాన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భాద్యత మొత్తం వాళ్ళ అమ్మ పైన పడింది. పిల్లలిద్దరూ చాలా  చిన్న వాళ్లు  అవడంతో వారు అమ్మకి సహాయం చేయలేకపోయారు. రోజు కూలి పనులకి వెళ్లి సంపాదించిన దానితో ఉన్నంతలో పిల్లలిద్దరినీ బాగా చూసుకుంటూ స్కూల్ లో కూడా జాయిన్ చేసింది. కొన్నాళ్ళకు  అమ్మ  ఆరోగ్యం  క్షీణించి  మరణించింది.ఆ కుటుంబంలో ఇక పెద్దవారంటూ ఎవరు లేరు.. చిన్న వాళ్ళైనా అన్న చెల్లి మాత్రమే ఉన్నారు. అన్న ఎలాగైనా తన చెల్లిని బాగా చదివించాలని ఆశయంతో రోజు మొత్తం కూలి పనులు చేసి తన చెల్లిని మంచి  స్కూల్లో చేర్పించాడు మరియు తాను కూడా ఎదగాలనే ఆశతో రాత్రి బడికి వెళ్లి చదువుకోవడం మొదలు పెట్టాడు.రోజంతా కూలి పని చేసుకోసుకోవడం, చెల్లికి కష్టం కలగకుండా చూసుకుంటూ రాత్రుల్లో బడికి వెళ్లి