నిజం - 4

  • 4.4k
  • 2.2k

జీప్ క్వార్టర్స్ కి వెళ్ళే లోపు case డీటైల్స్ చూసాడు విజయ్, రాఘవులు కూడా కిందటి రోజు వూళ్ళో జరిగిన విషయాలు అన్ని చెప్పాడు , సో ఇప్పుడు అందరికీ పోలవరం సర్పంచ్ మీద డౌట్ ఉంది ,కానీ పిల్లాడు అక్కడ కూడా దొరకలేదు అంతేకదా మీరు చెప్పేది అన్నాడు విజయ్ , అంతే sir అన్నాడు రాఘవులు తటపటాయిస్తూ , ఏంటి రాఘవులు గారు ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్టున్నారు అడిగాడు విజయ్ , అబ్బే ఏం లేదు సర్ మీరు నా పై ఆఫీసర్ కదా నన్ను మీరు ,గారు అంటున్నారు మీలాంటి వారిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాఘవులు. విజయ్ చిన్నగా నవ్వుతూ మీరు వయసులో పెద్దవాళ్ళు ఇంకా experienced కూడా సో ఆమాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు , ఈలోపు జీప్ క్వార్టర్స్ చేరుకుంది లోపలనుండి పనివాళ్ళు వచ్చారు, sir తను లక్ష్మి