నాన్నకు ప్రేమతో....

  • 2.5k
  • 1
  • 1.1k

నాన్నకు ప్రేమతో....బిడ్డను నవమాసాలు మోసేది అమ్మ అయితే... ఆ బిడ్డ జీవితాన్ని మోసేవాడే నాన్న ... ప్రేమకు చిరునామాగా ఉంటూ, బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేస్తూ... అనుక్షణం తన బిడ్డల సుఖ సంతోషాల కోసం కరిగే కొవ్వత్తి అతడు వారి జీవితాల్లో వెలుగులు నింపే సూరీడు నాన్న. నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది నాన్న... ఈ లోకంలో నా వేల అడుగుల ప్రయాణానికి, తొలి అడుగు మొదలు పెట్టింది నాన్న.... నా గమ్యానికి చేరుకోవడానికి మార్గం చూపింది నాన్న... నా ధైర్యం నాన్న, నా సర్వస్వం నాన్న... నాన్న ప్రేమ వరం, నాన్న లేని జీవితం భారం... నాన్న ! నీకు నడక నేర్పించాడు, నలుగురిని నీతో నడిపించమనే నడవడిక నేర్పించాడు. నీకు మొదట రాత నేర్పించాడు, అది నీ తలరాత మార్చేందుకు ప్రోత్సాహాన్నిచ్చాడు. నీకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు, అతనికి భయం కలిగితే నిన్ను తలచుకున్నాడు. నువ్వు