నిజం - 24

  • 3.6k
  • 1.5k

After one weak : హాస్పిటల్ నుండి బాబుని , స్వప్న ని కూడా డిశ్చార్జ్ చేశారు . కానీ సంపత్ కి గాయం ఇంకా తగ్గలేదు , కొన్ని రోజులు బెడ్ మీదే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు డాక్టర్ . 11 వ రోజు పాపను ఉయ్యాలలో వేసే ఫంక్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు వాళ్ల మామిడి తోటలో . మామిడి చెట్ల మధ్యలో వుయ్యాల ఎరుపు, పసుపు బంతి పూలతో చక్కగా అలంకరించారు . వుయ్యాలలో పాపని పడుకోబెట్టడానికి చిలక పచ్చ రంగు పట్టు చీర వేశారు . తెల్లటి మేని ఛాయ లో వున్న పాప ఎర్రటి పట్టులంగా లో మెరిసి పోతుంది . వుయ్యాల చూట్టూ వేసిన కుర్చీల్లో వూరి జనమంతా కూర్చున్నారు . ఎంతో సందడి గా ఉంది ఆ ప్రాంతం . ఈ లోగా అక్కడికి చేరుకున్నారు మన