వంతెన

  • 1.2k
  • 1
  • 333

ఒకప్పుడు పక్క పక్క  పొలాల్లోనే పనిచేసుకునే  ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారు. 40 ఏళ్ల వారి వ్యవసాయ జీవితంలో  ఇదే వారి మొదటి గొడవ. వారు ఎప్పుడు చాలా  అన్యోన్యంగా ఉండేవారు. వ్యవసాయ అవసర నిమిత్తం, ఇద్దరు కలిసి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి  ఆ యంత్ర సామాగ్రిని పంచుకుంటూ, శ్రమను మరియు వస్తువులను అన్నిటిని పంచుకుంటూ కలివిడిగా వ్యవసాయం చేసుకునేవారు.  ఇపుడు జరిగిన గొడవ కారణంగా …, సుదీర్ఘ కాలంగా  కొనసాగుతున్న వారి సహాయ సహకారాలు ఆగిపోయాయి. ఇది ఒక చిన్న అపార్థంతో ప్రారంభమై చాలా రోజుల తర్వాత .., అతి పెద్ద గొడవతో ఇద్దరు విడిపోవడం జరిగింది. చాలా  మంది తెలిసిన వారు మరియు ఊరి పెద్దలు వాళ్ల  గొడవను తగ్గించి, వాళ్లని తిరిగి కలపడానికి ప్రయత్నించారు. కానీ, అవి ఏమి జరగలేదు.ఒకరోజు ఉదయం వడ్రంగి పని చేసేవాడు అన్నయ్య ఇంటి తలుపు తట్టాడు. అన్నయ్యతో.., “నేను కొన్ని రోజుల