ఈ పయనం తీరం చేరేనా...- 1

  • 34.8k
  • 3
  • 13.4k

రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...వర్షం పడుతూ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు... అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి... అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..." అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి