నిజం - 2

  • 5.2k
  • 2.9k

అయితే అందరం కలిసి ఇప్పుడే ఆ రామలింగం ఇంటికి వెళ్లి చుట్టు ముడదాం అన్నాడు ఆవేశంగా యువకుడైన వీరేశం ,అవును వెళదాం అంటూ అరిచారు ఇంకొంత మంది. ఆవేశంతో కాదు ఆలోచించి చేయాలి ఏదయినా ఏ ఆధారం లేకుండా ఏమి చేద్దామని వెళతారు గట్టిగా అన్నాడు కానిస్టేబుల్ రాఘవులు. ఏంటి రాఘవ బాబాయ్ అనుమానం ఉండి కూడా చేతులు కట్టుకొని కూర్చోమని అంటావా అన్నాడు వీరేశం , నువ్వేగా అంటున్నావ్ అనుమానం అని అతడే చేశాడని ఆధారం లేదు ,ఈ రోజు మన వూరిలో కొత్తవాళ్లని ఎవరయినా చూసారా చెప్పండి అన్నాడు రాఘవులు ,లేదు అన్నారు అంతా, మరి ఏం చెయ్యాలి నువ్వే చెప్పు రాఘవులు బాబాయ్ అన్నాడు వీరేశం కొంచెం తగ్గి , నేను case file చేసి సర్పంచ్ గారితో సైన్ చేపించాను, మోహన్ కొంత మందితో ఒక పక్క రెండు వూళ్లు వెతకటానికి వెళ్ళాడు, ఇంకొక పక్క