నిజం - 17

  • 3.8k
  • 1.5k

మరి మరిడయ్య నీకు ఫోన్ చేశాడా అని అడిగాడు విజయ్ , మ్ చేశాడు అర్ధరాత్రి దాటింది సుమారు 2 గంటల ప్రాంతంలో మరిడయ్య ఫోన్ చేసాడు , అతను ఫోన్ చేసే ముందే విచిత్రం గా ఆ బొమ్మ నుండి శబ్దాలు రావడం ఆగిపోయాయి , అందుకే సడన్ గా ఫోన్ రింగ్ అయ్యేసరికి కొంచెం భయ పడ్డాను , మళ్ళీ మరిడయ్య ఏమైనా ఫోన్ చేసాడు ఏమో అని ఫోన్ ఎత్తాను , అప్పుడు వరకు వచ్చిన శబ్దాల గురించి మరిడయ్య కు చెప్పాను , అప్పుడు మరిడయ్య మాట్లాడుతూ నాకు అంతా తెలుసు అక్కడ జరిగేది అంతా నాకు ఇక్కడ పూజ లో తెలుస్తూ నే వుంటుంది , నేను ఇప్పటి వరకు చేసిన పూజ వల్లే ఆ శబ్దాలు ఆగాయి , నేను ఎక్కువ సేపు దానిని కట్టడి చేయలేను , నేను చేయాల్సింది చేశాను