నిజం - 20

  • 3.5k
  • 1.5k

ప్లాన్ లో మళ్లీ చేంజ్ దేనికి sir అడిగాడు చంద్రం , అదేంటి చంద్రం ఎందుకంటావ్ ఇందాక ఆ భీమన్న చెప్పాడు కదా కృష్ణా పాలస్ హోటల్ నుండి రావడం చూసా అని అక్కడికి వెళ్లి అడిగితే సరిపోతుంది కదా ఎందుకు వూరంతా తిరగటం ఇంకా అన్నాడు రాఘవులు , అవును sir ఆకలితో వుండి సరిగా పట్టించు కోలేదు, అయితే అక్కడి కే వెళదాం పదండి అంటూ లేచాడు చంద్రం. సాగర్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు , ఏమయ్యింది సాగర్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావ్ పద అన్నాడు రాఘవులు , ఈ రెస్టారెంట్ అతను చెప్పిన ఏరియా కి 2 km ల దూరంలో వుంది అయినా సరే ఇక్కడికే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి , తను స్టే చేసే చోట ఎవరికీ అనుమానం రాకుండా అలా చేసి వుండ వచ్చు , అలాంటప్పుడు అతను వచ్చినప్పుడల్లా ఒకటే