నులి వెచ్చని వెన్నెల - 12

  • 1.3k
  • 588

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అసలు ఏం జరిగింది? ఎక్కడనుండి ఆ ఫోన్ కాల్?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మల్లిక. "లాస్ట్ నైట్ నిరంజన్ హార్ట్ ఎటాక్ తో పోయాట్ట." సమీర అంది. "ఆ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియదు." "వాట్?" నమ్మలేనట్టుగా చూస్తూ అంది మల్లిక. "థర్టీ టు ఇయర్స్ యంగ్ మాన్. అతను హార్ట్ ఎటాక్ తో పోవడం ఏమిటి? ఎదో ప్రాంక్ కాల్ అయివుంటుంది." "అలా కూడా కావచ్చు." అలా అన్నాక సడన్గా గుర్తుకువచ్చింది సమీరకి. "ఎదో వీడియో క్లిప్ పంపిస్తానన్నాడు. చూద్దాం." సెల్ ఫోన్ తీసుకుని చూస్తే, నిజంగానే ఎదో వీడియో క్లిప్ వాట్సాప్ లో వేచివుంది. ఆతృతగా ఆ వీడియో క్లిప్ ని ఓపెన్ చేసి చూసింది సమీర. మల్లిక కూడా అంతే అతృతతో అదే చూస్తూంది. "ఇట్ ఈజ్ రియల్లీ వెరీ మచ్ షాకింగ్ దట్ సచ్