నులి వెచ్చని వెన్నెల - 3

  • 1.6k
  • 897

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఒళ్ళు భగ్గుమని మండింది సమీరకి. తను ఆ బిజినెస్ అంతటికి సోల్ ఓనర్. అయినా అంత అహంకారంగా మాట్లాడుతూ వున్నాడు. తమ ఎంప్లొయీస్ అందరిలో తనని ఏకవచనంలో సంభోదించేది వీడొక్కడే.  "నా బిజినెస్, నా ఆఫీస్, నా ఇష్టం. నాక్కావాలంటే వస్తాను, లేకపోతే లేదు. అయితే ఏంటి?" తను కోపంగా అడిగింది. "నేనేం అది కాంట్రడిక్ట్ చెయ్యదలుచుకోలేదు. కాకపోతే నేనూ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నాను. కంపెనీకి ఇంకా ఇందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలక్కుండా చూడాల్సిన బాధ్యత నామీద వుంది. అందుకనే నీ బాధ్యత నీకు గుర్తు చేస్తూ వున్నాను. అయినప్పటికీ నన్నే విషయాలలోనూ కల్పించుకోవద్దంటే నాకే అభ్యంతరం లేదు." వెంటనే కోపంగా ఇంకేదో అనబోయి చటుక్కున ఆగిపోయింది. ఎంత తను అనురాగ్ అంటే ఇరిటేషన్ ఫీల్ అవుతూవున్నా, తను చెప్పిన దాంట్లో రీజన్ వుంది. "ఇవాళ