My Prince - 1

  • 16.1k
  • 2
  • 5.5k

ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం వింటూ ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B టెక్ ఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్