ప్రేమాధ్యంతం - 2

  • 7.3k
  • 1
  • 3.1k

తన తల్లి తండ్రిని చూస్తూ ఏడుస్తున్న ఆమె కన్నీరు రాథోడ్ మనసుని కాస్త కూడా కరిగించవు ఆ క్షణం.ఇరవై ఏళ్ళు కంటికి రెప్పలా మారి తన అమ్మ, నాన్న చెంతన ఆనందంగా గడిపిన ఆ అమ్మాయి ప్రయాణం ఓ భయంకరమైన నరక కూపంలోకి వెళ్తుంటే కన్నీరు, మున్నీరుగా విలపిస్తాయి అక్కడి తండా వాసుల సున్నిత హృదయాలు."దయచేసి నన్ను వదిలేయండి దొర, మీ కాళ్లు పట్టుకుంటాను"... అంటూ ఎక్కిళ్ళు పెడుతున్న ఆ అమ్మాయి మాటలు పూర్తి కాకుండానే ఒక్కసారిగా బిగుసుకుపోతుంది.పోకెట్ నుండి తీసిన గన్ వేళ్ళతో తిప్పుతున్న అతని చర్యకి గొంతులో మాటలు అక్కడే సమాధి చ