నిజం - 8

  • 4.4k
  • 2k

విద్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన సాగర్ రాఘవులు కి కాల్ చేసాడు హాస్పిటల్ పేరు అడిగి వెంటనే ఆటో ఎక్కి హాస్పిటల్ కి చేరాడు , రాఘవులు తో మాట్లాడినప్పుడు చెప్పాడు S.I పేరు విజయ్ అని , హాస్పిటల్ కు చేరుకున్నాక అక్కడ వాళ్ల ఊరి పోలీస్ జీప్ కనిపించింది , అది చూసి ఇది మా వూరి పోలీస్ జీప్ వూరి పేరు ఉంది దీని మీద , అని మనసులో అనుకుంటూ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు సాగర్ ,అక్కడ రిసెప్షన్లో ఉన్న యువతి ని చూసి మేడం బయట పోలీస్ జీప్ ఉంది కదా దానిలో వచ్చిన పోలీస్ ఎక్కడ ఉన్నారు అడిగాడు polite గా , కంప్యూటర్ లోకి చూస్తూ తన వర్క్ లో బిజీ గా ఉన్న ఆ యువతి సాగర్ మాటలు వినగానే తల పైకి ఎత్తి చూసింది , కళ్ళు