నిజం - 18

  • 3.9k
  • 1.5k

కాసేపు నిశ్శబ్దం తప్ప మాటలేమీ వినపడలేదు విజయ్ కి , లైన్ లో వెయిట్ చేస్తున్న విజయ్ కి 5 నిమిషాలు తరువాత వినాయక్ గొంతు వినిపించింది. వినాయక్ : హెల్లో విజయ్ గారు మీ డౌట్ నిజమే ఈ బొమ్మ లో ఒక చిన్న సీసీ కెమెరా ఉంది , దాని ద్వారా ఈ బొమ్మ ముందు జరిగేది అంతా వాళ్ల డివైస్ నుండి చూడొచ్చు , అంతే కాదు మరొక చిన్న డివైస్ కూడా ఉంది దాని ద్వారా వాళ్ళు రిమోట్ తో ఆపరేట్ చేసి ఈ బొమ్మ నుండి సౌండ్స్ వచ్చేవిధం గా కూడా చేయవచ్చు . విజయ్ : వాళ్లు ఆ కెమెరా నీ ఇంకా ఆ డివైస్ ని వాళ్ళ దగ్గరున్న మొబైల్ కి గానీ పిసి కి గాని కనెక్ట్ చేసి ఉండొచ్చు , మీరు దాని గురించి ఏమయినా తెలుసుకోగలరా .