గురుదేవో భవ: గురువుల గొప్పదనం..

  • 1.7k
  • 1
  • 501

యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు స్టాలిన్‌. అంతటి జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య